జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్‌-3.. కేవలం 1,437 కి.మీ. దూరంలో వ్యోమనౌక

[ad_1]

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-3 జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువయ్యింది. మూడోసారి వ్యోమనౌక కక్ష్యను తగ్గించినట్టు ఇస్రో తెలిపింది. బుధవారం మధ్యాహ్నం తాము చేపట్టిన కీలక విన్యాసంతో చంద్రయాన్‌-3 కక్ష్య.. 174 కి.మీ. × 1437 కి.మీ.కి తగ్గిందని ఇస్రో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. మళ్లీ ఈ నెల 14న తదుపరి విన్యాసం చేపట్టనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం చంద్రయాన్-3 వ్యోమనౌక.. చంద్రుడి ఉపరితలానికి కేవలం 1,437 కిలోమీటర్ల దూరంలో ఉంది. సోమవారం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్య నిర్వహించే విన్యాసంతో జాబిల్లికి మరింత దగ్గరగా చేరనుంది.

శ్రీహరికోట నుంచి ప్రయోగించిన తర్వాత.. 24 రోజుల పాటు చంద్రయాన్-3 భూ కక్ష్యలోనే ఉంది. దశలవారీగా కక్ష్యను పెంచుతూ ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆగస్టు 1న ట్రాన్స్‌లూనార్ కక్ష్యలోకి (3,69,328 కి.మీ.) అక్కడ నుంచి ఆగస్టు 5న జాబిల్లి కక్ష్యలోకి (18,074) వెళ్లింది. ఆగస్టు 6న చంద్రుడి దిగువ కక్ష్యలోకి (4,313) వెళ్లింది. ఆగస్ట్ 14న చంద్రయాన్-3 మరో నియంత్రిత కదలికలో చంద్రుని ఉపరితలానికి చేరవుతుంది. ఆగష్టు 16న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్.. దాని ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి విడిపోతుంది.

దీంతో అంతరిక్ష నౌక చంద్రుడికి మరింత దగ్గరవుతుంది. ఈ సమయంలో చంద్రుడికి దాదాపు 100 కి.మీ దూరంలో ఉంటుంది. ఆగష్టు 18న చంద్రయాన్-3 చివరి కక్ష్య సర్దుబాటును దాదాపు 30 కి.మీలకు తగ్గించడం ద్వారా చంద్రునికి అత్యంత సమీపంగా వెళ్లనుంది. అంతా సవ్యంగా జరిగితే ఆగస్టు 23న సాయంత్రం 5:47 గంటలకు ల్యాండింగ్‌ చేపట్టనున్నారు. అక్కడ నుంచి అంతరిక్ష నౌక చివరి 30 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. వాతావరణం అనుకూలించకపోతే సెప్టెంబర్‌కు రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని ఇస్రో చెబుతోంది.

సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఇస్రో ఈసారి పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. చంద్రయాన్-2 చివరి మెట్టుపై విఫలం కావడంతో దానిని నుంచి పాఠాలు నేర్చుకుని చంద్రయాన్-3 ఈ ప్రయోగం చేపట్టింది. నాటి తప్పిదం పునరావృతం కాకుండా.. లోపాలను సవరించుకున్నామని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. కానీ, వ్యోమనౌకకు చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆ తర్వాత ప్రక్రియ చాలా సవాల్‌తో కూడుకున్నదని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. ల్యాండర్ విక్రమ్, అన్ని సెన్సార్లు, దాని రెండు ఇంజిన్లు పని చేయకపోయినా ఆగస్టు 23 న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ చేయగలదని వివరించారు.

Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *