[ad_1]

రిలయన్స్ రిటైల్ ముంబయిలో ‘జియో వరల్డ్ ప్లాజా’ పేరుతో భారీ, అత్యంత లగ్జరీ షాపింగ్ మాల్ ను ప్రారంభించనుంది. ఇక్కడ టాప్ ఎండ్ రిటైల్ ఫ్యాషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ అనుభవం లభించనుంది. ముంబయిలోని బీకేసీలో ఉన్న ఈ ప్లాజా నవంబర్ 1 నుంచి సామాన్యులకు కూడా అందుబాటులోకి రానుంది. ఈ ప్లాజా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్‌లకు కనెక్ట్ చేసి ఉంది.

ఈ మాల్ ప్రారంభం గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ఎం. అంబానీ మాట్లాడుతూ.. “జియో వరల్డ్ ప్లాజా ప్రపంచంలోని అత్యుత్తమ బ్రాండ్‌లను ఇండియాకు తీసుకురావడమే కాకుండా టాప్ ఇండియన్ బ్రాండ్స్ గొప్పదనాన్ని హైలైట్ చేయడం టార్గెట్ గా పెట్టుకుంది. ఇది ప్రత్యేకమైన రిటైల్ అనుభవాన్ని అందిస్తుంది. కస్టమర్స్‌కు అత్యున్నత అనుభవం, వారి అభిరుచులకు తగ్గట్లుగా మేం చేపట్టే ప్రతి ప్రయత్నంలో మమ్మల్ని ముందుకు నడిపించడంలో సహాయపడుతుంది’’ అని అన్నారు.

ప్లాజా విశేషాలు
జియో వరల్డ్ ప్లాజా రిటైల్ దుకాణాలు, విశ్రాంతి, ఫుడ్ కోసం ప్రత్యేక సెంటర్ గా రూపొందించారు. దాదాపు 7,50,000 చదరపు అడుగులు, నాలుగు అంతస్తులలో విస్తరించి ఉన్న ఈ సెంటర్‌లో ఒకే రూఫ్ కింద 66 లగ్జరీ బ్రాండ్‌లు ఉంటాయి. భారతదేశంలోకి ప్రవేశించిన కొన్ని అంతర్జాతీయ బ్రాండ్‌లు కూడా ఉన్నాయి. వీటిలో Balenciaga, Giorgio Armani Café, Pottery Barn Kids, Samsung ఎక్స్‌పీరియన్స్ సెంటర్, EL&N కేఫ్, రిమోవా ఉన్నాయి. వాలెంటినో, టోరీ బర్చ్, YSL, వెర్సేస్, టిఫనీ, లాడూరీ, పోటరీ బార్న్ తమ మొదటి స్టోర్లను ముంబయిలో ప్రారంభించనున్నాయి.

ఇది కాకుండా, లూయిస్ విట్టన్, గూచీ, కార్టియర్, బెయిలీ, జార్జియో అర్మానీ, డియోర్, బల్గారి లాంటి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మనీష్ మల్హోత్రా, అబు జానీ-సందీప్ ఖోస్లా, రాహుల్ మిశ్రా, ఫల్గుణి & షేన్ పీకాక్, రీతూ కుమార్‌ల డిజైనర్ దుస్తులు కూడా జియో వరల్డ్ ప్లాజాలో అందుబాటులో ఉంటాయి.

ప్లాజా డిజైన్
ప్లాజా నిర్మాణం తామర పువ్వులా ఉంటుంది. దీనిని రిలయన్స్ బృందం, అమెరికా ప్రధాన కార్యాలయ ఆర్కిటెక్చర్ కంపెనీ టీవీఎస్ సంయుక్తంగా రూపొందించారు. ప్లాజా ఫ్లోర్ మొత్తం పాలరాయితో తయారు చేశారు. ఎత్తైన గోపురం పైకప్పులు, అద్భుతమైన లైటింగ్ విలాసవంతమైన అనుభవాన్ని కల్పిస్తుంది. కస్టమర్లకు అత్యద్భుతమైన అనుభవాన్ని ఇవ్వడం దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు. ఇక్కడ కస్టమర్లకు టాక్సీ ఆన్ కాల్, వీల్ చైర్ సర్వీస్, హ్యాండ్స్ ఫ్రీ షాపింగ్, బట్లర్ సర్వీస్, బేబీ స్త్రోలర్ వంటి సౌకర్యాలను అందిస్తున్నారు.

[ad_2]
Source link
Leave a Reply