మరో మెగా డీల్‌ కుదుర్చుకున్న అదానీ, అంబుజా సిమెంట్స్‌ చేతికి సంఘి సిమెంట్‌

[ad_1]

Ambuja Cements Acquires Sanghi Industries: సిమెంట్ ఇండస్ట్రీలో మరో బిగ్‌ డీల్‌ జరిగింది. అదానీ గ్రూప్‌లోని అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, సంఘి ఇండస్ట్రీస్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేస్తోంది. 5,000 వేల కోట్ల రూపాయల ఎంటర్‌ప్రైజ్ వాల్యూతో కొనుగోలు చేయడానికి రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది.

ఈ డీల్‌ ఎలా జరుగుతుంది?
అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, సంఘి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో 56.74 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్ గ్రూప్ శ్రీ రవి సంఘి & ఫ్యామిలీ నుంచి పర్చేజ్‌ చేస్తుంది. అంబుజా సిమెంట్స్ ఇంటర్నల్‌ ఫండ్‌ రైజింగ్‌ ద్వారా డబ్బులు సమకూరుస్తుంది. ఈ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ ద్వారా, సంఘి సిమెంట్స్‌కున్న ఆస్తులతో పాటు అప్పులను కూడా అంబుజా సిమెంట్స్‌ తీసుకుంటుంది. ప్రస్తుతం, సంఘి సిమెంట్స్‌ రూ.1500 కోట్ల అప్పుల్లో ఉంది. ఆ అప్పులు తీర్చలేకపోతోంది.

సంఘి ఇండస్ట్రీస్‌ ఆస్తులు
సంఘి ఇండస్ట్రీస్‌కు గుజరాత్‌లోని కచ్ జిల్లాలో, భారతదేశంలోనే అతి పెద్ద సింగిల్ లొకేషన్ సిమెంట్ & క్లింకర్ యూనిట్‌ ఉంది. ఇది ఇండిగ్రేటెడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌. దీని కొనుగోలుతో, అతి పెద్ద సంఘి సిమెంట్ యూనిట్‌ అంబుజా సిమెంట్స్‌ చేతికి వస్తుంది. ఈ యూనిట్‌ 2,700 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 6.6 MTPA (million tonne per annum) ఇంటిగ్రేటెడ్ యూనిట్‌తో పాటు 6.1 MTPA గ్రైండింగ్ యూనిట్‌ కూడా దీనిలో భాగం. వీటితో పాటు, 130 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్, 13 మెగావాట్ల వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్ ఉంది. 

అంబుజా సిమెంట్‌కు వచ్చే బెనిఫిట్‌ ఏంటి?
ప్రస్తుతం, అదానీ గ్రూప్‌లో ఉన్న సిమెంట్‌ కంపెనీలు అంబుజా సిమెంట్‌, ACC కలిపి 70 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఉంది. 2030 నాటికి దీనిని 140 మిలియన్‌ టన్నులకు చేర్చాలన్నది లక్ష్యం. సంఘి సిమెంట్‌ కొనుగోలుతో, అంబుజా సిమెంట్స్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతమున్న 67.5 MTPA నుంచి 73.6 MTPAకి పెరుగుతుంది. 2030 నాటికి 140 MTPA సామర్థ్యాన్ని సాధించాలన్న అంబుజా సిమెంట్స్‌ లక్ష్యంలో ఇప్పుడు మరో ముందడుగు పడింది. 

సంఘి ఇండస్ట్రీస్‌ను దేశంలోనే అతి తక్కువ ధర కలిగిన క్లింకర్ కంపెనీగా మార్చాలని అంబుజా లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ యూనిట్‌ సామర్థ్యాన్ని 15 MTPAకి పెంచాలని చూస్తోంది. 

అంబుజా సిమెంట్స్‌ Q1 రిజల్ట్స్‌
జూన్‌ క్వార్టర్‌లో, అంబుజా సిమెంట్స్‌ రూ. 1135.46 కోట్ల ఏకీకృత నికర లాభం ఆర్జించింది. గత ఏడాది కాలంలోని లాభం రూ. 865.44 కోట్లతో పోలిస్తే ఈసారి 31.2% అధికంగా మిగుల్చుకుంది. కంపెనీ ఆదాయం కూడా రూ. 8032.88 కోట్ల నుంచి 8.46% వృద్ధితో రూ. 8712.90 కోట్లకు పెరిగింది. అదే సమయంలో అంబుజా సిమెంట్స్‌ ఖర్చులు కూడా పెరిగాయి, రూ. 7280.45 కోట్ల నుంచి 2.6% పెరిగి రూ.7469.74 కోట్లకు చేరాయి. ఏసీసీ Q1 లెక్కలు కూడా ఇందులో కలిసే ఉన్నాయి.

ఇవాళ (03 ఆగస్టు 2023) మధ్యాహ్నం 12 గంటల సమయానికి అంబుజా సిమెంట్‌ షేర్‌ ధర 3.14% పెరిగి రూ.475.35 వద్ద ఉంది. ACC షేర్‌ ప్రైస్‌ కూడా 3.13% జంప్‌ చేసి రూ.2,033 వద్ద ఉంది.

మరో ఆసక్తికర కథనం: వెండి రేటు భారీగా పతనం – ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *