బ్రౌన్‌రైస్‌తో లాభాలు

[ad_1]

బ్రౌన్ రైస్ తినాలంటే చాలా మందికి అంతగా ఇష్టం ఉండదు. ఇవి కాస్తా లావుగా ఉంటాయని ఆసక్తి చూపరు. కానీ, వీటిని కొన్ని విధాలుగా వండితే అవి తినడానికి రుచిగా ఉండి వాటిలోని పోషకాలు మనకి అందుతాయి. వీటిని రెగ్యులర్గా ఒకేలా తినడం కష్టం. అంతగా ఇష్టపడరు. అందుకే వీటిని వండే విధానంలో కొన్ని కిటుకులు పాటించాలి. వాటిని ఎన్ని విధాలుగా వండాలి. ఏమేం చేయొచ్చు. బ్రౌన్రైస్లోని గొప్ప పోషకాలు ఏంటి? పూర్తిగా తెలుసుకుందాం.

బ్రౌన్‌రైస్‌లో పోషకాలు..

బ్రౌన్‌రైస్‌లో పోషకాలు..

బ్రౌన్రైస్లో ఎక్కువగా ఖనిజాలు, విటమిన్స్ ఉంటాయి. వైట్రైస్గా ఇవి తయారయ్యే సరికి ఇవన్నీ పోతాయి. తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న బ్రౌన్రైస్ తినడం వల్ల రక్తంలో చక్కెర పెరగదు. ఇది డయాబెటిస్ వారికి చాలా మంచిది. బ్రౌన్రైస్లోని పోషకాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మిమ్మల్ని జబ్బులు, స్ట్రోక్ నుంచి కాపాడతాయి.

Also Read : Romance Mistakes : హస్తప్రయోగం చేసేటప్పుడు ఇలా అస్సలు చేయొద్దు

బరువు తగ్గించే బ్రౌన్‌రైస్..

బరువు తగ్గించే బ్రౌన్‌రైస్..

బ్రౌన్రైస్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బరువుని తగ్గించేందుకు బ్రౌన్రైస్ చాలా మంచిది. చాలా మంది వీటిని తింటుంటారు. పెరిగిన అవగాహన వల్ల వీటిని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఎప్పుడు వాటిని అన్నంలానే వండి తినకుండా కాస్తా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
Also Read : Leather sofa cleaning : లెదర్ సోఫాలను ఇలా క్లీన్ చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయ్..

బ్రౌన్ రైస్ పులావ్..

బ్రౌన్ రైస్ పులావ్..

కావాల్సిన పదార్థాలు..

1 కప్పు బ్రౌన్రైస్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, అర టీ స్పూన్ జీలకర్ర, రెండున్నర కప్పుల నీరు, ఉప్పు తగినంత, 2 మీడియం తరిగిన ఉల్లిపాయ, అర టీ స్పూన్ ముక్కలు చేసిన వెల్లుల్లి, 5 తరిగిన బీన్స్, పావు కప్పు బఠానీలు, 2 మీడియం బంగాళాదుంపల్ని ముక్కలుగా చేయాలి, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, గరం మసాలా పొడి, 1 మీడియం క్యారెట్, 1 కొత్తిమీర ఆకులు

తయారీ విధానం..

ముందుగా బ్రౌన్రైస్ని నీటితో కడిగి, నీటిలో గంటసేపు నానబెట్టాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని స్టౌపై పెట్టండి. నెయ్యి వేసి వేడి చేయండి. తర్వాత జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించండి. ఉల్లిపాయలు వేసి బాగా వేయించండి. పచ్చి బఠానీలు, బంగాళాదుంపలు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక బియ్యం వేసి వేయించాలి. తర్వాత నీరు పోసి గరం మసాలా, పెప్పర్ పౌడర్ వేసి కలపాలి. బ్రౌన్రైస్ ఉడికే వరకూ ఉంచండి. కుక్కర్ అయితే 4 విజిల్స్ వచ్చే వరకూ ఉంచి 10 నిమిషాల ప్రెజర్కి వదలండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయండి.
Also Read : Heart attacks in Winter : గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వెజ్ బిర్యానీ..

వెజ్ బిర్యానీ..

కావాల్సిన పదార్థాలు..

2 కప్పుల బ్రౌన్రైస్
1కప్పు పెరుగు
1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1 టేబుల్ స్పూన్ కారం
1 టీ స్పూన్ ధనియాల పొడి
1 స్పూన్ గరం మసాలా
ఉప్పు రుచికి తగినంత
అరకప్పు క్యారెట్ తరుగు
అరకప్పు పచ్చి బఠానీలు
అరకప్పు ఫ్రై చేసిన ఉల్లిపాయలు
కొత్తిమీర తరుగు
1 టేబుల్ స్పూన్ నెయ్యి

తయారీ విధానం..

బ్రౌన్రైస్ని ముందుగా కడిగి 45 నిమిషాల పాటు నానబెట్టండి. కూరగాయలు శుభ్రం చేసి కత్తిరించండి. మిక్సింగ్ గిన్నెలో అని పొడి మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్తో పెరుగు వేసి బాగా కలపాలి. ప్రెజర్ కుక్కర్ తీసుకుని మ్యారినేట్ చేసిన మసాలాలు వేసి, అల్లం పేస్ట్ వేసి ఉడికించండి. తర్వాత కూరగాయల తరుగు, పచ్చి బఠానీలు అన్ని వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు, నానబెట్టిన బ్రౌన్రైస్ వేసి 2 కప్పు నీరు వేసి పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి నెయ్యి వేయాండి మూతపెట్టి 10 నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి. మంటను 20 నిమిషాలు ఆవిరి మీద ఉంచండి. తర్వాత ఫ్రై చేసిన ఉల్లిపాయ పై నుంచి గార్నిష్ చేయండి.

బ్రౌన్ రైస్ దోశ..

బ్రౌన్ రైస్ దోశ..

అరకప్పు బ్రౌన్ రైస, కప్పు పెసరపప్పు, 2 టీ స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ అల్లం మిర్చి పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఇంగువ, అర టీ స్పూన్ పసుపు, 2 లవంగాలు, 3 నల్ల మిరియాలు, కొత్తిమీర తరుగు

తయారీ విధానం..

బ్రౌన్రైస్, పెసరపప్పుని కలిపి కడగండి. అరగంట నీటిలో నానబెట్టండి. ప్రెజర్ కుక్కర్లో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయ వేసి ఫ్రై చేయండి. ఆపై మసాలాలాలు వేయండి. కూరగాయలు వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు బ్రౌన్ రైస్, పప్పు వేసి నీరు వేసి ఉప్పు వేసి విజిల్ పెట్టి ఉడికించండి. కొత్తిమీరతో గార్నిష్ చేయండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *