[ad_1]
బ్లడ్ షుగర్ స్క్రీనింగ్..
యాభై ఏళ్లు దాటిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు చెక్ చేయించుకోవాలని ట్రస్ట్‌ల్యాబ్ డయాగ్నోస్టిక్స్‌లో మైక్రోబయాలజీ హెడ్ డాక్టర్ జానకిరామ్ అన్నారు. మీరు ఆకస్మికంగా బరువు తగ్గినా, గాయం త్వరగా మానకపోయినా, దాహం ఎక్కువగా వేయడం వంటి లక్షణాలు ఉంటే బ్లడ్ షుగర్ లెవల్ టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు.
లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ చెక్..
కంప్లీట్ కొలెస్ట్రాల్ టెస్ట్.. రక్తంలో నాలుగు రకాల లిపిడ్లను కొలుస్తుంది. రక్తంలోని మొత్తం కొలెస్ట్రాల్, తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్, అధిక సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ (HDL), ట్రైగ్లిజరైడ్ స్థాయిలను గుర్తించడానికి ఈ పరీక్ష సహాయపడుతుంది. వీటిలో ఎల్‌డీఎల్‌ను చెడు కొలెస్ట్రాల్ అంటారు. రక్తంలో దీని స్థాయిలు ఎక్కువగా ఉంటే.. గుండెపోటు, స్ట్రోక్, అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. పురుషులకు 50 దాటిన తర్వాత.. సంవత్సరానికి ఒకసారైనా ఈ పరీక్ష చేయించుకోవడం మేలు.
Olive Oil Health Benefits: వంటకు ఈ నూనె వాడితే.. గుండెకు మంచిది..!
రక్తపోటు పరీక్ష..
పురుషులుకు యాభై ఏళ్లు దాటిన తర్వాత హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైపర్‌టెన్షన్ కారణంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, కొరోనరీ ఆర్టరీ వ్యాధుల ముప్పు పెరుగుతుందని. మీరు తరచుగా బీపీని పరీక్షించుకోవడం మేలు.
ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్..
పురుషులలో 50 ఏళ్లు దాటిన తర్వాత.. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్.. రక్తంలో ప్రోస్టేట్ గ్రంధి ద్వారా ఉత్పత్తి అయ్యే, PSA ప్రొటీన్ స్థాయిని గుర్తిస్తుంది. PSA స్థాయిలు ఎక్కువగా ఉంటే.. ప్రోస్టేట్ క్యాన్సర్, ఇతర ప్రోస్టేట్ సమస్యలను సూచిస్తాయి.
Monsoon health care: వర్షాకాలం అలర్జీలకు చెక్ పెట్టే ఆహారాలు ఇవే..!
రీనల్ టెస్ట్..
డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఉన్నవారికి.. కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మగవారు 50 ఏళ్లు దాటిన తర్వాత.. కిడ్నీల పనితీరు పరీక్ష చేయించుకోవడం మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply