బరువు తగ్గడం కష్టమవుతుందా..? మీ డైట్‌లో ఇవి చేర్చుకోండి..!

[ad_1]

Food For Weight Loss: బరువు ఎక్కువగా ఉంటే.. తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమూ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక బరువు వల్ల డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అధిక బరువుతో బాధపడేవాళ్లు.. వ్యాయామం చేయడం, బరువులు ఎత్తడం, వాకింగ్‌, డైటింగ్‌ చేయడం వంటివి చేస్తుంటారు. ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. కొందరు బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకుంటారు. మీరు వైయిట్‌ లాస్‌ అవ్వాలనుకుంటే.. మంచి లైఫ్‌స్టైల్‌ పాటిస్తూ, పోషకాహారం తీసుకుంటే.. మీరు త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. మీ డైట్‌లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే.. మీరు ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

గ్రీన్‌ టీ..

పబ్మెడ్ నివేదిక ప్రకారం, బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎఫెక్టివ్‌ డ్రింక్‌. రోజూ గ్రీన్‌ టీ తాగితే.. జీవక్రియ మెరుగుపడుతుంది. గ్రీన్‌ టీలోని పోషకాలకు శరీరంలోని కొవ్వులను కరిగించే శక్తి ఉన్నట్టు తేలింది. స్థూలకాయంతో బాధపడేవాళ్లు వ్యాయామంతో పాటు గ్రీన్‌ టీ తాగితే బాగుంటుంది. గ్రీన్‌ టీ లో మెండుగా ఉండే రెసిపెరిట్రాల్‌ పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే.. మీ డైట్‌లో కచ్చితంగా గ్రీన్‌ టీ చేర్చుకోండి.

పెసరలు..

పెసర పప్పులో విటమిన్‌ A, B, C, E, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయ. దీనిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో అదనంగా, ప్రొటీన్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఇవి రెండూ మీ కడుపు ఎక్కువ సేపు ఫిల్లింగ్‌గా ఉండేలా చేస్తాయి. మీకు త్వరగా ఆకలిగా అనిపించదు, దీని వల్ల మీ అనవరసంగా తిండి తినే అలవాటుకు దూరంగా ఉంటారు. మీరు బరువ తగ్గడంలో సహాయపడుతుంది.

పచ్చి మిర్చి..

NIH నివేదిక ప్రకారం, పచ్చి మిరపకాయలు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. దీనికి స్థూలకాయాన్ని నిరోధించే లక్షణాలు ఉన్నాయి. ఊబకాయం ముప్పును తగ్గించడమే కాకుండా, అధిక బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే జీవక్రిను మెరుగుపరుస్తుంది.

కరివేపాకు..

NCBI నివేదిక ప్రకారం, కరివేపాకు మన డైట్‌లో చేర్చుకుంటే బరువు కంట్రోల్‌లో ఉంటుంది. దీనిలో డైక్లోరోమీథేన్, ఇథైల్ అసిటేట్, మహానింబైన్ వంటి స్పెషల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడతాయి.

యాలకులు..

యాలకులను క్వీన్‌ ఆఫ్‌ స్పైసెస్‌ అని కూడా పిలుస్తారు. ఇది థర్మోజెనిక్ మొక్క. యాలకులలోని పోషకాలు.. శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపడానికి సహాపడుతుంది, జీవక్రియను పెంచుతుంది. యాలకులు మీ డైట్‌లో చేర్చుకుంటే.. శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వు కరుగుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *