నెలలో ఏ రోజున సిప్‌ చేస్తే ఎక్కువ రిటర్న్‌ వస్తుందో తెలుసా!

[ad_1]

SIP Investment: 

మ్యూచువల్‌ ఫండ్‌ ఇండస్ట్రీ రాకెట్‌ వేగంతో అభివృద్ధి చెందుతోంది. ప్రతి నెలా కోట్లాది రూపాయలు ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. ఎక్కువ మంది సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (SIP) విధానాన్నే అనుసరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈక్విటీ మార్కెట్ల వైపు అడుగులు వేస్తున్న యువత ఓటూ దీనికే! అయితే నెలలో ఏ రోజు సిప్‌ చేస్తే మెరుగైన రాబడి వస్తుందో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మీకూ ఈ డౌట్‌ ఉంటే ఆగకుండా వార్తను చదివేయండి!

సౌకర్యంగా ‘సిప్‌’

ఈక్విటీలో సుదీర్ఘకాలం పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందన్న సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఎక్కువ.. తక్కువ జీతంతో సంబంధం లేకుండా తమ స్థోమతకు తగ్గట్టుగా చాలామంది మ్యూచువల్‌ ఫండ్లలో (Mutual Fund Investment) పెట్టుబడి పెడుతున్నారు. ఇందులో ఎక్కువ మంది సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానాన్నే ఎంచుకుంటున్నారు. చాలామంది నెల జీతం రాగానే మొదటి వారంలో సిప్‌ చేస్తారు. ఇంకొందరు రెండో వారంలో, మరికొందరు ఆఖరి రెండు వారాల్లో ఏదో ఒకరోజు ఎంచుకుంటారు. అయితే అసెట్‌ మేనేజ్‌మెంట్‌  కంపెనీలు వీరికి అనుకూలంగా కొన్ని కొత్త సౌకర్యాలు  కల్పిస్తున్నాయి. ప్రతి రోజు రూ.20 సిప్‌ చేయడం లేదా నెలలో తమకు నచ్చిన రోజున సిప్‌ చేసేందుకు అనుమతి ఇస్తున్నాయి. రూపీ కాస్ట్‌ యావరేజ్‌ (Rupee Cost Average) విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

టైమింగ్‌ కష్టం!

రూపీ కాస్ట్‌ యావరేజింగ్‌ మెథడ్‌ వల్ల మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు నెలవారీగా పెరుగుతున్నాయి. 2023 మే నెలలో రూ.14,749 కోట్లు సిప్‌ విధానంలో పెట్టుబడి పెట్టారు. 2022 మేలో ఇది రూ.12,286 కోట్లు. అంటే సంవత్సరంలోనే ఇన్వెస్ట్‌మెంట్‌ చాలా వరకు పెరిగింది. చాలామంది మార్కెట్‌ను టైమింగ్‌ చేయాలని భావిస్తుంటారు. బాటమ్‌ ఫిషింగ్‌ చేస్తుంటారు. కోటిలో ఒక్కరో ఇద్దరో టైమింగ్‌ చేస్తారని.. మిగతా వాళ్లకు అది సాధ్యమవ్వదని నిపుణులు సలహా ఇస్తున్నారు. దాని బదులు నెల నెలా సిప్‌ చేయడం ఉత్తమ పద్ధతిగా చెప్తున్నారు. వైట్‌ ఓక్‌ క్యాపిటల్‌ మ్యూచువల్‌ ఫండ్ విడుదల చేసిన ఓ రిపోర్టును ఉదహరిస్తున్నారు.

ఏ రోజైనా ఒకటే!

తేదీతో సంబంధం లేకుండా ఒక క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టిన అందరికీ ఒకే రకమైన రాబడి వస్తోందని వైట్‌ఓక్‌ నివేదిక పేర్కొంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌కు సంబంధించి 26 ఏళ్ల డేటాను అనలైజ్‌ చేసింది. రోజూ రూ.1000 పెట్టుబడి పెడితే 26 ఏళ్లకు రూ.65.96 లక్షలు పెట్టుబడి అవుతుంది. ప్రస్తుతం దాని విలువ రూ.6.10 కోట్లుగా ఉంది. 14.10 శాతం కాంపౌండ్‌ రిటర్న్‌ ఇచ్చింది. ఇక ప్రతి వారం రూ.4756, ప్రతి నెల రూ.20,677 సిప్‌ చేస్తే వరుసగా రూ.6.12 కోట్లు, రూ.6.13 కోట్ల రాబడి వచ్చింది. దాదాపుగా అందరికీ కాంపౌండ్‌ రిటర్న్‌ 14.10 శాతమే ఉంది. నెలలో ఏ రోజు సిప్‌ చేసిన సగటున 15 శాతం వరకు రిటర్న్‌ కనిపించింది.

లక్ష్యానికి తగినట్టు పెట్టుబడి

చాలా మంది సుదీర్ఘ కాలం క్రమానుగుణంగా మదుపు చేయాలనే అనుకుంటారు. లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్ట్‌ గురించి మాట్లాడుతుంటారు. అయితే ఒడుదొడుకులు ఎదురవ్వగానే మొత్తం సొమ్ము వెనక్కి తీసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కోరుకున్న లాభాలు రావని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌ నుంచి లీనియర్‌ రిటర్న్స్‌ ఆశించొద్దని సూచిస్తున్నారు. వాస్తవిక లక్ష్యాలను ఎంచుకొని సిప్‌ చేయాలని అంటున్నారు. ఉదాహరణకు రెండేళ్ల మీ కూతురు లేదా కొడుకు కోసం 15 ఏళ్లకు రూ.కోటి కూడబెట్టాలంటే 12 శాతం రిటర్న్‌తో నెలకు రూ.20,000 సిప్‌ చేయాలి. చాలా సందర్భాల్లో మార్కెట్‌ ఇంతకన్నా ఎక్కువే రాబడి అందిస్తుంది.

Also Read: సైలెంట్‌ కిల్లర్‌ సైయెంట్‌ డీఎల్‌ఎం – 50% ప్రీమియంతో షేర్ల లిస్టింగ్‌

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *