కొత్త ఫాసినో, రే జెడ్ఆర్ వచ్చేశాయ్ – లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త వెర్షన్!

[ad_1]

Yamaha New Scooters Launched: ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్స్ రెండు కొత్తగా అప్‌డేట్ చేసిన స్కూటర్లు ఫాసినో, రే జెడ్‌ఆర్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త Fascino S 125 Fi హైబ్రిడ్ (డిస్క్) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.91,030గా యమహా నిర్ణయించింది.

కాగా, రే జెఆర్‌ను రే జెడ్‌ఆర్ 125, రే జెడ్‌ఆర్ స్ట్రీట్ ర్యాలీ అనే రెండు వేరియంట్‌ల్లో విడుదల చేశారు. ఇందులో రే జెడ్‌ఆర్ ధర రూ.89,530గా, స్ట్రీట్ ర్యాలీ ధర రూ.93,530గా ఉంది. కంపెనీ తన మోటార్‌సైకిళ్లు అయిన ఎఫ్‌జెడ్, ఆర్ 15, ఎంటీ 15 అప్‌డేటెడ్ వెర్షన్‌ను కొంతకాలం క్రితం మార్కెట్లో విడుదల చేసింది.

కొత్తగా ఏం ఉండనున్నాయి?
యమహా ఫాసినో, రే జెడ్ఆర్ స్కూటర్‌లు కొన్ని కాస్మొటిక్ అప్‌డేట్‌లను పొందుతాయి. ఈ స్కూటర్ ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్లు, కొత్త ఫీచర్లతో ఈ20 ఇంధన కంప్లైంట్, ఓబీడీ2 కంప్లైంట్ ఇంజన్‌తో రానుంది. ఈ టెక్నాలజీ రియల్ టైం ఎమిషన్స్‌ను ట్రాక్ చేస్తుంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఈ స్కూటర్‌లు ఇప్పుడు Wi-Connect యాప్‌తో బ్లూటూత్ కనెక్టివిటీని, యాప్ ఫ్యూయల్ కన్స్యూమర్ ట్రాకర్, మెయింటెనెన్స్, లాస్ట్ పార్కింగ్ వెన్యూ, మాల్‌ఫంక్షన్ నోటిఫికేషన్, రెవ్స్ డ్యాష్‌బోర్డ్, రైడర్ ర్యాంకింగ్ అనేక ఇతర ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ఏ రంగుల్లో లభించనుంది?
ఈ కొత్త స్కూటర్లు వినూత్నమైన కలర్ స్కీమ్‌లో మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో రెండింటి డిస్క్ వేరియంట్‌కు డార్క్ మ్యాట్ బ్లూ కలర్ ఇవ్వబడింది. రే జెడ్ఆర్ మాత్రం స్ట్రీట్ ర్యాలీ మ్యాట్ బ్లాక్, లైట్ గ్రే వెర్మిలియన్ అనే రెండు కొత్త రంగులలో అందుబాటులో ఉంటుంది. రే జెడ్ఆర్ డిస్క్, డ్రమ్ వేరియంట్‌లు ప్రస్తుత రంగులు న్యూ మ్యాట్ రెడ్, మెటాలిక్ బ్లాక్, సియాన్ బ్లూ వంటి కొత్త గ్రాఫిక్స్‌లో లాంచ్ అయ్యాయి.

ఇంజిన్ ఎలా ఉంది?
ఈ కొత్త స్కూటర్ల ఇంజన్ గురించి చెప్పాలంటే ఇప్పుడు వీటిలో E20, OBD2 కంప్లైంట్ ఇంజన్ అందించారు. రెండు స్కూటర్లు 125 సీసీ, సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో 8.2 PS పవర్, 10.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్‌లో స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టమ్ కూడా ఉంది. ఆటోమేటిక్ స్టాప్, స్టార్ట్ సిస్టమ్, బిల్ట్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ స్విచ్ కూడా ఇందులో అందించారు.

Activa 125తో పోటీ
Yamaha Fascino ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Honda Activa 125తో పోటీపడుతుంది. ఇందులో 124 సీసీ ఇంజిన్‌ను అందించారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 88,428గా ఉంది.





[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *