దేశంలో కోటీశ్వరుల సంఖ్య రెండేళ్లలోనే రెట్టింపు, 4.65 కోట్ల మంది ‘జీరో’

[ad_1]

Income Tax Return: వ్యక్తిగత ఆదాయాల ప్రకటన గడువు 31 జులై 2023తో ముగిసింది. ఆ డేటా నుంచి ఇప్పుడు చాలా నిజాలు బయటకు వస్తున్నాయి. మన దేశంలో కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య చాలా వేగంగా పెరిగినట్లు ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్ ఫైలింగ్స్‌ డేటా ద్వారా తెలుస్తోంది.

₹కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న టాక్స్‌ పేయర్ల సంఖ్య
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ రిపోర్ట్‌ ప్రకారం…  2022-23 అసెస్‌మెంట్‌ ఇయర్‌లో (2021-22 ఆర్థిక సంవత్సరం) మదింపు సంవత్సరంలో  ITR ఫైల్ చేసిన వాళ్లలో ఒక కోటి రూపాయలకు పైగా ఆదాయాన్ని ప్రకటించిన టాక్స్‌ పేయర్ల (వ్యక్తులు, కంపెనీలు, ట్రస్టులు) సంఖ్య 2.69 లక్షలు. వీళ్లలో ఇండివిడ్యువల్‌ టాక్స్‌ పేయర్లు (వ్యక్తులు) 1,69,890 మంది. 2021–22 అసెస్‌మెంట్‌ ఇయర్‌లో 1,14,446 మంది, 2020-21 మదింపు సంవత్సరంలో 81,653 మంది కోటి రూపాయలకు మించి ఆదాయాన్ని ప్రకటించారు. 

ఈ విధంగా, గత 2 సంవత్సరాల్లోనే (2020-21 అసెస్‌మెంట్‌ ఇయర్‌ – 2022-23 అసెస్‌మెంట్‌ ఇయర్‌ మధ్య కాలంలో) ఒక కోటి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న టాక్స్ పేయర్ల సంఖ్య 81,653 నుంచి 1,69,890కు, రెట్టింపు కంటే ఎక్కువే పెరిగింది. 

ఇన్‌కమ్‌ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం… 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన మొత్తం పన్ను చెల్లింపుదార్ల  (వ్యక్తులు, కంపెనీలు, ట్రస్టులు) సంఖ్య 2.69 లక్షలు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 1.93 లక్షలు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 1.80 లక్షలుగా ఉంది. 2019-20 సంవత్సరంతో పోలిస్తే, కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం పన్ను చెల్లించే పన్ను చెల్లింపుదారుల సంఖ్య  2022-23 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో 41.5 శాతం పెరిగింది. మరోవైపు, ఇదే కాలంలో రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఇన్‌కమ్‌ టాక్స్‌ చెల్లిస్తున్న వారి సంఖ్య కేవలం 0.6 శాతం మాత్రమే పెరిగింది. 

అదే విధంగా, రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న టాక్స్‌ పేయర్లు 1.4 శాతం పెరిగారు. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈసారి, రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల పన్ను పరిధిలో 1.10 కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు ఉన్నారు.

ఈ ఏడాది ఐటీఆర్‌ ఫైల్‌ చేసిన టాక్స్‌ పేయర్ల డేటా:

ఒక్కో పన్ను శ్లాబులో పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పరిశీలిస్తే, 4.65 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయాన్ని చూపారు. అంటే ‘జీరో టాక్స్‌’ చెల్లించారు.
రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల టాక్స్‌ పరిధిలో 1.10 కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు ఉన్నారు.
రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఆదాయం ఉన్న టాక్స్‌ పేయర్ల సంఖ్య 45 లక్షలు.
రూ. 20 నుంచి రూ. 50 లక్షల మధ్య ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 19 లక్షలు.
రూ. 50 లక్షల నుంచి ఒక కోటి రూపాయల మధ్య ఆదాయం ఉన్న టాక్స్‌ పేయర్ల సంఖ్య 3.3 లక్షలు.
ఒక కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 2.69 లక్షలు.

ఏప్రిల్‌-జూన్‌ కాలంలో 1.36 కోట్ల ITRలు
ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో 1.36 కోట్ల మంది ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్నులు ఫైల్‌ చేశారు. గత ఏడాది 2022 ఇదే కాలంలో దాఖలైన 70.34 లక్షల రిటర్నులతో పోలిస్తే, ఈసారి ఫైలింగ్స్‌ 93.76% పెరిగాయి. ఈ ఏడాది జులై నెలలనే 5.41 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. మొత్తంగా చూస్తే.. గత నెలాఖరు (జులై 31) నాటికి 6.77 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది. 

మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Adani Green, HDFC Bank

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *