నేడు టీసీఎస్‌ రిజల్ట్స్‌ – రిపోర్ట్‌ కార్డ్‌లో చూడాల్సిన 6 కీ పాయింట్స్‌ ఇవి

[ad_1]

TCS Q1 Results: టాటా గ్రూప్‌ ఐటీ ఫర్మ్‌ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), 2023-24 జూన్ త్రైమాసికం ఫలితాలను ఇవాళ మార్కెట్ అవర్స్ తర్వాత రిలీజ్‌ చేస్తుంది. అయితే, ఈ రిజల్ట్స్‌ మీద మార్కెట్‌లో పెద్దగా అంచనాలు లేవు. ద్రవ్యోల్బణం కారణంగా, టెక్నాలజీ కోసం చేసే ఖర్చులను క్లయింట్లు తగ్గిచడం & కంపెనీ నిర్వహణ వ్యయాలు పెరగడం వంటివి TCS రిపోర్ట్‌ కార్డ్‌లో కనిపించే అవకాశం ఉంది.

హిస్టరీ రిపీట్‌ కావచ్చు!
హిస్టరీ పేజీలను తిరగేసి, ఎర్నింగ్స్‌ రిపోర్ట్‌ తర్వాత TCS షేర్ల పనితీరును పరిశీలిస్తే, ఈ సాఫ్ట్‌వేర్ మేజర్ తన పెట్టుబడిదార్లకు చాలా తక్కువ సందర్భాల్లోనే ఆనందం పంచింది. ఎక్కువ సార్లు నిరుత్సాహపరిచింది. ఆదాయాల ప్రకటన తర్వాత, గత 12 త్రైమాసికాల్లో ఎనిమిది సార్లు TCS స్టాక్ నెగెటివ్‌ రిటర్న్స్‌ ఇచ్చింది. వరుసగా గత ఐదు త్రైమాసికాల్లోనూ ఈ స్టాక్ పతనమైంది. ఇప్పుడు కూడా ఈ కంపెనీ నుంచి ఆశించదగిన పాజిటివ్‌ పాయింట్స్‌ ఏమీ కనిపించడం లేదు కాబట్టి, చరిత్ర పునరావృతం కావచ్చు

మొత్తం జూన్ త్రైమాసికంలో, TCS షేర్లు కేవలం 3% పెరిగాయి, అండర్‌పెర్ఫార్మ్‌ చేశాయి. అదే కాలంలో బెంచ్‌మార్క్ నిఫ్టీ50 10% పైగా లాభపడింది.

TCS రిపోర్ట్‌ కార్డ్‌లో కీలకంగా చూడాల్సిన విషయాలు:

ఎర్నింగ్స్‌: దేశంలో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ మేజర్, జూన్ త్రైమాసికం నెట్‌ సేల్స్‌లో కేవలం 0.7% QoQ గ్రోత్‌తో రూ. 59,560 కోట్లను నివేదించే అవకాశం ఉంది. గత 12 త్రైమాసికాలతో పోలిస్తే, కంపెనీ చూపించే అతి తక్కువ వృద్ధి ఇదే. బాటమ్‌లైన్ QoQలో 4.2% క్షీణించి రూ. 10,910 కోట్లకు చేరుకోవచ్చని అంచనా.

డీల్ విన్స్‌: మార్చి త్రైమాసికంలో, TCS $10 బిలియన్ల కొత్త డీల్ విన్స్‌ ప్రకటించింది. బ్రోకరేజ్ HDFC సెక్యూరిటీస్, జూన్ త్రైమాసికంలో అంతకంటే ఎక్కువ డీల్‌ విన్స్‌ అంచనా వేసింది. నిర్మల్ బ్యాంగ్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ మాత్రం ఫ్లాట్ గ్రోత్‌ ఉండొచ్చని చెబుతోంది.

మార్జిన్స్‌: జీతాల పెంపు, వీసా కాస్ట్‌, లార్జ్‌ డీల్స్‌ కోసం చేసే కంపెనీ చేసే వ్యయాల కారణంగా ఆపరేటింగ్ మార్జిన్స్‌ QoQలో 130-150 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు.

బిజినెస్‌ ఔట్‌లుక్: US, యూరప్ వంటి మార్కెట్లు అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లతో సతమతం అవుతున్న నేపథ్యంలో, ఈ ప్రధాన మార్కెట్లలో బిజినెస్‌ ఔట్‌లుక్ కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా, అమెరికన్‌ క్లయింట్స్‌ నుంచి వచ్చిన ఆదాయం తగ్గిందని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు.

కొత్త CEO స్ట్రాటెజీ: TCS కొత్త MD & CEO కె.కృతివాసన్ పెట్టుబడిదార్లను ఉద్దేశించి మాట్లాడే మొదటి త్రైమాసికం ఇది. కాబట్టి, కొత్త సీఈవో వ్యూహాలేంటని దలాల్‌ స్ట్రీట్‌ ఆసక్తిగా గమనిస్తుంది.

బైబ్యాక్: షేర్ బైబ్యాక్‌ను TCS ప్రకటించవచ్చని మార్కెట్‌లో సందడి నెలకొంది. అయితే, దీని గురించి కంపెనీ నుంచి ఎలాంటి క్లూ కూడా బయటకు రాలేదు.

ట్రేడింగ్ స్ట్రాటెజీ
టీసీఎస్ షేర్లు కొంతకాలం నుంచి గట్టి రేంజ్‌లో ట్రేడవుతున్నాయి. రూ. 3,300 స్థాయిలో స్ట్రాంగ్‌ రెసిస్టెన్స్‌ ఎదుర్కొంటున్నాయి. రూ.3,280 ఒకో బ్రేక్‌ పొజిషన్‌. ఈ స్థాయిలో నిలబడలేకపోతే, రూ. 3,200-3,170 జోన్‌లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఈ స్టాక్‌ రూ.3,300 జోన్‌ను దాటితే బయ్‌ చేయవచ్చని, లేదా రూ.3,280 లాంగ్ స్ట్రాడిల్ ఆప్షన్ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయాలని ప్రభుదాస్ లీలాధర్ డెరివేటివ్స్ అనలిస్ట్ శిల్పా రౌత్ సూచించారు.

మరో ఆసక్తికర కథనం: ఇప్పటివరకు ఐటీఆర్‌ సమర్పించిన వాళ్లు 2 కోట్ల మంది, మీరెప్పుడు ఫైల్‌ చేస్తారు? 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *