[ad_1]
Stock Market News Today in Telugu: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం, 11 డిసెంబర్ 2023) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి, పాజిటివ్ నోట్‌తో ట్రేడ్ అవుతున్నాయి. దేశంలో పురాతన స్టాక్ మార్కెట్ BSE ఈ రోజు కొత్త చరిత్ర సృష్టించింది. BSE సెన్సెక్స్ తొలిసారి 70,000 మార్క్‌ను (Sensex at 70000 mark) అందుకుంది, కొత్త జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. మరోవైపు, తన తాజా గరిష్టం 21,000 స్థాయిని నిలబెట్టుకోవడానికి నిఫ్టీ ప్రయత్నిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
గత సెషన్లో (శుక్రవారం, 08 డిసెంబర్ 2023) 69,522 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 00 పాయింట్లు లేదా 0.14 శాతం పెరుగుదలతో 69,925 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది, ఆ వెంటనే 70,000 మైలురాయిని దాటింది. ఆ తర్వాత, 70,048.90 పాయింట్లతో జీవిత కాల గరిష్టానికి (Sensex fresh all-time high) చేరుకుంది. ఈ వార్త రాసే సమయానికి ఇదే ఆల్ టైమ్ హై లెవెల్. గత సెషన్లో 20,969 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 4.10 పాయింట్ల నామమాత్ర పతనంతో 20,965 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
ప్రి-ఓపెన్ సెషన్
స్టాక్ మార్కెట్ ప్రి-ఓపెనింగ్ సెషన్లో… BSE సెన్సెక్స్ 111 పాయింట్లు లేదా 0.16 శాతం పెరుగుదలతో 69,936 స్థాయి వద్ద కనిపించింది. NSE నిఫ్టీ 2.40 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో 20,971 స్థాయి వద్ద కొనసాగింది.
సెన్సెక్స్ & నిఫ్టీ షేర్ల పరిస్థితి
మార్కెట్ ప్రారంభ సమయానికి, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 14 స్టాక్స్ పెరిగాయి, మిగిలిన 16 స్టాక్స్ క్షీణించాయి. సెన్సెక్స్ టాప్ సెన్సెక్స్ గెయినర్స్‌లో… ఇండస్ఇండ్ బ్యాంక్ 1.47 శాతం, HCL టెక్ 1.19 శాతం లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 0.81 శాతం, కోటక్ మహీంద్ర బ్యాంక్ 0.67 శాతం పెరిగాయి.
ట్రేడింగ్ ప్రారంభంలో నామమాత్రపు పతనంతో ప్రారంభమైన నిఫ్టీ బిజినెస్, ఆ వెంటనే 8 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో గ్రీన్ జోన్లోకి వచ్చింది. నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో… ఆటో, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్ సూచీలు రెడ్ కలర్లో ఉన్నాయి. మిగిలిన అన్ని రంగాల్లో పచ్చదనం కనిపించింది.
బ్యాంక్ నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంతో ప్రారంభమై 47,487.60 వద్దకు చేరుకుంది. ఈ రోజు మార్కెట్‌కి బ్యాంక్ నిఫ్టీ నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. ఈ సూచీలోని మొత్తం 12 షేర్లు బుల్లిష్ ట్రేడింగ్‌ను చూస్తున్నాయి.
ఉదయం 10.05 గంటల సమయానికి… సెన్సెక్స్ 108.58 పాయింట్లు లేదా 0.16% పెరిగి 69,934.18 స్థాయి వద్ద; నిఫ్టీ 22.35 పాయింట్లు లేదా 0.11% లాభంతో 20,991.75 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి
శుక్రవారం సెషన్లో అమెరికన్ మార్కెట్లు మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చాయి. డో జోన్, S&P 500 వరుసగా 0.36 శాతం, 0.41 శాతం లాభపడగా, నాస్డాక్ కాంపోజిట్ 0.45 శాతం నష్టపోయింది.
సోమవారం ట్రేడ్ ప్రారంభంలో, ఆసియా మార్కెట్లలో… CSI 300 1.3 శాతం, హాంగ్ సెంగ్ 0.9 శాతం పడిపోయాయి. జపాన్ నికాయ్ 1.7 శాతం లాభపడింది. ఆస్ట్రేలియా S&P/ASX 200, దక్షిణ కొరియాలో కోప్సీ 0.2 శాతం వరకు పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి
[ad_2]
Source link
Leave a Reply