ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద 9% వరకు వడ్డీ ఇస్తున్న బ్యాంకులివి, వీటిలో ఒకటి ఎంచుకోవచ్చు

[ad_1]

Bank FD Interest Rates: దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసి, అదుపులో ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) 2022 క్యాలెండర్‌ సంవత్సరంలో తన రెపో రేటును ఐదు సార్లు పెంచింది. ఆ ఏడాది ఏప్రిల్‌లో 4.00 శాతంగా ఉన్న రెపో రేటును డిసెంబర్‌ నాటికి 6.25 శాతానికి తీసుకెళ్లింది, మొత్తంగా, కేవలం 9 నెలల్లోనే 2.25 శాతం రేటు పెంచింది. అదే బాటలో, బ్యాంకులు కూడా అన్ని టైమ్‌ పిరియడ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు ‍‌(FD Rate) పెంచి, ప్రజల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. 

ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposit) మీద తాజా రేటు పెంపు తర్వాత, దేశంలోని ప్రధాన బ్యాంకులు 8 శాతం వరకు వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ పెద్ద బ్యాంకుల పోటీని తట్టుకుని నిలదొక్కుకోవడానికి, కష్టమర్లను ఆకట్టుకోవడానికి కొన్ని చిన్న బ్యాంకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు కంటే కొంచం ఎక్కువ వడ్డీ రేటును అవి ఇటీవల ప్రకటించాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద సాధారణ ప్రజలకు 8.50 శాతం వరకు వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 9 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి.

ద్రవ్యోల్బణం అదుపు చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన రెపో రేటును ఇంకా పెంచే అవకాశం ఉంది. కాబట్టి, దానికి అనుగుణంగా బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు కూడా మరింత పెరగవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

మీరు కూడా స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకుల్లో 9 శాతం వరకు వడ్డీ ఆదాయం కోసం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ బ్యాంకులను పరిశీలించవచ్చు. 

news reels

9 శాతం వరకు వడ్డీ అందిస్తున్న చిన్న బ్యాంకులు
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 999 రోజుల FD మీద సామాన్యులకు 8.51 శాతం & సీనియర్ సిటిజన్‌లకు 8.76 శాతం వడ్డీని ఇస్తోంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 181 & 501 రోజుల కాల వ్యవధి డిపాజిట్ల మీద సాధారణ ప్రజలకు 8.50 శాతం & సీనియర్ సిటిజన్లకు 9.00 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది.
ఉజ్జీవన్ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్ 560 రోజుల వ్యవధి గల డిపాజిట్ల మీద 8.20% వడ్డీని చెల్లిస్తోంది.
ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 999 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద సాధారణ ప్రజలకు 8% & సీనియర్ సిటిజన్‌లకు 8.50% వరకు వడ్డీని అందిస్తోంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 700 రోజుల ఎఫ్‌డీ మీద సాధారణ పౌరులకు 8.25 శాతం & సీనియర్ సిటిజన్‌లకు 9 శాతం వడ్డీని ప్రకటించింది.

పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
మీరు ఈ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మొదట, ఈ బ్యాంకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉందేమో చెక్ చేసుకోవాలి. 

RBI డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ. 5 లక్షల వరకు బీమా కవరేజ్‌ను మీరు పొందవచ్చు. బ్యాంక్‌ ఇబ్బందుల్లో పడినప్పుడు మీరు నష్టపోకుండా, ఈ బీమా ద్వారా అసలు మొత్తం + వడ్డీ రెండింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *