[ad_1]
క్యాబేజీ..
క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది..
క్యాబేజీలో ఉండే సల్ఫర్‌తో కూడిన సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం క్యాన్సర్‌తో పోరాడే శక్తిని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. దీనిలో ఉండే.. డిండోలిల్, మెథిన్, సినెగ్రిన్, లూపియోల్, సల్ఫోరాఫేన్, ఇండోల్ త్రీ, కార్బినోల్ క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. దీనిలో ఆంథోసైనిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్ రికవరీకి సహాయపడుతుంది.
ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది..
క్యాబేటీ ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. దీనిలో ఉండే సల్ఫోరాఫేన్, కెంప్ఫెరోల్‌కు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలు ఉంటాయి. ఇది దీర్ఘకాలక మంటను, దాని లక్షణాలు తగ్గించడానికి సహాయపడుతుంది. మోకాళ్ల నొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి.. క్యాబేజీ ఔషధంలా పని చేస్తుంది. మీకు నొప్పిగా ఉన్న ప్రాంతంలో.. క్యాబేజీ ఆకును వేడి చేసి అక్కడ పెట్టండి. మీరు జ్యూస్ తాగినా.. మంచి రిజల్ట్స్ ఉంటాయి. రుమటాయిడ్ అర్థరైటిస్‌తో బాధపడేవారు.. క్యాబేజీ తరచుగా తీసుకుంటే మేలు జరుగుతుంది.
మెదడుకు మంచిది..
క్యాబేజీలో విటమిన్ కె, ఆంథోసైనిన్స్, అయోడిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడుకు సూపర్ ఫుడ్‌లా పని చేస్తుంది. దీనిలో పోషకాలు.. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అధ్యయనాల ప్రకారం, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు అల్జీమర్స్ రోగుల మెదడులో కనిపించే చెడు ప్రోటీన్ల స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తుంది..
క్యాబేజీలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇందులో ఉండే పొటాషియం, ఫైటోకెమికల్ యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచడానికి సహాయపడతాయి. హైపర్‌టెన్షన్ కంట్రోల్‌లో ఉంటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
బరువు కంట్రోల్‌లో..
బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజ్ మంచి ఆప్షన్. ఒక కప్పుడు క్యాబేజ్ లో కేవలం 22 కేలరీలు మాత్రమే లభిస్తాయి. క్యాబేజ్‌లో గట్ ఫ్రెండ్లీ ఇంసోల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది. క్యాబేడీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బౌల్ మూవ్మెంట్స్ రెగ్యులరవుతాయి. క్యాబేజీలో ఇంసోల్యుబుల్ ఫైబర్ అధికంగా లభిస్తుంది. దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపును ఫిల్లింగ్‌గా ఉంచుతుంది. దీంతో ఆకలి వేయదు.. ఎక్కువగా తినకుండా ఉంటారు. అలాగే, ఇది శరీరాన్ని హైడ్రేట్ కూడా చేస్తుంది.
డయాబెటిక్ పేషెంట్స్‌కు మంచిది..
షుగర్ పేషెంట్స్‌కు క్యాబేజ్ బెస్ట్ ఆప్షన్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ హైపర్‌గ్లైసెమిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. డయాబెటిస్ పేషెంట్స్ వారి డైట్‌లో క్యాబేజ్ చేర్చుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.
ఇమ్యూనిటీ పెరుగుతుంది..
క్యాబేజ్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సీ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మన రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావడానికి.. క్యాబేజీ సహాయపడుతుంది. ముఖ్యంగా శీతాకాలం క్యాబేజీ తీసుకోవడం చాలా మంచిది. ఈ కాలంలో ఎక్కువగా ఇబ్బందిపెట్టే.. జలుబు, దగ్గు, ప్లూ, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది.
ఈ అనారోగ్యాలకు చెక్..
క్యాబేజీలో ఉండే ఔషధ గుణాలు, పోషకాలు అనేక వ్యాధుల నివారణకు, చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటాయి. జీర్ణక్రియ, మలబద్ధకం, బలహీనమైన రోగనిరోధక శక్తి, ఊబకాయం, అల్సర్లు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య పరిస్థితుల నుంచి రక్షణ ఇస్తాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply