[ad_1]
Fixed deposit Vs SCSS: పదవీ విరమణ తర్వాత కూడా తనకు డబ్బు కొరత ఉండకూడదని, ఆర్థిక ఇబ్బందులు రాకూడదని ప్రతి వ్యక్తి కోరుకుంటారు. పదవీ విరమణ ప్రయోజనాల రూపంలో వచ్చిన పెద్ద మొత్తాన్ని సరైన మార్గంలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో, పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizen Savings Scheme) ఒక మంచి పెట్టుబడి ఎంపిక. ఇందులో, సీనియర్ సిటిజన్లకు (60 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు) మంచి వడ్డీ రేటు లభిస్తోంది. బ్యాంకులు కేవలం 6% వడ్డీని అందించిన రోజుల్లోనూ ప్రజలు ఈ పోస్టాఫీస్ పథకం ద్వారా మంచి రాబడి పొందారు.
అయితే.. 2022 మే నుంచి, రిజర్వ్ బ్యాంక్ (RBI) తన రెపో రేటును పెంచుతూ వచ్చింది. ఈ పెంపుదల తర్వాత, చాలా బ్యాంకులు తమ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 8% వరకు వడ్డీని అందిస్తున్నాయి. ఈ పరిస్థితిలో, సీనియర్ సిటిజన్లకు SCSS ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని అందిస్తుందా, లేక బ్యాంక్ FD ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని అందిస్తుందా, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?.
SCSSలో ఎంత వడ్డీ అందుతోంది?
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లను 8 శాతానికి పెంచుతున్నట్లు 2022 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రేట్లు 2023 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించినవి. బ్యాంకుల విషయానికి వస్తే… యాక్సిస్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉండి, 2 సంవత్సరాల నుంచి 30 నెలల వరకు కాలపరిమితితో ఉన్న FDపై సీనియర్ సిటిజన్‌లకు గరిష్టంగా 8.01% వడ్డీ రేటును అందిస్తోంది. అదే సమయంలో, 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FDలపై 3.50 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. స్టేట్ బ్యాంక్ 2 కోట్ల రూపాయల కంటే తక్కువ FDలపై సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. HDFC బ్యాంక్ 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది.
SCSS vs బ్యాంక్ FD కాలవ్యవధి
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కాల వ్యవధి గురించి మాట్లాడుకుంటే… సీనియర్ సిటిజన్లు మొత్తం 5 సంవత్సరాల పాటు ఇందులో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. 5 సంవత్సరాల తర్వాత పెట్టుబడిని మరో 3 సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు. బ్యాంక్ FD గురించి చెప్పుకుంటే… 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఇందులో డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు. మరో విషయం ఏంటంటే, SCSS లో పెట్టుబడి పెడితే, సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు రాయితీని పొందుతారు. FDల విషయంలో, 5 సంవత్సరాల కాల పరిమితి కంటే ఎక్కువున్న డిపాజిట్ల మీద మాత్రమే ఈ మినహాయింపు అందుబాటులో ఉంటుంది.
SCSS vs బ్యాంక్ FDలో ఎంత పెట్టుబడి పెట్టవచ్చు
2023 బడ్జెట్‌లో భాగంగా, SCSS గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. ఈ పథకంలో డిపాజిట్ పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచినట్లు చెప్పారు. అదే సమయంలో, ఈ పథకంలో కనీస పెట్టుబడి పరిమితి రూ. 1,000 మాత్రమే. బ్యాంకుల విషయానికి వస్తే… కస్టమర్ తన అవసరానికి అనుగుణంగా బ్యాంకులో రూ. 2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలను కూడా ఎఫ్‌డీ చేయవచ్చు. వీటన్నింటినీ బట్టి చూస్తే… తక్కువ వ్యవధిలో బలమైన రాబడిని పొందాలనుకుంటే, పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది.
[ad_2]
Source link
Leave a Reply