బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించాలి – మంత్రి భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ

[ad_1]

MLC Kavitha On BC Welfare Budget 2024-25: హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చిందని, బడ్జెట్ లో నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. బీసీ సంక్షేమం (BC Welfare) కోసం 2024-25 బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నాడు ఆర్థిక మంత్రి భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. 
పూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత
మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని తన లేఖలో ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. బీసీ సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని కవిత ప్రస్తావించారు. అలాగే, ప్రతి జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్ల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని లేఖలో తెలిపారు. 

బీసీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ తాజా బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ నిధుల కేటాయింపు ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చినట్లవుతుందని, బీసీలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ నిధులు దోహదపడుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేయాలని, అందుకు బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *