[ad_1]
Car Sales October 2023: మన దేశంలో హ్యుందాయ్ రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. అక్టోబర్ నెలలో 55,000 వాహనాలను విక్రయించడంలో కంపెనీ విజయం సాధించింది. ఎప్పటిలాగే మారుతీ సుజుకీ ఛార్ట్‌లో మొదటి స్థానంలో ఉండగా, టాటా మోటార్స్ మూడో స్థానంలో ఉంది. దేశంలో మహీంద్రా కార్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, టాటా మోటార్స్, మహీంద్రా మధ్య వ్యత్యాసం క్రమంగా తగ్గుతోంది. కియా గురించి చెప్పాలంటే గత నెలలో టాప్ కారు కంపెనీల జాబితాలో టయోటాను దాటి ఐదో స్థానాన్ని సాధించగలిగింది.
హ్యుందాయ్ విక్రయాలు ఇలా…
కొరియన్ కార్ల కంపెనీ హ్యుందాయ్ 2023 అక్టోబర్‌లో మొత్తం 55,128 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 48,001 యూనిట్లతో పోలిస్తే, వార్షిక ప్రాతిపదికన అమ్మకాలలో 15 శాతం పెరుగుదల సాధించింది. క్రెటా గత నెలలో 13,077 యూనిట్ల అమ్మకాలతో బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో 11,880 యూనిట్లను హ్యుందాయ్ విక్రయించింది. గతేడాదితో పోలిస్తే 10.08 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది.
హ్యుందాయ్ వెన్యూ గురించి మాట్లాడితే 2023 అక్టోబర్‌లో 11,581 యూనిట్ల అమ్మకాలతో ఇది అత్యధికంగా అమ్ముడైన రెండో మోడల్‌గా నిలిచింది. గత సంవత్సరం ఇదే నెలలో 9,585 యూనిట్లను కంపెనీ విక్రయించింది. ఇది కాకుండా ఇతర కార్ల గురించి చెప్పాలంటే 2023 అక్టోబర్ నెలలో ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీ 8,097 యూనిట్లు, ఐ20 హ్యాచ్‌బ్యాక్ 7,212 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత నెలలో కంపెనీ గ్రాండ్ ఐ10 నియోస్ 6,552 యూనిట్లు, ఆరా 4,096 యూనిట్లను విక్రయించింది. ఇది కాకుండా అయోనిక్ 5 ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్‌కు సంబంధించి 117 కార్లు అమ్ముడు పోయాయి.
మహీంద్రా పరిస్థితి ఇలా…
దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా 2023 అక్టోబర్‌లో 43,708 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల గణాంకాలను పరిశీలిస్తే 32,186 యూనిట్ల విక్రయంతో 36 శాతం అమ్మకాల వృద్ధి నమోదైంది. కంపెనీ గత నెలలో 13,578 యూనిట్ల స్కార్పియో నేమ్‌ప్లేట్‌ను (స్కార్పియో ఎన్ + స్కార్పియో క్లాసిక్) విక్రయించగా, 2022 అక్టోబర్‌లో ఈ సంఖ్య 7438 యూనిట్లుగా ఉంది. ఇది కాకుండా అక్టోబర్ 2023లో 9,647 యూనిట్ల బొలెరో, 9,297 యూనిట్ల XUV700 విక్రయించబడ్డాయి. ఇక థార్ గురించి చెప్పాలంటే గత నెలలో 5,593 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఇదీ కియా పరిస్థితి
కొరియన్ కార్ల బ్రాండ్ కియా 2023 అక్టోబర్‌లో మొత్తం అమ్మకాలను 24,351 యూనిట్లుగా నమోదు చేసింది. అయితే గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 23,323 యూనిట్లుగా ఉంది. ఇది వార్షిక ప్రాతిపదికన నాలుగు శాతం పెరిగింది. గత నెలలో కియా కొత్త సెల్టోస్‌కు సంబంధించి 12,362 యూనిట్లు, కారెన్స్ ఎంపీవీకి సంబంధించి 5,355 యూనిట్లను విక్రయించగా, సోనెట్ 6,493 యూనిట్లు, ఈవీ6కి సంబంధించి 141 యూనిట్లు అమ్ముడుపోయాయి.
ఈ దీపావళికి తమ కార్లపై భారీ తగ్గింపులను అందజేస్తున్న కంపెనీల్లో వోల్వో కూడా చేరింది. దీని కార్లపై ఏకంగా రూ.ఏడు లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నారు. ‘ఫెస్టివ్ డిలైట్’ ఆఫర్‌లో భాగంగా వోల్వో… ఎక్స్‌సీ40 రీఛార్జ్ ఈవీ, ఎక్స్‌సీ60 ఎస్‌యూవీలపై భారీ తగ్గింపులను అందించింది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
[ad_2]
Source link
Leave a Reply