మందకొడిగా స్టాక్‌ మార్కెట్‌, స్పష్టమైన డైరెక్షన్‌ కోసం వెయిటింగ్‌

[ad_1]

Stock Market News Today in Telugu: ఈ రోజు ( బుధవారం, 13 డిసెంబర్‌ 2023) ఇండియన్‌ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి, అక్కడి నుంచి ఎటు వైపు వెళ్లాలో డైరెక్షన్‌ లేక స్ట్రగుల్‌ అవుతున్నాయి. HDFC బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్ర బ్యాంక్ వంటి హెవీ వెయిట్స్‌లో పతనం మార్కెట్‌ను కిందకు లాగుతోంది. ఐటీ షేర్ల స్పీడ్‌కు టీసీఎస్ బ్రేక్ వేసింది. అపోలో హాస్పిటల్స్‌, భారతి ఎయిర్‌టెల్‌ కూడా కాస్త తగ్గి ప్లే అవుతున్నాయి. 

నవంబర్‌ నెలలో, అమెరికాలో ద్రవ్యోల్బణం కొద్దిగా పెరిగింది. ఈ రోజు యూఎస్‌ ఫెడ్‌ పాలసీ నిర్ణయాలు వెలువడతాయి. మన మార్కెట్లు ముగిసిన తర్వాత అవి తెలుస్తాయి, రేపు (గురువారం) మన మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. ఈ నేపధ్యంలో, గ్లోబల్‌ క్యూస్‌ కోసం ఇండియన్‌ మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
గత సెషన్‌లో (మంగళవారం, 11 డిసెంబర్‌ 2023) 69,551 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 97.53 పాయింట్లు లేదా 0.14 శాతం పెరుగుదలతో 69,648 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది, గత సెషన్‌లో 20,997 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 3.35 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 20,929 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

నెమ్మదించిన బ్యాంక్ నిఫ్టీ
బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు లాభాల్లో ప్రారంభమైనా, ఓపెనింగ్‌ నుంచే నష్టాల్లోకి జారుకుంది. ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఈ ఇండెక్స్‌ 93 పాయింట్ల పతనంతో 47,004 స్థాయి వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీలోని 12 షేర్లలో 5 లాభాలతో ట్రేడవుతుండగా, 7 షేర్లు క్షీణించాయి.

సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
బిజినెస్‌ ప్రారంభంలో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 30 షేర్లలో 17 గ్రీన్‌ జోన్‌లో ఉండగా, 13 షేర్లు రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో… NTPC 2.43 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.44 శాతం చొప్పున పెరిగాయి. పవర్ గ్రిడ్‌లో 1.43 శాతం, M&M 1.07 శాతం లాభాల్లో కనిపించాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి ITC 2 శాతం అప్‌సైడ్‌లో ఉంది, ఆ తర్వాత కొన్ని నిమిషాలకే 0.87 శాతం లాభానికి పరిమితమైంది. BSE టాప్‌ లూజర్స్‌లో… TCS, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకీ ఉన్నాయి.

బ్రాడర్‌ మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ సూచీలు వరుసగా 0.09 శాతం & 0.24 శాతం పెరిగాయి.

నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.3 శాతం క్షీణించింది, చాలా రంగాల సూచీలు లోయర్‌ సైడ్‌లో ఉన్నాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 0.8 శాతం అప్‌సైడ్‌లో ఉంది. 

ప్రి-మార్కెట్ సెషన్‌
స్టాక్ మార్కెట్ ప్రి-ఓపెనింగ్‌లో, NSE నిఫ్టీ 20.60 పాయింట్లు లేదా 0.10 శాతం లాభంతో 20927 స్థాయిలో, BSE సెన్సెక్స్ 115.10 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 69,666 స్థాయిలో ట్రేడయ్యాయి. 

ఉదయం 10.00 గంటల సమయానికి… సెన్సెక్స్‌ 58.26 పాయింట్లు లేదా 0.083% పెరిగి 69,986.79 స్థాయి వద్ద; నిఫ్టీ 32.30 పాయింట్లు లేదా 0.1% లాభంతో 21,029.40 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 

గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
అమెరికాలో నవంబర్ ద్రవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగా వచ్చిన తర్వాత, మంగళవారం, S&P 500 0.46 శాతం పెరిగింది. డౌ జోన్స్‌ 0.48 శాతం లాభపడింది. నాస్డాక్ కాంపోజిట్ 0.70 శాతం గెయిన్‌ అయింది. బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో నికాయ్‌, ASX 200 0.6 శాతం వరకు అప్‌సైడ్‌లో ట్రేడవుతుండగా, కోస్పి, హ్యాంగ్ సెంగ్ తలో 0.3 శాతం తగ్గాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: నాలుగు నెలల తర్వాత మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం, అయితే ఈసారి కాస్త ఊరట

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *