పీక్‌ స్టేజ్‌ నుంచి 50% డౌన్‌, చౌకగా దొరుకుతున్న ఐటీ స్టాక్స్‌ను ఇప్పుడు కొనొచ్చా?

[ad_1]

IT Stocks: కొంతకాలంగా ఐటీ స్టాక్స్‌కు గడ్డుకాలం నడుస్తోంది. నిఫ్టీలోని 10 IT కౌంటర్లలో 4, వాటి 5 సంవత్సరాల సగటు PE స్థాయిల కంటే దిగువన ట్రేడవుతున్నాయి.

ఇన్ఫోసిస్ స్టాక్, దాని ఆల్-టైమ్ హై లెవెల్ నుంచి 35% పైగా పడిపోయింది. 5 సంవత్సరాల సగటు PE 25.59 అయితే, ప్రస్తుతం 21.71 PE వద్ద, డిస్కౌంట్‌లో అందుబాటులో ఉంది. IT మేజర్‌ TCS కూడా గరిష్ట స్థాయి నుంచి 22% పైగా క్షీణించింది. దాని 5 సంవత్సరాల సగటు PE 29 కంటే తక్కువగా 27 PE వద్ద దొరుకుతోంది. తగినంతమంది కొనుగోలుదార్లు లేదా డిమాండ్‌ వీటికి దొరకడం లేదని దీని అర్ధం. యంఫసిస్‌, విప్రో కూడా వాటి ఐదేళ్ల సగటు PE స్థాయిల కంటే తక్కువలో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ రెండూ గరిష్ట స్థాయి నుంచి సగానికి పైగా పడిపోయాయి. 

అన్ని నిఫ్టీ IT స్టాక్స్‌లో పెర్సిస్టెంట్ సిస్టమ్ కొంత మెరుగ్గా ఉంది, ఇది కేవలం 15% తగ్గింది. దాని సగటు వాల్యుయేషన్ కంటే పైనే ట్రేడవుతోంది.

చాలా బ్రోకరేజ్‌లు ఐటీ స్టాక్స్‌ మీద ప్రస్తుతానికి బేరిష్‌గా ఉన్నాయి. ప్రపంచ అనిశ్చితుల కారణంగా, ఐటీ కంపెనీల భవిష్యత్‌ మీద మబ్బులు కమ్ముకున్నాయని చెబుతున్నాయి. ఐటీ స్టాక్స్‌కు ఇచ్చిన రేటింగ్స్‌ తగ్గిస్తున్నాయి.

10 ఐటీ స్టాక్స్‌, వాటి పతన స్థాయి:

విప్రో – Wipro 
ఆల్‌ టైమ్‌ హై నుంచి ఎంత తగ్గింది: 50
TTM PE: 17.75
ఐదేళ్ల సగటు PE: 18.42

టెక్‌ మహీంద్ర – Tech Mahindra  
ఆల్‌ టైమ్‌ హై నుంచి ఎంత తగ్గింది: 44
TTM PE: 19.13
ఐదేళ్ల సగటు PE: 17.26

హెచ్‌సీఎల్‌ టెక్‌ – HCL Tech 
ఆల్‌ టైమ్‌ హై నుంచి ఎంత తగ్గింది: 23
TTM PE: 19.96
ఐదేళ్ల సగటు PE: 17.62

యంఫసిస్‌ – Mphasis
ఆల్‌ టైమ్‌ హై నుంచి ఎంత తగ్గింది: 51
TTM PE: 20.67
ఐదేళ్ల సగటు PE: 23.76

ఇన్ఫోసిస్‌ – Infosys
ఆల్‌ టైమ్‌ హై నుంచి ఎంత తగ్గింది: 35
TTM PE: 21.71
ఐదేళ్ల సగటు PE: 25.59

టీసీఎస్‌ – TCS
ఆల్‌ టైమ్‌ హై నుంచి ఎంత తగ్గింది: 23
TTM PE: 27.18
ఐదేళ్ల సగటు PE: 28.95

కోఫోర్జ్‌ – Coforge
ఆల్‌ టైమ్‌ హై నుంచి ఎంత తగ్గింది: 34
TTM PE: 31.24
ఐదేళ్ల సగటు PE: 27.08

ఎల్‌టీఎస్‌ఎస్‌ – LTSS
ఆల్‌ టైమ్‌ హై నుంచి ఎంత తగ్గింది: 42
TTM PE: 32.49
ఐదేళ్ల సగటు PE: 31.91

పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ – Persistent
ఆల్‌ టైమ్‌ హై నుంచి ఎంత తగ్గింది: 15
TTM PE: 38.19
ఐదేళ్ల సగటు PE: 25.81

ఎల్‌టీ మైండ్‌ట్రీ – LTIMindtree
ఆల్‌ టైమ్‌ హై నుంచి ఎంత తగ్గింది: 43
TTM PE: 43.28
ఐదేళ్ల సగటు PE: 27.99

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *