[ad_1]
నేటి విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలు పూర్తయ్యాయి. జాబిల్లి చుట్టూ తిరుగుతున్న వ్యోమనౌకకు ఇదే చివరి కక్ష్య. తాజా విన్యాసంతో 153 km x 163 km కక్ష్యలోకి చంద్రయాన్-3 చేరినట్టు ఇస్రో వెల్లడించింది. దీంతో ఈ అంతరిక్ష నౌక.. ఇప్పుడు చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 17న స్పేస్ క్రాఫ్ట్‌లోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను చేపడతారు. అది సజావుగా జరిగితే ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయి జాబిల్లి ఉపరితలానికి 30 కిలోమీటర్ల దూరానికి చేరుతుంది.
ఇక, అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ల్యాండింగ్ ప్రక్రియ జరిగే సమయంలో విక్రమ్ ల్యాండర్ వేగం సెకెనుకు 1.6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రక్రియ అత్యంత కీలకమని, చంద్రయాన్-2 ఈ సమయంలోనే విఫలమైందని ఇస్రో ఛైర్మన్ అన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. అయితే, చంద్రయాన్-2 అనుభవాలను ఈ ప్రయోగానికి చాలా ఉపయోగపడ్డాయని, ఫెయిల్యూర్ మోడల్‌లో చంద్రయాన్-3ను రూపొందించామని ఇస్రో పేర్కొంది.
ఇప్పటి వరకూ ఎవరూ దిగని చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతాన్ని ల్యాండింగ్ కోసం ఇస్రో ఎంపిక చేసింది. అయితే, ఇదే సమయంలో ఆగస్టు 11న రష్యా ప్రయోగించిన లునా-25 కూడా దక్షిణ ధ్రువంపైనే దిగనుంది. ఇది కేవలం ఐదు రోజుల్లో జాబిల్లి చెంతకు చేరుకోగా.. ఆగస్టు 21న ఉపరితలంపై ల్యాండింగ్ కానుంది. ఇది జరిగిన రెండు రోజుల్లోనే భారత్ కూడా తన వ్యోమ నౌకను దింపనుంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరగాలని యావత్తు భారతావని కోరుకుంటోంది. ఇప్పటి వరకూ అమెరికా, చైనా, రష్యాలు మాత్రమే సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాయి. చంద్రయాన్-3తో భారత్ కూడా ఆ దేశాల సరసన చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో చంద్రయాన్-2తో సాధ్యమవుతుందని భావించినా.. చివరి మెట్టుపై ఆ ప్రయోగం విఫలమైంది.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply