[ad_1]
Government Saving Schemes:
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్యోల్బణం తగ్గించేందుకు రెపోరేట్ల పెంపు కొనసాగించింది. దాంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు సైతం పెరిగాయి. ఇన్వెస్టర్లు కొన్నేళ్ల తర్వాత వీటిపై ఎక్కువ రాబడి కళ్లచూస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లేషన్ తగ్గుముఖం పడుతోంది. దాంతో ఆర్బీఐ రెపోరేట్లను తగ్గిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. అందుకే పెరిగిన వడ్డీరేట్ల వద్ద ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడానికి ఇదే మంచి సమయం! ముఖ్యంగా 60 ఏళ్లు పైబడ్డ వ్యక్తులు సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే 8.5 శాతం వడ్డీ పొందొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
వీరికి అవకాశం
సాధారణంగా రిటైర్మెంట్‌కు దగ్గరపడిన ఉద్యోగులు, ఇప్పటికే పదవీ విరమణ పొందిన వాళ్లు సురక్షితమైన పెట్టుబడి సాధనాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్ (Senior Citizen Saving Scheme) ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు అధిక వడ్డీరేటుకు (Interest Rate) డిపాజిట్ చేయడం ద్వారా ఎక్కువ రాబడి పొందొచ్చు. పైగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీముల్లో చేసే డిపాజిట్ మొత్తాన్ని రెట్టింపు చేసింది. పొందుతున్న రాబడిని అనుసరించి పన్ను మినహాయింపులూ ఉంటాయి.
ఏకంగా 8.2 శాతం వడ్డీ
ప్రస్తుతం సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్‌లో 8.2 శాతం వడ్డీని అందిస్తున్నారు. చాలా వాణిజ్య, ప్రభుత్వ రంగ బ్యాంకుల అందిస్తున్న వడ్డీరేటు కన్నా ఇదెంతో ఎక్కువ. పైగా ఇందులో జమ చేసే మొత్తాన్ని 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సవరించింది. డిపాజిట్ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది. స్థిర ఆదాయం (Fixed Income) పొందాలని భావించే వాళ్లకు ఇది మంచి అవకాశం. చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
పెంచిన పరిమితి
సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే ఏటా మార్చి 31, జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31న వడ్డీ జమ అవుతుంది. ప్రతి మూడు నెలలకు వడ్డీ జమ అవ్వడం వల్ల పెద్దలకు నిరంతరం ఆదాయం (Regular Income) లభిస్తుంది. ఈ స్కీమ్‌లో రూ.30 లక్షలు జమ చేస్తే ప్రతి మూడు నెలలకు రూ.60,000 వడ్డీరూపంలో వస్తుంది. సాధారణంగా 60 ఏళ్లు పైబడ్డ వారికే ఇందులో అవకాశం ఉండేది. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఒక నెల రోజుల్లోనే జమ చేస్తే 55 ఏళ్ల వారికే అనుమతి ఇస్తున్నారు.
ఆలోచించాకే నిర్ణయం
సాధారణంగా సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్ కాల పరిమితి ఐదేళ్లు. ఒకవేళ ముందుగానే డబ్బుల్ని విత్‌డ్రా చేయాలంటే అదనపు ఛార్జీలు వేస్తారు. అందుకే ఐదేళ్ల వరకు డిపాజిట్లు ఉంచగలరో లేదో ముందే నిర్ణయించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 8 శాతం కన్నా ఎక్కువ వడ్డీ ఎవ్వరూ ఇవ్వడం లేదు. పైగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్న పథకం కావడంతో ఇన్వెస్ట్ చేయడానిక ఇదే సరైన సమయం.
టాక్స్ చెక్!
ఈ స్కీమ్‌లో ఏడాదికి రూ.50000 వడ్డీ పొందుతున్న సీనియర్ సిటిజెన్లు ఆదాయ పన్ను (Income Tax) చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 15జీ, 15హెచ్ ఫామ్స్ సబ్మిట్ చేస్తే ఎలాంటి పన్నులూ వర్తించవు. ఒకవేళ ఏడాది తర్వాత రెండేళ్ల కన్నా ముందు ఈ స్కీమ్ నుంచి విరమించాలంటే అసలు పెట్టుబడిలో 1.5 శాతానికి సమానంగా డబ్బును కోత వేస్తారు.
Also Read: ప్రీమియం తగ్గించుకునే సులువైన దారుంది, రివార్డ్స్ కూడా వస్తాయ్
[ad_2]
Source link
Leave a Reply