డబ్బును పెంచి, పన్నును తగ్గించే పీపీఎఫ్‌ అకౌంట్‌ను ఎలా ఓపెన్‌ చేయాలి?

[ad_1]

How To Open A PPF Account: డబ్బును పెంచుకోవడానికి, ఆదాయ పన్నును ఆదా చేయడానికి పన్ను చెల్లింపుదార్లు వివిధ మార్గాలు అనుసరిస్తుంటారు. ఈ రెండు పనులను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒక్కటే ఏకకాలంలో చేయగలదు. దీర్ఘకాలానికి, ఇది ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌.

పీపీఎఫ్‌, ట్రిపుల్‌ ఇ (EEE లేదా Exempt-Exempt-Exempt) కేటగిరీలోకి వస్తుంది. అంటే, ఇది మూడు విధాలుగా పన్నును ఆదా చేస్తుంది. 1. పెట్టుబడి, 2. ఆదాయం, 3. మెచ్యూరిటీ డబ్బు – PPFలో ఈ మూడు పూర్తిగా పన్ను రహితం ‍‌(tax free).

భారత ప్రభుత్వం, PPF పెట్టుబడిదార్లకు ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయాన్ని అందిస్తోంది. ప్రస్తుతం, PPF వడ్డీ రేటు ‍‌(PPF interest rate) 7.1%గా ఉంది. ప్రభుత్వ మద్దతుతో నడిచే పథకం కాబట్టి, పీపీఎఫ్‌ పెట్టుబడిలో రిస్క్‌ ఉండదు, స్థిరమైన వడ్డీ ఆదాయం చేతికి వస్తుంది.

సామాన్య ప్రజలు కూడా, ఆర్థిక భారం లేకుండా, చాలా చిన్న మొత్తంతో ప్రజా భవిష్య నిధి (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాను ప్రారంభించొచ్చు. పీపీఎఫ్‌లో, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 రూపాయలు ‍‌(PPF Investment) జమ చేయాలి. గరిష్ట పరిమితి ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.1.5 లక్షలు.

PPF కాల పరిమితి (PPF Maturity Period) 15 సంవత్సరాలు. ఈ 15 ఏళ్లు క్రమశిక్షణతో డబ్బు మదుపు/పొదుపు చేస్తూ వెళితే, కాల గడువు తర్వాత చాలా పెద్ద మొత్తం చేతికి వస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం పీపీఎఫ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. కావాలనుకుంటే, 15 సంవత్సరాలు ముగిసిన తర్వాత మరో ఐదేళ్లు దీనిని పొడిగించుకోవచ్చు. 

పెట్టుబడిదార్లు, PPF ఖాతాను దీర్ఘకాలం పాటు కొనసాగించలేకపోతే, దానిని రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. 7వ సంవత్సరం పూర్తయిన తర్వాత, పీపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతా ప్రారంభించిన మూడో సంవత్సరం తర్వాత, పీపీఎఫ్‌ అకౌంట్‌ మీద లోన్‌ కూడా తీసుకోవచ్చు. హఠాత్తుగా డబ్బు అవసరమైతే, పీపీఎఫ్‌ అకౌంట్‌ను బ్రేక్‌ చేయకుండా లోన్‌ ఆప్షన్‌ ఉపయోగించుకోవచ్చు. 

PPF ఖాతా తెరవడానికి ఎవరు అర్హులు? (Who is eligible to open a PPF account?)

– భారత పౌరసత్వం ఉన్న వ్యక్తులు మాత్రమే తమ పేరు మీద PPF ఖాతా ప్రారంభించగలరు.
– మైనర్ల తరపున తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు (Legal Guardian) PPF ఖాతా ప్రారంభించొచ్చు.
– ప్రవాస భారతీయులకు (NRIలు) కూడా అవకాశం ఉంది. అయితే, ఖాతా తెరిచే సమయంలో వారు భారతీయ పౌరులుగా ఉండి ఉండాలి. ఆ ఖాతాను 15 సంవత్సరాల పాటు కొనసాగించొచ్చు. NRI హోదా వచ్చిన తర్వాత కొత్త పీపీఎఫ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయలేరు.

పీపీఎఫ్‌ ఖాతాను ఆన్‌లైన్‌లోను, ఆఫ్‌లైన్‌లోను సులభంగా ప్రారంభించొచ్చు.

PPF ఖాతాను ఆన్‌లైన్‌లో ఎలా ప్రారంభించాలి? (How to open PPF account online?)

– ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మీ బ్యాంక్‌ సేవింగ్స్‌ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
–  “Open a PPF Account” ఆప్షన్‌ గుర్తించి, దానిపై క్లిక్ చేయండి.
– “Self-Account” లేదా “Minor Account”లో ఒకదానిని ఎంచుకోండి. మీకు 18 సంవత్సరాలు దాటితే “Self-Account”, మైనర్‌ తరపున మీరు అకౌంట్‌ ఓపెన్‌ చేస్తుంటే “Minor Account” ఎంచుకోవాలి.
– ఇప్పుడు ఓపెన్‌ అయ్యే అప్లికేషన్‌ను పూర్తి చేయండి.
– ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ చేయగల డబ్బును అక్కడ నింపండి.
– మీకు అనుగుణంగా, నిర్దిష్ట వ్యవధుల్లో ఆటోమేటిక్ డెబిటింగ్ ఎంచుకోండి. 
– ఫారం పూర్తి చేసిన తర్వాత దానిని సబ్మిట్‌ చేయండి. 
– ఇప్పుడు, మీ మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది.
– సంబంధిత గడిలో OTPని నింపండి.
– దీంతో PPF ఖాతా ఓపెన్‌ అవుతుంది. దీని గురించి మీ మొబైల్‌ నంబర్‌కు, ఇ-మెయిల్‌కు సమాచారం వస్తుంది.

PPF ఖాతాను ఆఫ్‌లైన్‌లో ఎలా ప్రారంభించాలి? (How to open PPF account offline?)

మీరు కోరుకున్న బ్యాంక్‌ బ్రాంచ్‌ లేదా మీకు దగ్గరలోని పోస్టాఫీస్‌కు వెళ్లండి.  
PPF దరఖాస్తు ఫారం తీసుకుని పూర్తి చేయండి. 
అప్లికేషన్‌ ఫారంతోపాటు, అక్కడి సిబ్బంది అడిగిన డాక్యుమెంట్లు సమర్పించండి.

బ్యాంక్‌లో అయినా, పోస్టాఫీస్‌లో అయినా ఒక వ్యక్తి ఒక PPF ఖాతాను ప్రారంభించడానికే అనుమతి ఉంటుంది.

మరో ఆసక్తికర కథనం: గ్యాస్‌​ సిలిండర్‌పై ABCDలు ఎందుకుంటాయి! ప్రమాదాల నుంచి ఇవి ఎలా తప్పిస్తాయి!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *