[ad_1]
Bank NPAs: ఏ బ్యాంక్ విషయంలోనైనా, నికర నిరర్ధక ఆస్తులు (non-performing assets లేదా NPAs) ఎంత ఎక్కువ ఉంటే అది ఆ బ్యాంక్‌కు అంత చేటు. నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA) అంటే, ఒక బ్యాంక్ ఇచ్చిన రుణం తాలూకు అసలు లేదా వడ్డీ చెల్లింపు గడువు ముగిసి 90 రోజులు అయితే, దానిని NPA కింద జమ కడతారు. చాలా బ్యాంక్‌లు ఇప్పటికే Q4 ఫలితాలను ప్రకటించాయి కాబట్టి, వాటి NPAs గురించి తెలుసుకోవడం మంచిది.
NPAలు ఎక్కువగా ఉన్న బ్యాంకులు:
సౌత్ ఇండియన్ బ్యాంక్ (South Indian Bank) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 16.3
Q4FY23లో సౌత్ ఇండియన్ బ్యాంక్ నికర NPA నిష్పత్తి 1.86%గా ఉంది, ఇది భారతీయ ప్రైవేట్ బ్యాంకుల్లోనే అత్యధికం. ఈ స్టాక్ తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 21.8 కంటే 25% దిగువన ట్రేడవుతోంది. స్టాక్ PE నిష్పత్తి 4.72 వద్ద ఉంది.
జమ్మ &కశ్మీర్ బ్యాంక్ (Jammu & Kashmir Bank) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 55.6
జమ్మ &కశ్మీర్ బ్యాంక్ 2023 ఆర్థిక సంవత్సరం Q4లో 1.62% నికర NPAని నివేదించింది. ఈ స్టాక్ తన 52 వారాల గరిష్ట స్థాయి రూ. 62.8 నుంచి 11% దిగువన ట్రేడవుతోంది. స్టాక్ PE నిష్పత్తి 4.87 వద్ద ఉంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Equitas Small Finance Bank) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 707.5
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నికర NPA నిష్పత్తి Q4FY23లో 1.21% గా ఉంది. ఈ స్టాక్ తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 721.3 నుంచి 2 శాతం దిగువన ట్రేడవుతోంది. స్టాక్ PE నిష్పత్తి 32.36 వద్ద ఉంది.
ఆర్‌బీఎల్ బ్యాంక్ (RBL Bank) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 150.7
FY23 మార్చి త్రైమాసికంలో RBL బ్యాంక్ నికర NPA నిష్పత్తి 1.1% గా ఉంది. ఈ స్టాక్ తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 189.2 నుంచి 20% దిగువన ట్రేడవుతోంది. స్టాక్ PE నిష్పత్తి 10.21 వద్ద ఉంది.
డీసీబీ బ్యాంక్ (DCB Bank) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 117.2
Q4FY23లో DCB బ్యాంక్ నికర NPA 1.04% గా నివేదించింది. ఈ స్టాక్ తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.141.2 నుంచి 17% దిగువన ట్రేడవుతోంది. స్టాక్ PE నిష్పత్తి 7.47 వద్ద ఉంది.
ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 53.3
Q4Y23లో IDBI బ్యాంక్ 0.92% నికర NPAని నివేదించింది. ఈ స్టాక్ తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 62 నుంచి 14 శాతం దిగువన ట్రేడవుతోంది. స్టాక్ PE నిష్పత్తి 15.9 వద్ద ఉంది.
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ (IDFC First Bank) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 64.8
Q4FY23లో IDFC ఫస్ట్ బ్యాంక్ నికర NPA నిష్పత్తి 0.86% గా ఉంది. ఈ స్టాక్ తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 65.9 నుంచి 2% దిగువన ట్రేడవుతోంది. స్టాక్ PE నిష్పత్తి 17.4 వద్ద ఉంది.
యెస్ బ్యాంక్ (YES Bank) | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 16.01
YES బ్యాంక్ 2023 ఆర్థిక సంవత్సరం Q4లో 0.83% నికర NPAని నివేదించింది. ఈ స్టాక్ తన 52 వారాల గరిష్ట స్థాయి రూ. 24.8 నుంచి 35% తక్కువగా ట్రేడవుతోంది. స్టాక్ PE నిష్పత్తి 63.97 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply