బడ్జెట్‌లో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి కానీ, చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి: శశిథరూర్ 

[ad_1]

Union Budget 2023: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంపై విపక్షాల సీనియర్ నేతలు స్పందించారు. బడ్జెట్‌లో కొన్ని మంచి అంశాలు ఉన్నాయని, దీనిని పూర్తిగా ప్రతికూల బడ్జెట్ అని అనబోనని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిశాక పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న శశిథరూర్.. బడ్జెట్‌లో కొన్ని మంచి అంశాలు ఉన్నాయని చెప్పారు. తాను దీనిని పూర్తి ప్రతికూల బడ్జెట్ అని అననని వెల్లడించారు. కానీ తనకు ఈ బడ్జెట్ విషయంలో తనకు చాలా ప్రశ్నలు తెలత్తుతున్నాయని వివరించారు. బడ్జెట్‌లో ఎంఎన్‌ఆర్‌ఈజీఏ ప్రస్తావన లేదని, కార్మికులకు ప్రభుత్వం ఏం చేయబోతోంది, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. 

బడ్జెట్ పై ప్రశంసలు కురింపించిన కార్తీ చిదంబరం 

కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు. తక్కువ పన్నుల విధానం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని తాను నమ్ముతానని చెప్పారు. ప్రజల చేతుల్లో డబ్బు పెట్టడం ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఉత్తమ మార్గం అని వివరించారు. 

ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ ఏమన్నారంటే..?

మరోవైపు ఇది ప్రభుత్వ ఎన్నికల బడ్జెట్ అని, ఈ బడ్జెట్‌లో రైతులకు ఒరిగిందేమీ లేదని ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ అన్నారు. రైతుల ఎంఎస్పీ గురించి మాట్లాడలేదని, రైల్వేలను పూర్తిగా విస్మరించారని అన్నారు. జనాభాలో సగానికిపైగా గ్రామాల్లో నివసిస్తున్న వారికి ఏమీ చేయలేదన్నారు. ఇది చాలా నిరాశాజనకమైన బడ్జెట్ అని వ్యాభ్యానించారు.

‘ఆర్థిక మంత్రి ఆదేశిక సూత్రాలను చదవాలి’

ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ.. బడ్జెట్ ఎప్పుడు చేసినా ఆర్టికల్ 39ని చూడాలని ఆర్థిక మంత్రికి చాలాసార్లు చెప్పానని అన్నారు.. కళ్లు మూసుకుని రాజ్యాంగాన్ని పొగుడుతూ బడ్జెట్ రూపొందిస్తే సాధించేదేమీ లేదన్నారు. ఆర్థిక మంత్రి ఉపాధి మార్గాల గురించి మాట్లాడారని మనోజ్ ఝా ఆరోపించారు. ప్రత్యేక వ్యక్తుల కోసం ప్రత్యేకంగా ఈ బడ్జెట్ ను రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *