డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె – ఇక మీ బ్యాంక్‌ పని అయినట్టే!

[ad_1]

Bank Holidays list in December 2023: ఈ ఏడాది డిసెంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 18 రోజులు హాలిడేస్‌ (రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు కూడా కలిపి) ఉన్నాయి. ఇవి కాకుండా, డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా పబ్లిక్‌, ప్రైవేట్‌ బ్యాంక్‌ల సిబ్బంది సమ్మెకు (Bank Employees On Nationwide Strike) దిగుతున్నారు. స్ట్రైక్‌ వల్ల మరో 6 రోజులు బ్యాంక్‌లు బంద్‌ అవుతాయి. కాబట్టి, డిసెంబర్‌లో మీకు బ్యాంక్‌లో ఏ పని ఉన్నా, ముందు ఈ డేట్లను సేవ్‌ చేసుకోండి, దానిని బట్టి ప్లాన్‌ చేసుకోండి.

2023 డిసెంబర్‌ నెలలో బ్యాంక్‌ సెలవు రోజులు ‍‌(Bank Holidays in December 2023):

డిసెంబర్ 1, 2023 – రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 3, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 4, 2023  – సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్టివల్ కారణంగా గోవాలో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 9, 2023  – రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 10, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 12, 2023  – ప-టోగన్ నెంగ్మింజా సంగ్మా కారణంగా మేఘాలయలో బ్యాంకులను మూసివేస్తారు
డిసెంబర్ 13 & 14, 2023 – లోసంగ్/నామ్‌సంగ్ కారణంగా సిక్కింలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 17, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 18, 2023  – యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి
డిసెంబర్ 19, 2023  – విమోచన దినోత్సవం కారణంగా గోవాలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 23, 2023 – నాలుగో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 24, 2023  – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 25, 2023  – క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 26, 2023  – క్రిస్మస్ వేడుకల కారణంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 27, 2023 – క్రిస్మస్ వేడుకల కారణంగా నాగాలాండ్‌లో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 30, 2023 – యు కియాంగ్ నంగ్‌బా దృష్ట్యా మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి
డిసెంబర్ 31, 2023 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

బ్యాంక్‌ సిబ్బంది సమ్మె విషయానికి వస్తే.. 2023 డిసెంబర్‌ 4వ తేదీ నుంచి ప్రారంభమై, అదే నెల 11వ తేదీ వరకు స్ట్రైక్‌ కొనసాగుతుంది. మధ్యలో 9, 10 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం ఉన్నాయి. కస్టమర్లకు ఇబ్బంది లేకుండా కొన్ని బ్యాంక్‌లు ఒకరోజు, మరికొన్ని బ్యాంక్‌లు మరొక రోజు చొప్పున స్ట్రైక్‌ షెడ్యూల్‌ వేసుకున్నాయి. 

డిసెంబర్‌ నెలలో బ్యాంక్‌ సమ్మె తేదీలు (Bank Strike Dates in December 2023)

డిసెంబర్ 4, 2023: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ‍‌(P&S Bank), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
డిసెంబర్ 5, 2023: బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BoI)
డిసెంబర్ 6, 2023: కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డిసెంబర్ 7, 2023: ఇండియన్ బ్యాంక్, యూకో (UCO) బ్యాంక్
డిసెంబర్ 8, 2023: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
డిసెంబర్ 11, 2023: అన్ని ప్రైవేట్ బ్యాంకులు

మరో ఆసక్తికర కథనం: డెడ్‌లైన్స్‌ ఇన్‌ డిసెంబర్‌, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *