మార్కెట్‌లో ప్రారంభ లాభాలు మాయం – కీలక రెసిస్టెన్స్‌ దగ్గర ప్రధాన సూచీలు

[ad_1]

Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం కనిపించిన బుల్లిష్‌ ట్రెండ్‌ ఈ రోజు (గురువారం, 15 ఫిబ్రవరి 2024) కూడా కనిపించింది, మార్కెట్లు స్మూత్‌గా స్టార్ట్‌ అయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూలత ఇండియన్‌ మార్కెట్లకు కలిసి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ, ఆటో షేర్ల పెరిగి ప్రధాన సూచీలను ఎగదోశాయి. బ్యాంక్ స్టాక్స్ మంచి మొమెంటంతో స్టార్ట్‌ అయ్యాయి. అయితే, మార్కెట్ ప్రారంభమైన అరగంట తర్వాత ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. తొలుత దన్నుగా నిలబడ్డ బ్యాంక్ స్టాక్స్, ఆ తర్వాత లాభాలు కోల్పోయి మార్కెట్లను వెనక్కు లాగాయి.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…

గత సెషన్‌లో (బుధవారం) 71,823 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 238.64 పాయింట్లు లేదా 0.33 శాతం పెరుగుదలతో 72,061.47 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. బుధవారం 21,840 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 66.50 పాయింట్లు లేదా 0.30 శాతం పెరుగుదలతో 21,906.55 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ దాదాపు 1% వరకు జంప్‌ చేశాయి.

మార్కెట్ ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత, ఉదయం 9.35 గంటలకు, నిఫ్టీ50 ప్యాక్‌లోని 30 స్టాక్స్‌ లాభపడగా, 20 స్టాక్స్‌ క్షీణించాయి. సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 15 స్టాక్స్‌ గెయిన్స్‌తో, 15 స్టాక్స్‌ లాసెస్‌తో ట్రేడ్‌ అయ్యాయి. 

సెన్సెక్స్‌లో, ఈ రోజు M&M టాప్ గెయినర్‌గా ఉంది, దాదాపు 4 శాతం లాభపడింది. ఎన్‌టీపీసీ 1.51 శాతం, టాటా స్టీల్ 1.13 శాతం, విప్రో 1.01 శాతం పెరిగాయి.

ఓపెనింగ్‌ టైమ్‌లో.. బీఎస్‌ఈలో మొత్తం 3,074 షేర్లు ట్రేడ్ అవుతుండగా, వీటిలో 2221 షేర్లు ముందంజలో ఉన్నాయి, 774 షేర్లు వెనకడుగు వేశాయి. 74 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఆ సమయానికి 165 షేర్లలో అప్పర్ సర్క్యూట్‌లో, 88 షేర్లలో లోయర్ సర్క్యూట్‌లో లాక్‌ అయ్యాయి

నిఫ్టీలో బ్యాంక్ షేర్లు ఆధిపత్యం చెలాయించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా అత్యధికంగా 2.33 శాతం లాభపడింది. పీఎన్‌బీ 1.10 శాతం, ఎస్‌బీఐ 0.75 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.29 శాతం, ఫెడరల్ బ్యాంక్ 0.23 శాతం పెరిగాయి.

ఈ రోజు ఉదయం 10.20 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 83.33 పాయింట్లు లేదా 0.12% పెరిగి 71,906.16 దగ్గర; NSE నిఫ్టీ 30.15 పాయింట్లు లేదా 0.14% పెరిగి 21,870.20 వద్ద ట్రేడవుతున్నాయి. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం తైవాన్ 3 శాతానికి పైగా, జపాన్ నికాయ్‌ 0.7 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.3 శాతం పెరిగాయి. కోస్పి 0.05 శాతం, హాంగ్‌ సెంగ్‌ 0.65 శాతం తగ్గాయి. కార్పొరేట్‌ ఆదాయాల్లో ఆశ్చర్యకరమైన నంబర్ల కారణంగా, నిన్న, అమెరికన్‌ బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.4 శాతం, S&P 500 1 శాతం, నాస్‌డాక్ 1.3 శాతం పెరిగాయి.

US 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ మంగళవారం నాటి 4.267 శాతం నుంచి బుధవారానికి 4.235 శాతానికి చేరింది, అతి కొద్దిగా తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $81 వద్ద కొనసాగుతోంది.

ఈ మధ్యకాలంలో కాయిన్‌బేస్, మారథాన్ డిజిటల్, రియోట్ బిట్‌కాయిన్ వంటి క్రిప్టో స్టాక్స్‌ విపరీతంగా పెరగడంతో, మార్కెట్‌ విలువ 2021 నవంబర్ తర్వాత మొదటిసారిగా 1 ట్రిలియన్ డాలర్లు దాటింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *