[ad_1]
Gold And Silver At Record High: భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో (MCX) ఎల్లో మెటల్ (బంగారం) రేటు తొలిసారిగా రూ.71,000 దాటింది. వెండి కూడా అనూహ్యంగా పెరిగింది. MCXలో కిలో వెండి ధర రూ. 81,000 పైన కనిపించింది, రూ. 82,000 లెవెల్‌కు దగ్గరగా వచ్చింది. ఈ ఎక్సేంజ్‌లో వెండి రేటు రూ.82,000 స్థాయిని ఏ క్షణమైనా దాటవచ్చు.
MCXలో ట్రేడ్ అయ్యే ధరలు స్పాట్ రేట్లు కాదు, ఫ్యూచర్ రేట్లు. వీటిని ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటారు. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్‌లో కనిపించే అంకెలకు, బంగారం షాపుల్లో చెప్పే ధరలకు (స్పాట్ రేట్) వ్యత్యాసం ఉంటుంది.
MCXలో బంగారం, వెండి రేట్లు
MCXలో బంగారం ఇప్పటివరకు అత్యంత ఖరీదైన దశకు చేరుకుంది, 10 గ్రాముల రేటు రూ.71,057 స్ఠాయికి చేరింది. బంగారంలో ఈ రోజు రూ.400 పైగా పెరుగుదల కనిపించింది. వెండి మెరుపు కూడా విపరీతంగా ఉంది, MCXలో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే కిలోకు రూ. 1040 పైగా జంప్ చేసింది. ఈ ఎక్సేంజ్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.81,000 దాటి, రూ.82,000 స్థాయికి చేరువైంది. MCXలో వెండి మే మంత్లీ ఫ్యూచర్స్ కిలోకు రూ. 81,955లను టచ్ చేసింది, ఇది దాని ఆల్ టైమ్ హై లెవెల్.
ఎల్లో మెటల్ బంగారం, షైనింగ్ మెటల్ వెండి విషయంలో ప్రస్తుతం డ్రీమ్ రన్ కొనసాగుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తారన్న అంచనాలు, వివిధ దేశాల మధ్య జియో-పొలిటికల్ టెన్షన్ల కారణంగా ప్రపంచ స్థాయి పెట్టుబడులు పసిడి, వెండిలోకి ప్రవహిస్తున్నాయి. ఈ మెటల్స్ మీద గ్లోబల్ ఇన్వెస్టర్లు బుల్లిష్ సెంటిమెంట్‌తో ఉన్నారు, విపరీతంగా కొంటున్నారు. అందువల్ల, అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి, రజతానికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది.
విదేశీ మార్కెట్‌లోనూ జోరు
విదేశీ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి రెండు బ్లాస్టింగ్ గ్రోత్ కనబరుస్తున్నాయి. ఈ రోజు, Comexలో గోల్డ్ జూన్ మంత్లీ ఫ్యూచర్స్ ఔన్స్‌కు (28.35 గ్రాములు) 15.60 డాలర్లు పెరిగి 2,361.25 డాలర్ల వద్ద కొనసాగుతోంది. COMEXలో, వెండి మే నెల ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఔన్సుకు 27.902 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
దుబాయ్‌లో ఈ రోజు బంగారం రేటు
ఈ రోజు, దుబాయ్‌లో (Today’s Gold Rate in Dubai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 59,224.85 కు చేరగా; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 63,928.84 వద్దకు చేరింది. యూఏఈ, షార్జా, అబుదాబిలో ఇవే రేట్లు అమల్లో ఉన్నాయి. మస్కట్‌లో 22 క్యారెట్ల రేటు ₹ 60,988.70 వద్ద, 24 క్యారెట్ల ధర ₹ 64,124.65 వద్దకు చేరాయి. కువైట్‌లో ఆభరణాల బంగారం ధర ₹ 59,788.68 గా ఉండగా, ప్యూర్ గోల్డ్ ₹ 63,576.19 ధర పలికింది.
అక్షయ తృతీయ సమీపిస్తున్న కొద్దీ ఆకాశంలోకి..
వచ్చే నెల 10వ తేదీన (మే 10, 2024) అక్షయ తృతీయ పండుగ ఉంది. అంతర్జాతీయంగా డిమాండ్‌తో పాటు, దేశీయ పండుగలు కూడా తోడు కావడంతో మన దేశంలో బంగారం ధర కేవలం రోజుల వ్యవధిలోనే వేలల్లో మారింది. రేట్లు ఒక్కసారిగా పెరగడంతో… ఈసారి బంగారం, వెండి కొనుగోలు చేయడమెట్లా అని ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. బంగారం కొనకుండా గత నెల రోజులుగా వాయిదాలు వేస్తూ వచ్చిన వ్యక్తులు, అప్పుడే కొనుంటే బాగుండేది కదాని నిట్టూరుస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: కొత్త శిఖరంపై స్టాక్ మార్కెట్లు, సరికొత్త రికార్డ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ
మరిన్ని చూడండి
[ad_2]
Source link
Leave a Reply