మస్క్‌ మామ నం.1 – డబ్బులు పోగొట్టుకున్న అదానీ

[ad_1]

World’s Richest: ప్రపంచ కుబేరులంతా అంతులేని సంపద పోగేసుకుంటున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్‌ ఇండెక్స్‌ (Bloomberg Billionaires Index) డేటా ప్రకారం, ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో, ప్రపంచంలోని 500 మంది అత్యంత ధనవంతులు కలిసి కొత్తగా 852 బిలియన్‌ డాలర్లు సంపాదించారు. సగటును ఒక్కో రిచ్‌ పర్సన్‌ రోజుకు 14 మిలియన్‌ డాలర్లు ఆర్జించాడు. 

టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్‌ మస్క్‌‍, డాలర్ల పరంగా నంబర్‌ 1 ప్లేస్‌లో ఉన్నారు. ప్రపంచంలో రిచెస్ట్‌ అయిన మస్క్, జూన్ 30 నాటికి తన నెట్‌వర్త్‌కు (Elon Musk net worth) 96.6 బిలియన్‌ డాలర్లు యాడ్‌ చేశారు. మస్క్‌ మామతో ఫైట్‌కు సిద్ధమవుతున్న మెటా CEO మార్క్‌ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) 58.9 బిలియన్‌ డాలర్లు ఆర్జించారు.

డబ్బులు పోగొట్టుకున్న అదానీ
ఓవైపు కుబేరులంతా కూడబెడుతుంటే, అదానీ గ్రూప్‌ ఓనర్‌ మాత్రం డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ ఆరు నెలల కాలంలో, గౌతమ్ అదానీ నికర విలువ ‍‌(Gautam Adani net worth) 60.2 బిలియన్‌ డాలర్లు తగ్గింది. షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కొట్టిన దెబ్బకు, ఈ ఏడాది జనవరి 27న, అదానీ ఒక్క రోజులోనే 20.8 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. ఇదొక రికార్డ్‌. గతంలో ఏ బిలియనీర్‌ కూడా ఒక్క రోజులో ఇంత నష్టపోలేదు. వరల్డ్‌ రిచ్‌ పర్సన్స్‌ లిస్ట్‌లో అదానీది 21వ నంబర్‌.

హిండెన్‌బర్గ్ మరో బిలియనీర్‌ ఆస్తిని కూడా హారతి కర్పూరం చేసింది. ఆ బాధితుడి పేరు కార్ల్ ఇకాన్ (Carl Icahn). ఆయన కంపెనీ పేరు ఇకాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌పీ (Icahn Enterprises LP). ఇకాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లను షార్ట్‌ చేశామంటూ హిండెన్‌బర్గ్ బాంబ్‌ పేల్చడంతో, కంపెనీ షేర్‌ ప్రైస్‌ ఒక్క రోజులో పాతాళానికి పడిపోయింది. దీంతో, కార్ల్ ఇకాన్‌ సంపద 13.4 బిలియన్‌ డాలర్లు ‍(57%) ఆవిరైంది. ఈ ఆరు నెలల కాలంలో మరే బిలియనీర్‌ ఇంత సొమ్ము పోగొట్టుకోలేదు. 

భారత్‌తో పాటు ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేష్‌ అంబానీ (Mukesh Ambani net worth), ప్రపంచ ధనికుల్లో 13వ ర్యాంక్‌లో ఉన్నారు. 

2023 జులై 2వ తేదీ నాటికి ప్రపంచ కుబేరుల ర్యాంక్‌, సంపద:

   పేరు                                        సంపద విలువ 

I. ఎలాన్ మస్క్—————– 23,400 కోట్ల డాలర్లు

2. బెర్నార్డ్ అర్నాల్డ్ ————20,000 కోట్ల డాలర్లు

3. జెఫ్ బెజోస్—————— 15,400 కోట్ల డాలర్లు

4. బిల్ గేట్స్ ——————-13,400 కోట్ల డాలర్లు

5. ల్యారీ ఎల్లిసన్————– 13,300 కోట్ల డాలర్లు

6. స్టీవ్ బాల్మర్—————- 11.800 కోట్ల డాలర్లు

7. వారెన్ బఫెట్————— 11,500 కోట్ల డాలర్లు

8. ల్యారీ పేజ్—————– 11,000 కోట్ల డాలర్లు

9. సెర్గెయ్ బ్రిన్————— 10,400 కోట్ల డాలర్లు

10. మార్క్ జుకర్‌బెర్గ్———- 10,400 కోట్ల డాలర్లు

13. ముకేశ్ అంబానీ———– 8,820 కోట్ల డాలర్లు

21. గౌతమ్ అదానీ————- 6,030 కోట్ల డాలర్లు

మరో ఆసక్తికర కథనం: సహనం ఉంటే స్టాక్‌ మార్కెట్‌లో లాభాలే లాభాలు, ఇదిగో ప్రూఫ్‌

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *