కొంప ముంచిన MCX, అగ్రిమెంట్‌ దెబ్బకు మట్టి కరిచిన షేర్లు

[ad_1]

MCX share Price: ఇవాళ (శుక్రవారం, 30 జూన్‌ 2023) స్టాక్‌ మార్కెట్లు కొత్త లైఫ్‌ టైమ్‌ గరిష్టాలకు చేరితే, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX) షేర్లు మాత్రం మట్టి కరిచాయి. ఇంట్రా-డే ట్రేడ్‌లో 12.5% తగ్గి రూ. 1,437 స్థాయికి పడిపోయాయి. 63 మూన్స్‌ ‍‌(63 Moons) కంపెనీ ఇస్తున్న సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ సర్వీస్‌ను MCX ఎక్స్‌టెండ్‌ చేసింది. ఈ కౌంటర్‌లో నష్టాలకు ఇదే కారణం.

కొత్త ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్‌ కోసం టాటా గ్రూప్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో (TCS) దాదాపు రెండేళ్ల క్రితమే MCX ఒక అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. సాఫ్ట్‌వేర్‌ డెలివరీలో TCS మరింత జాప్యం చేయడంతో, ప్రస్తుతం 63 మూన్స్‌ ఇస్తున్న సర్వీస్‌ను MCX పొడిగించింది. ఇలా చేయడం ఇది మూడోసారి. తాజా విడతలో, ఈ ఏడాది జులై 1 నుంచి ఆరు నెలల పాటు 63 మూన్స్‌ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ సర్వీస్‌ను MCX ఎక్స్‌టెండ్‌ చేసింది.

2021లో TCSతో MCX ఒప్పందం
సెక్యూరిటీస్ ట్రేడింగ్, మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను డిజైన్‌ చేసి ఇవ్వడానికి 2021 సెప్టెంబర్‌లో TCSను MCX హైర్‌ చేసుకుంది. అప్పటికి, 63 మూన్స్‌తో అమల్లో ఉన్న అగ్రిమెంట్‌ 2022 సెప్టెంబర్‌లో ముగుస్తుంది. ఈ అగ్రిమెంట్‌ ముగిసేలోపు ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌ను భర్తీ చేసే కొత్త సాఫ్ట్‌వేర్‌ ఇవ్వడం TCS పని. ఈ ఐటీ కంపెనీ ఇప్పటికీ కొత్త సాఫ్ట్‌వేర్‌ను MCXకు పూర్తిస్థాయిలో అందించలేదు.

MCX కోసం TCS ఇప్పటికే ఒక కొత్త ప్లాట్‌ఫామ్‌ను డిజైన్‌ చేసి, గంటల పాటు ట్రయల్‌ బేసిస్‌లో పరీక్షించింది. ట్రయల్స్‌ సందర్భంగా కనిపించిన బగ్స్‌ను ప్రస్తుతం సరి చేస్తున్నారు. 96-97% టెస్టింగ్‌ కేసులు క్లియర్‌గా ఉన్నట్లు సమాచారం. అతి త్వరలోనే సాఫ్ట్‌వేర్‌ షిఫ్టింగ్‌ జరుగుతుందని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ నమ్మకంగా ఉంది. 

మధ్యాహ్నం 12.20 గంటలకు, బీఎస్‌ఈలో, MCX స్క్రిప్ 8.64% తగ్గి రూ.1,500 వద్ద ట్రేడవుతోంది.

గత ఒక ఏడాది కాలంలో ఈ స్టాక్ దాదాపు 15% పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD), పడుతూ లేస్తూ సాగిన పరుగు మధ్య కేవలం 3% పెరిగింది. 52-వారాల గరిష్టం రూ. 1,697 కాగా, 52-వారాల కనిష్టం రూ. 1,156,

ట్రేడింగ్‌ టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నందున, కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్‌-టు-డేటెడ్‌గా డిజైన్‌ చేయడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతోందని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ షిఫ్టింగ్‌ పూర్తయితే, తక్కువ సాంకేతికత & ఆప్షన్స్‌ వాల్యూమ్‌లో వృద్ధి కారణంగా కంపెనీ వ్యయాలు తగ్గుతాయన్నది అంచనా. ఫలితంగా, ఎబిట్‌ మార్జిన్ FY23లోని 27% నుంచి FY25లో 56%కు పెరుగుతుందని మార్కెట్‌ లెక్కలు వేసింది. 

మరో ఆసక్తికర కథనం: పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ వడ్డీ రేటు పెరిగే ఛాన్స్‌, సాయంత్రానికి ప్రకటన!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *