చలికాలం ఈ పండ్లు తింటే.. త్వరగా బరువు తగ్గుతారు..!

[ad_1]

Best Fruits For Weight Loss: శీతాకాలం.. చల్లటి వాతావరణం మనల్ని లేజీగా మారుస్తుంది. ఉదయం బెడ్‌ మీద నుంచి లేవడానికి మన బాడీ సహకరించదు. దీనికి తోడు.. జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, శ్వాసకోశ సంబంధిత సమస్యలూ ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి. దీంతో రోజు ఫిట్‌నెస్‌ రొటీన్‌ దెబ్బతింటుంది. ఈ కారణంగా.. శరీరంలోకి క్యాలరీ ఇన్‌టేక్‌ ఎక్కువ అయ్యి.. కొవ్వుగా మారి, మనం త్వరగా బరువు పెరుగుతాం. ఈ కాలంలో వర్క్‌వుట్స్‌ను నిర్లక్ష్యం చేసే వారు.. వారి డైట్‌ మీద శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలం, కొన్ని పండ్లు తీసుకుంటే.. మన బరువు కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో మీ బరువును అదుపులో ఉంటే పండ్లు ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

ఆరెంజ్‌..

ఆరెంజ్‌లో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. విటమిన్‌ శరీరంలో జీవక్రయను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి ఆరెంజ్‌ బెస్ట్‌ ఆప్షన్‌. ఆరెంజ్‌లో వాటర్‌ కెంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. శీతాకాలం ఆరెంజ్‌ తరచుగా తింటే.. ఆకలు కంట్రోల్‌లో ఉంటుంది.

జామకాయ..

చలికాలంలో జామకాయ బెస్ట్‌ స్నాక్‌ అని చెప్పొచ్చు. జామలో కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్-ఎ, విటమిన్-బి, ఫైబర్, విటమిన్-సి ఉంటాయి. ముఖ్యంగా తాజా జామ కాయల్లో ఆరెంజ్‌లో కంటే 6 రెట్లు ఎక్కువ విటమిన్-సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ కాలంలో తరచుగా ఇబ్బంది పెట్టే.. జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల నుంచి జామకాయ రక్షిస్తుంది. జామలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.

అంజీర్‌..

అంజీర్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తింటే.. కడుపు నిండుగా అనిపిస్తుంది, ఆహారం ఎక్కువగా తినకుండా అదుపులో ఉంటాం. దీనిలో ఉండే ఫిసిన్‌‌‌ అనే ఎంజైమ్‌.. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఈ కాలంలో అంజీర్‌ తరచుగా తింటే.. బెల్లీ ఫ్యాట్‌ కరుగుతుంది. అంజీర్‌లో పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ పండల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన శక్తిని అందిస్తాయి. అలా బరువును కంట్రోల్‌లో ఉంచుతాయి.

అనాసపండు..

ఆనాసపండులో.. ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది కడుపును ఫిల్లింగ్‌గా ఉంచుతుంది. పైనాపిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎంజైమ్ బ్రోమెలైన్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్ల జీవక్రియలో సహాయపడుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. తక్షణ శక్తిని అందించడంలో పైనాపిల్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌ సీ, యాంటీ ఆక్సీడెంట్లు, ఫైబర్‌ శరీర పనితీరును మెరుగుపరిచేందుకు తోడ్పడుతాయి.

దానిమ్మ…

దానిమ్మ బరువు తగ్గించడంలో సూపర్‌ ఫ్రూట్‌ అని చెప్పొచ్చు. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ శరీరంలోని జీవక్రియను పెంచుతాయి. ఇది ధమనుల లిపిడ్ల నిర్మాణాన్ని నిరోధిస్తుంది, చెడు కొలెస్ట్రాల్‌, హానికరమైన టాక్సిన్‌లను తగ్గిస్తుంది. శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

సీతాఫలం..

ఈ పండు టేస్ట్‌లోనే కాదు, పోషకాలూ అద్భుతంగా ఉంటాయి. దీనిలో సి-విటమిన్‌తోపాటు ఎ, బి, కె విటమిన్లూ, ప్రొటీన్లూ, కాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ వంటి మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. సీతాఫలంలో ఉండే విటమిన్‌ బి6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్లు.. వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

స్టార్‌ ఫ్రూట్‌..

స్టార్‌ ఫ్రూట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీనిలోని ఫైబర్ జీరక్రియను మెరుగుపరుస్తుంది. మన కడుపు సంతృప్తిగా ఉంటుంది, ఆకలిని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. స్టార్ ఫ్రూట్‌లోని సహజమైన డైటరీ ఫైబర్ కంటెంట్ ఉబ్బరం, ఎసిడిటీ, ఇన్ఫ్లమేషన్‌, అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ద్రాక్ష..

దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కరిగే ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. శీతాకాలం షుగర్‌ పేషెంట్స్‌ ఈ పండు తింటే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. దీనిలో విటమిన్‌ సీ మెండుగా ఉంటుంది.. ఇమ్యూనిటీని పెంచడంలో ఇది సహాయపడుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *