బిలియనీర్స్ లిస్టులో టాప్ విజేతలుగా గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ

[ad_1]

Forbes World Billionaire List: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ ఈరోజు ఫోర్బ్స్ రియల్ టైమ్ వరల్డ్ బిలియనీర్ జాబితాలో టాప్ విజేతలుగా నిలిచారు. భారత్ లో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ నికర విలువ 723 మిలియన్లు పెరిగింది. రెండో అత్యంత సంపన్నుడిగా ఉన్న గౌతమ్ అదానీ నికర విలువ 886 మిలియన్లు పెరిగినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ప్రపంచ బిలియనీర్ జాబితాలో అంబానీ 14వ స్థానంలో ఉండగా.. అదానీ 24వ స్థానంలో ఉన్నారు. 

టాప్ 25లోకి వచ్చిన గౌతమ్ అదానీ

ప్రపంచంలోని టాప్ 25 బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ మరోసారి చోటు దక్కించుకున్నారు. బిలియన్ల నికర విలువతో, ఆయన జాబితాలో 24వ స్థానంలో నిలిచారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ.. అమెరికా షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్‌ రిపోర్టు తర్వాత భారీగా సంపద కోల్పోయారు. లక్షలాది కోట్లు కోల్పోయి కనీసం టాప్ 25లో కూడా స్థానం సంపాదించుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం గౌతమ్ అదానీ క్రమంగా పైకి ఎగబాకుతున్నారు. ప్రస్తుతం టాప్ 25లో చోటు దక్కించుకున్నారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ ప్రస్తుతం 24వ స్థానంలో  నిలిచారు.

ఒకటో ప్లేస్‌లో ఎలాన్ మస్క్‌, జెఫ్ బెజోస్ ఎక్కడంటే?

ప్రపంచ కుబేరుడిగా టెస్లా, స్పేస్‌ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ నిలిచారు. 227 బిలియన్ డాలర్ల నికర విలువతో మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ నిలిచారు. 223.5 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగి ఉన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 161.1 బిలియన్ డాలర్ల నికర విలువతో మూడో స్థానంలో నిలిచారు. 141.9 బిలియన్ డాలర్ల నికర విలువతో ల్యారీ ఎలిసన్ నాలుగో స్థానంలో ఉన్నారు. 119.7 బిలియన్ డాలర్ల నికర విలువతో వారెన్ బఫెట్ ఐదో స్థానంలో, 117.2 బిలియన్ డాలర్ల నికర విలువతో బిల్ గేట్స్ ఆరో స్థానంలో ఉన్నారు. 109.7 బిలియన్ డాలర్ల నికర విలువతో గూగుల్ సహవ్యవస్థాపకుడు ల్యారీ పెజ్ ఏడో స్థానంలో, 108.3 బిలియన్ డాలర్లతో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ 8వ స్థానంలో ఉన్నారు. టాప్ 10 ధనవంతుల్లో 9 మంది అమెరికా నుంచే ఉండగా.. రెండో స్థానంలో ఉన్న బెర్నార్డ్ మాత్రమే ఫ్రాన్స్ కు చెందినవారు. 

Also Read: Citizenship Gave Up: భారత్‌ను వదిలేస్తున్న భారతీయులు – 12 ఏళ్లలో ఏకంగా 16.63 లక్షల మంది, కారణమేంటో తెలుసా?

మూడో ఏడాది కూడా జీతం తీసుకోని ముఖేష్ అంబానీ

2020 జూన్ లో భారత్ లో కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖేష్ అంబానీ 2020-21 సంవత్సరానికి తన జీతాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న విషయం తెలిసిందే. ఆయన 2021-22 సంవత్సరంతో పాటు 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ ముఖేష్ అంబానీ జీతం తీసుకోలేదని ఆ సంస్థ వెల్లడించింది. ఈ మూడు ఆర్థిక సంవత్సరాల్లో ముఖేష్ అంబానీ.. ఛైర్మన్ గా, మేనేజింగ్ డైరెక్టరుగా రిలయన్స్ నుంచి ఎలాంటి అలవెన్సులు, అనుమతులు, పదవీ విరమణ ప్రయోజనాలు, కమీషన్లు, స్టాక్ ఆప్షన్లు పొందలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) పేర్కొంది. అంతకు ముందు 2008-09 నుంచి ఛైర్మన్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా తన వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసిన విషయం తెలిసిందే.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *