[ad_1]
Stock Market News Today in Telugu: రెండు గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్‌ల నిర్ణయాలు వెలువడుతుండడం, అంతకంటే ముఖ్యంగా యూఎస్ ఫెడ్ సమావేశం ప్రారంభం కానుండడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) అప్రమత్తంగా బిజినెస్ ప్రారంభించాయి. సెన్సెక్స్ కీలకమైన 72,500 స్థాయి దిగువకు, నిఫ్టీ 22,000 కిందకు పడిపోయాయి. మెటల్ షేర్లు, పీఎస్‌యూ బ్యాంకులు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు రెడ్ జోన్‌లో ట్రేడవుతున్నాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
గత సెషన్‌లో (సోమవారం) 72,748 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 285.48 పాయింట్లు లేదా 0.39 శాతం పతనంతో 72,462 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. సోమవారం 22,056 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 109.25 పాయింట్లు లేదా 0.50 శాతం పతనంతో 21,946 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం పడిపోతే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అదే స్థాయిలో పైకి చేరింది.
ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో కేవలం 5 స్టాక్స్ మాత్రమే లాభపడగా, మిగిలిన 25 స్టాక్స్ క్షీణతలో ఉన్నాయి. లాభాల్లో ఉన్న వాటిలో.. టాటా స్టీల్ 1.54 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.37 శాతం, JSW స్టీల్ 0.29 శాతం, భారతి ఎయిర్‌టెల్ 0.19 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.08 శాతం వృద్ధితో ట్రేడవుతున్నాయి. నెస్లే ఇండియా, NTPC, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ & టూబ్రో నష్టపోయాయి.
నిఫ్టీ 50 ప్యాక్‌లో 11 షేర్లు లాభపడగా, 39 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.28 శాతం, యూపీఎల్ 0.68 శాతం, బజాజ్ ఆటో 0.54 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.42 శాతం, హిందాల్కో 0.32 శాతం చొప్పున లాభాల్లో ట్రేడవుతున్నాయి.
బ్యాంక్ నిఫ్టీ కూడా ఎరుపు రంగులో కనిపించింది. మార్కెట్ ప్రారంభంలో, ఈ ఇండెక్స్ 52.40 పాయింట్లు జారి 46,523 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీలోని మొత్తం 12 షేర్లలో 7 షేర్లు పైకి, 5 షేర్లు కిందకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.
టాటా సన్స్ ఈ రోజు TCSలో 0.65 శాతం వాటా లేదా 23.4 మిలియన్ షేర్లు విక్రయిస్తుండడంతో టీసీఎస్ షేర్లు 3% జారిపోయాయి.
ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 337.09 పాయింట్లు లేదా 0.46% తగ్గి 72,411.33 దగ్గర; NSE నిఫ్టీ 114.30 పాయింట్లు లేదా 0.52% తగ్గి 21,941.40 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
జపాన్ సెంట్రల్ బ్యాంక్, 17 సంవత్సరాల తర్వాత ప్రతికూల వడ్డీ రేటు విధానాన్ని ముగిస్తుందన్న అంచనాల నడుమ ఇప్పుడు అందరి దృష్టి బ్యాంక్ ఆఫ్ జపాన్‌పైనే ఉంది. ఈ ఉదయం నికాయ్ 0.7 శాతం పడిపోయింది. హాంగ్ సెంగ్, కోస్పి కూడా 1 శాతం పైగా తగ్గాయి. నిన్న, యూఎస్ మార్కెట్లు మాత్రం లాభాల్లో క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ 0.2 శాతం, S&P 500 0.63 శాతం పెరిగాయి. నాస్‌డాక్ 0.8 శాతం ఎగబాకింది.
US ఫెడ్ మీటింగ్‌కు ముందు, అమెరికాలో బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ దాదాపు 4.33 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు దాదాపు $87కు చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి
[ad_2]
Source link
Leave a Reply