దేశంలో 6 నెలల గరిష్టానికి గోధుమ ధర, ఎగుమతులు నిషేధించినా ఫలితం లేదు

[ad_1]

Wheat Prices In India:  భారతదేశంలో గోధుమ ధరలు మంగళవారం ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సరఫరా తగ్గడం, పండుగ సీజన్ కు ముందే డిమాండ్ పెరగడంతో గోధుమ ధరలపై ప్రభావం చూపుతోందని డీలర్లు తెలిపారు. దేశంలో అవసరాల కోసం, ధరలను అదుపులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై నిషేధం విధించినా అంతగా ఫలితం చూపలేదు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ధరలను నియంత్రించడానికి తృణధాన్యాలపై దిగుమతి సుంకాలను తగ్గించే అవకాశం కనిపిస్తోంది.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో గోధుమ ధర 1.5 శాతం పెరగడంతో మంగళవారం మెట్రిక్‌ టన్ను ధర రూ.25,446 (307.33 డాలర్లు) కు చేరుకుంది. గత ఆరు నెలల గరిష్టానికి గోధమ ధర చేరుకుందని, ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి ఇదే అధికమని డీలర్లు, వ్యాపారులు చెబుతున్నారు. గత నాలుగు నెలల్లో ధరలు దాదాపు 18 శాతం వరకు పెరిగాయి. కానీ పండుగ సీజన్ కు ముందే గోధమల సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగిపోతున్నాయని ఓ డీలర్ తెలిపారు.

ముఖ్యమైన రాష్ట్రాల నుంచి గోధుమ సరఫరా నిలిచిపోయిందని, పిండి మిల్లులు మార్కెట్‌లోనూ కావాల్సినంత గోధమలు లేవని ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి చెప్పారు. పెరుగుతున్న గోధుమ ధరలు ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన గోధుమలను మార్కెట్‌లోకి తీసుకురావాలని డిమాండ్ మొదలైంది. 

దేశంలో ఆగస్టు 1వ తేదీ నాటికి ప్రభుత్వ గోదాములు, గిడ్డంగులలో 28.3 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమ నిల్వలు ఉన్నాయి. గత ఏడాది 26.6 మిలియన్ మెట్రిక్ టన్నులు నిల్వ నుంచి ఈ ఏడాది మరింత పెరిగింది. దేశంలో దిగుమతులు పెంచితేనే గోధుమల ధర దిగొస్తుందని డీలర్లు భావిస్తున్నారు. గోధుమలపై దిగుమతి పన్నును 40 శాతం తగ్గించడం, లేక పూర్తిగా రద్దు చేయాలని ఆహార మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సీనియర్ అధికారి సంజీవ్ చోప్రా తెలిపారు.

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం.. గోధుమ ఉత్పత్తి గత ఏడాది 108 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా, 2023లో రికార్డు స్థాయిలో 112.74 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. దేశ ప్రజలు ప్రతి ఏడాది 108 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమల వినియోగిస్తున్నారని, కాగా, గత ఏడాదితో పోల్చితే గోధుమ ఉత్పత్తి 10 శాతం తక్కువగా ఉందని ఓ ప్రముఖ సంస్థ జేన్ నెలలో రాయిటర్స్ కు వెల్లడించినట్లు సమాచారం. 

2022 మే నుంచి కొనసాగుతున్న నిషేధం
ప్రపంచంలో గోధుమలను ఉత్పత్తి చేసే రెండో అతి పెద్ద దేశం భారతదేశం. అయితే, దేశీయ మార్కెట్‌లో గోధుమల అందుబాటులో లేక ధరలు ఒక్కసారిగా పెరగడంతో, గోధుమల ఎగుమతిపై నిషేధం విధిస్తూ 2022 మే నెలలో కేంద్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. అకాల వర్షాల కారణంగా గోధుమ పంటకు నష్టం వాటిల్లడంతో, గోధుమల సేకరణల్లో నాణ్యత నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, చండీగఢ్ రాష్ట్రాల్లో రైతులకు కోసం నిబంధనల మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా నీళ్లు నిలిచి గోధుమ పంట దెబ్బతిందని, కాబట్టి పంట కొనుగోళ్లలో నిబంధనలను సడలించాలని రైతులంతా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *