మార్కెట్లను దెబ్బకొట్టిన స్మాల్‌, మిడ్‌ క్యాప్స్‌ – 8 శాతం పతనంలో పేటీఎం

[ad_1]

Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌ ఈ రోజు (మంగళవారం, 13 ఫిబ్రవరి 2024) యాక్టివ్‌గా ప్రారంభమైంది. మిడ్‌ క్యాప్ షేర్లు ర్యాలీ నుంచి మార్కెట్‌కు మద్దతు లభించింది. అయితే.. ఐటీ, మెటల్ స్టాక్స్‌లో బలహీనత కారణంగా కుదుపులకు గురయ్యాయి.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…

గత సెషన్‌లో (సోమవారం) 71,072 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 219.59 పాయింట్లు లేదా 0.31 శాతం పెరిగి 71,292.08 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. సోమవారం 21,616 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 48.25 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 21,664.30 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

ట్రేడ్‌ ప్రారంభ సమయంలో, బ్యాంక్ నిఫ్టీలో మంచి మొమెంటం కనిపించింది. బ్యాంక్‌ షేర్లలో.. ఓపెనింగ్‌ టైమ్‌లో ఎస్‌బీఐ షేర్లు అగ్రస్థానంలో ఉంటే, 15 నిమిషాల తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ టాప్‌ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయానికి, బ్యాంక్ నిఫ్టీలోని 12 షేర్లలో 4 మాత్రమే లాభాల్లో ఉన్నాయి.

విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.38 శాతం, స్మాల్‌ క్యాప్ సూచీ కూడా 1.2 శాతం వరకు క్షీణించాయి.

మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో… హిందాల్కో 10 శాతం పడిపోయింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2 శాతం తగ్గింది. పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, విప్రో, భారతి ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్ 1-2 శాతం మధ్య క్షీణించాయి. 
నిఫ్టీలో.. హీరో మోటోకార్ప్‌, కోల్‌ ఇండియా, దివీస్‌ ల్యాబ్‌ గ్రీన్‌ కలర్‌ పులుముకున్నాయి.

ఆంక్షలను సమీక్షించే అవకాశమే లేదని ఆర్‌బీఐ తేల్చి చెప్పడంతో పేటీఎం షేర్లు 8% పడిపోయాయి. 

Q3 లాభంలో 64% YoY పతనాన్ని మూటగట్టుకున్న HEG 6% జారిపోయింది.

సెక్టార్లలో.. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3 శాతం, నిఫ్టీ మీడియా 1.2 శాతం, నిఫ్టీ ఐటీ 0.6 శాతం క్రాష్‌ అయ్యాయి.

ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 273.29 పాయింట్లు లేదా 0.38% పెరిగి 71,345.78 దగ్గర; NSE నిఫ్టీ 62.90 పాయింట్లు లేదా 0.29% పెరిగి 21,678.95 వద్ద ట్రేడవుతున్నాయి. 

ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: భెల్‌, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్, గుజరాత్ గ్యాస్, హిందాల్కో, హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్, ఇండియాబుల్స్ రియల్‌స్టేట్, IRCTC, KIOCL, MTNL, నేషనల్ అల్యూమినియం, NBCC, ఆయిల్ ఇండియా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, RCF, సీమెన్స్, సూలా వైన్‌యార్డ్స్, టేక్ సోల్యూషన్స్, టైడ్ వాటర్, జీ ఎంటర్‌టైన్‌మెంట్.

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో… సుదీర్ఘ వారాంతం తర్వాత తిరిగి ట్రేడ్‌ ప్రారంభించిన జపాన్‌ నికాయ్‌ 2 శాతం పెరిగింది, 37,000 మార్కును అధిగమించింది. దక్షిణ కొరియా కోస్పి కూడా 1.2 శాతం ర్యాలీతో కొత్త వారాన్ని ఘనంగా ప్రారంభించింది. ఆస్ట్రేలియా ASX 200 0.11 శాతం తగ్గింది. లూనార్ న్యూ ఇయర్ సెలవుల కారణంగా చైనా మార్కెట్లు ఈ వారంలో పని చేయవు.
 
పెట్టుబడిదార్లు అమెరికన్‌ తాజా ద్రవ్యోల్బణం & ఆదాయాల డేటా కోసం ఎదురుచూస్తుండడంతో.. సోమవారం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. 0.33 శాతం పెరిగి 38,797.38 వద్ద స్థిరపడింది. దీనికి విరుద్ధంగా, S&P 500 0.09 శాతం తగ్గింది, నాస్‌డాక్ కాంపోజిట్ 0.3 శాతం పడిపోయింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఐటీఆర్‌ ఫైలింగ్‌కు ముందు కచ్చితంగా క్రాస్‌ చెక్‌ చేయాల్సిన విషయాలివి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *