కొలెస్ట్రాల్‌ కరిగించి, గుండెకు మేలు చేసే.. కూరగాయలు ఇవే..!

[ad_1]

Vegetables Lower Cholesterol: మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైన భాగమో.. మనందరికీ తెలుసు. శరీరం అంతటికీ రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన అవయవం. రక్తం ద్వారా శరీర భాగాలకు ఆక్సిజన్‌ అందిస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, ఆల్కహాల్‌, స్మోకింగ్, సరైన ఆహారం తీసుకోకపోవడం, చెడు ఆహార అలవాట్లు, హైపర్‌టెన్షన్‌, అధిక కొలెస్ట్రాల్ కారణంగా.. గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఈ కారణాలు వల్ల గుండె సమస్యలు, గుండె పోటు ముప్పు పెరుగుతుంది. ఈ కారకాలలో ప్రధానంగా చెప్పుకోవలసింది.. అధిక కొలెస్ట్రాల్‌‌ స్థాయిలు. హై కొలెస్ట్రాల్‌ గుండెపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి.. కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మన డైట్‌లో కొన్ని కూరగాయలు తరచుగా చేర్చుకుంటే.. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యాన్ని రక్షించేందుకు తాజా కూరగాయలు సహాయపడతాయి. కూరగాయల్లో గుండె హృదయనాళ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ముఖ్య పోషకాలు మెండుగా ఉంటాయి. కూరగాయలలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇవి బరువును కంట్రోల్‌లో ఉంచుతాయి. కూరగాయల్లో కొలెస్ట్రాల్‌ కరిగించే.. పెక్టిన్‌ అనే ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించే కూరగాయులు ఏమిటో ఇప్పడు చూద్దాం.

బ్రకోలీ..

బ్రకోలీ..

బ్రకోలీలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను కరిగించే అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చు. ఈ కూరగాయలో సల్ఫర్-రిచ్ సమ్మేళనం సల్ఫోరాఫేన్‌ మెండుగా ఉంటుంది. ఇది ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గింస్తుంది. జీర్ణవ్యవస్థలో, బ్రోకలీలోని ఫైబర్ బైల్‌ యాసిడ్‌తో కలుస్తుంది. ఇది రక్తనాళాలో పేరుకున్న కొలెస్ట్రాల్‌ను బయటుకు పంపడాన్ని సులభతరం చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు తీసుకుంటే.. కడుపు నిండుగా ఉంటుంది. తద్వారా చిరుతిళ్లు, ఎక్కువగా ఆహారం తినకుండా ఉంటాం. (Image source – pixabay)

కాలే..

కాలే..

కాలేలో పొటాషియం, ఫైబర్, ఫోలేట్‌, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాలే తరచుగా మన డైట్‌లో తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు కరిగి.. గుండె జబ్బులు ముప్పు తగ్గుతుంది. కాలేలో విటమిన్ ఏ, కె, బి6, సీ వంటి విటమిన్లతో పాటు.. లుటిన్‌ సమృద్ధిగా ఉంటుంది. లుటిన్‌ శరీరంలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా నిరోధిస్తుంది, బ్లెడ్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. మీ సలాడ్స్‌లో కాలే ఉండేలా చూసుకోండి. (Image source – pixabay)

కాలీఫ్లవర్‌..

కాలీఫ్లవర్‌..

ఇందులోని సల్ఫోరఫేన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ గుండె జబ్బులను నివారిస్తుందని వివిధ అధ్యయనాల్లో తేలింది. సల్పోరఫేన్‌ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాలీఫ్లవర్‌లోని పోషకాలు రక్త నాళాలు బిరుసెక్కడం, రక్తపోటు లాంటి సమస్యలను నివారిస్తాయి. కాలిఫ్లవర్‌లో కొలెస్ట్రాల్‌ దాదాపుగా ఉండదు. కాలీఫ్లవర్‌లో ప్లాంట్ స్టెరాల్స్ ఉంటాయి. ఇది ఒక రకమైన లిపిడ్. పేగులు కొలెస్ట్రాల్‌ను గ్రహించకుండా ఇది ఆపుతుంది. (Image source – pixabay)

ముల్లంగి..

ముల్లంగి..

ముల్లంగిలో ఆంథోసైనిన్ అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గిస్తుంది. మన సిరలు, ధమనులలో వాపును నివారిస్తుంది. ముల్లంగిలో కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్‌తో పాటు.. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి హైపర్‌టెన్షన్‌ తగ్గిస్తాయి, గుండె జబ్బులు నుంచి రక్షిస్తాయి. ముల్లంగిలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యలు దూరంగా ఉంటాయి. (Image source – pexels)

క్యారెట్‌..

క్యారెట్‌..

క్యారెట్ మన డైట్‌లో తరచుగా తీసుకుంటే.. మన మన హృదయానికి ఎంతో మేలు జరుగుతుంది. క్యారెట్‌లోని బీటా-కెరోటిన్‌ మన శరీరంలో విటమిన్‌ ఏగా మారుతుంది. బీటా-కెరోటిన్ BCO1ని చురుకుగా ఉంచుతుంది. ఇది బ్లెడ్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిండి, గుండె జబ్బులను నివారిస్తుంది. క్యారెట్‌ తరచుగా తీసుకుంటే.. బైల్ యాసిడ్ విసర్జన, కొలెస్ట్రాల్ శోషణ, యాంటీఆక్సిడెంట్ స్థితిని మారుస్తుంది. క్యారెట్‌లో పెక్టిన్‌ రూపంలో కరిగే ఫైబర్‌ అధికంగా ఉంటుంది. పెక్టిన్‌ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. (Image source – pixabay)

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *