[ad_1]
DCB Bank FD Rates:
పెట్టుబడి సురక్షితంగా ఉండి మంచి రాబడి కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్! డీసీబీ బ్యాంకు రూ.2 కోట్లలోపు సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లను సవరించింది. 2023, జూన్ 28 నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. సాధారణ వినియోగదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా 8 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. ఇక సీనియర్ సిటిజెన్లకు అదనంగా మరో అరశాతం కలుపుకొని 8.50 శాతం వరకు ఇస్తోంది.
ఎఫ్‌డీ వడ్డీరేట్లు ఇలా!
ఏడు రోజుల నుంచి 45 రోజులు మధ్య మెచ్యూరిటీ పొందే రెసిడెంట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై డీసీబీ బ్యాంకు 3.75 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. 46 రోజుల నుంచి 90 రోజులు ఎఫ్‌డీలపై 4 శాతం, 91 రోజుల నుంచి ఆరు నెలలలోపు డిపాజిట్లపై 4.75 శాతం, 6 నుంచి 12 నెలల్లోపు మెచ్యూరిటీ పొండే ఎఫ్‌డీలపై 6.25 శాతం వరకు వడ్డీ ఆదాయం అందజేస్తోంది. ఒకవేళ 12 నుంచి 15 నెలల వరకు డిపాజిట్ చేస్తే 7.5 శాతం వరకు వడ్డీ తీసుకోవచ్చు.
పద్దెనమిది నెలల నుంచి 700 రోజుల్లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.75 శాతం ఇంట్రెస్ట్ ఆర్జించొచ్చు. 700 రోజుల నుంచి 36 నెలల మధ్య చేసే డిపాజిట్లపై ఏకంగా 8 శాతం సంపాదన ఉంటుంది. కాగా 36 నెలల నుంచి 120 నెలల్లోపు ఉంచే డిపాజిట్లపై మాత్రం 7.75 శాతం వడ్డీ అందిస్తున్నామని బ్యాంకు వెల్లడించింది. ఇక సీనియర్ సిటిజన్లకు 7 రోజుల నుంచి 120 నెలల మధ్య మెచ్యూరిటీ పొందే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.25 శాతం నుంచి 8.50 శాతం వరకు అందిస్తోంది.
సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ
డీసీబీ బ్యాంకు (DCB Bank) సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది. ఒక లక్ష రూపాయాల లోపు నిల్వ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై 2 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. ఒకటి నుంచి రెండు లక్షల మధ్య బ్యాలెన్స్ మెయింటేన్ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.75 శాతం వడ్డీ అందజేస్తోంది. రెండు నుంచి ఐదు లక్షల రూపాయలు, ఐదు నుంచి పది లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉండే అకౌంట్లపై వరుసగా 5.25 శాతం, 6.25 శాతం వడ్డీ ఇస్తున్నట్టు ప్రకటించింది.
Also Read: డౌన్ మార్కెట్‌లోనూ డబ్బును కాపాడే ‘బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్’!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply