జూన్‌లో బ్యాంక్‌లకు 12 రోజులు సెలవులు, ఇదిగో హాలిడేస్‌ లిస్ట్‌

[ad_1]

Bank Holidays list in June: రూ. 2000 నోట్లను చలామణీ నుంచి వెనక్కు తీసుకుంటోంది రిజర్వ్‌ బ్యాంక్‌. ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవాలి, ఇందుకోసం బ్యాంక్‌లకు వెళ్లాలి. కాబట్టి, రూ.2 వేల నోట్లను జూన్ నెలలో మార్చాలని మీరు ప్లాన్‌ చేస్తే, ఆ నెలలో బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను (Bank Holidays in June 2023) కచ్చితంగా గుర్తుంచుకోండి. అప్పుడు, సెలవు రోజున బ్యాంకుకు వెళ్లి, మూసేసిన గేటును చూసి ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టాల్సిన అవసరం ఉండదు.

జూన్‌లో 12 రోజులు బ్యాంకులకు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్‌ కస్టమర్ల సౌలభ్యం కోసం ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను ముందుగానే విడుదల చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవుల వివరాలు ఈ లిస్ట్‌లో ఉంటాయి. జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే సెలవులు కూడా ఈ లిస్ట్‌లో కలిసి ఉన్నాయి. జూన్‌ నెలలో.. పూరీ రథయాత్ర, ఖర్చీ పూజ, ఈద్ ఉల్ అజా వంటి కొన్ని ముఖ్యమైన వేడుకలు ఉన్నాయి. బ్యాంకు సెలవుల జాబితా ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి మారుతుంది. 

2023 జూన్‌ నెలలో బ్యాంకులకు సెలవు రోజులు:

జూన్ 4, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 10, 2023- రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 11, 2023 – ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 15, 2023- రాజా సంక్రాంతి కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులు పని చేయవు
జూన్ 18, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 20, 2023- రథయాత్ర కారణంగా ఒడిశాలో బ్యాంకులు పని చేయవు
జూన్ 24, 2023- నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 25, 2023-ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 26, 2023- ఖర్చీ పూజ నేపథ్యంలో త్రిపురలో బ్యాంకులు పని చేయవు
జూన్ 28, 2023- ఈద్ ఉల్ అజా కారణంగా కేరళ, మహారాష్ట్ర, జమ్ము, కశ్మీర్‌లో బ్యాంకులను మూసిస్తారు
జూన్ 29, 2023- ఈద్ ఉల్ అజా సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు
జూన్ 30, 2023- ఈద్ ఉల్ అజా కారణంగా మిజోరాం, ఒడిశాలో బ్యాంకులను మూసివేస్తారు

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. ‘హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్’, ‘రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్’ & ‘క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌’. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. అయితే, బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా చేయవలసి వస్తే ATMని ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: SBI దగ్గరకు ఎన్ని 2000 రూపాయల నోట్లు వచ్చాయో తెలుసా?

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *