[ad_1]
‘చంద్రయాన్-3 ల్యాండర్‌లోని ‘ఇల్సా’ పేలోడ్.. చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్, ఇతర పేలోడ్‌ల కారణంగా ఏర్పడిన ప్రకంపనలు నమోదు చేసింది.. వీటితో పాటు అక్కడ సహజంగా ఏర్పడినట్లు భావిస్తోన్న ప్రకంపనలనూ గుర్తించింది.. ఆగస్టు 26న వాటిని నమోదు చేసింది.. వీటి మూలాన్ని గుర్తించే దిశగా అన్వేషణ సాగుతోంది.. ‘ఇల్సా’ పేలోడ్.. చంద్రుడిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ (MEMS) సాంకేతిక ఆధారిత పరికరం’ అని ఇస్రో వెల్లడించింది.
‘ఇల్సా’ పేలోడ్‌ను ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో ‘లేబొరేటరీ ఫర్ ఎలక్ట్రో- ఆప్టిక్స్ సిస్టమ్స్’ రూపొందించింది. దీనికి అదనంగా చంద్రుడి ఉపరితలంపై మోహరించే యంత్రాంగాన్ని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిందని ఇస్రో తెలిపింది.
ఇక, ఇల్సాలోని ఆరు హై-సెన్సిటివిటీ యాక్సిలెరోమీటర్ల క్లస్టర్లను సిలికాన్ మైక్రోమచినింగ్ ప్రక్రియను ఉపయోగించి దేశీయంగా తయారు చేశారు. కోర్ సెన్సింగ్ మూలకం.. నిర్మాణాత్మక ఎలక్ట్రోడ్‌లతో కూడిన స్ప్రింగ్-మాస్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. బాహ్య కంపనాలు స్ప్రింగ్ విక్షేపణకు దారితీస్తాయి.. ఫలితంగా కెపాసిటెన్స్‌లో మార్పు వచ్చి, వోల్టేజ్‌గా మారుతుంది.
సహజ భూకంపాలు, ప్రభావాలు, కృత్రిమ సంఘటనల ద్వారా ఉత్పన్నమయ్యే భూకంపాలను కొలవడం ILSA ప్రాథమిక లక్ష్యం. ఆగష్టు 25, 2023న రోవర్ నావిగేషన్ సమయంలో నమోదైన వైబ్రేషన్‌లతో పాటు ఆగష్టు 26న రికార్డ్ చేసిన సహజ ప్రకంపన సంఘటనను కూడా ఇస్రో మ్యాప్ రూపంలో ఇస్రో షేర్ చేసింది. దీనిపై తదుపరి పరిశోధన, విశ్లేషణ కొనసాగుతోందని పేర్కొంది.
Read Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply