[ad_1]
Elon Musk Salary Package: ప్రపంచలో అత్యంత సంపన్నుడు, టెస్లా CEO ఎలాన్ మస్క్ మాడు బొప్పికట్టేలా కోర్టు మొట్టికాయలు వేసింది. తన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Tesla) నుంచి తీసుకుంటున్న లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీపై ఆశ్చర్యం & అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, కంపెనీ నుంచి అంత డబ్బు తీసుకునే అర్హత మస్క్ మామకు లేదు.
2018 సంవత్సరం కోసం, టెస్లా డైరెక్టర్ల బోర్డు ఎలాన్ మస్క్ కొత్త వేతన ప్యాకేజీని (Elon Musk salary package) ఆమోదించింది. ఆ ప్యాకేజీ ప్రకారం, 2018లో, అన్ని రకాల బెనిఫిట్స్ కలిపి 55 బిలియన్ డాలర్ల వార్షిక వేతనాన్ని మస్క్ మామ తీసుకున్నారు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే ఇది రూ. 4.5 లక్షల కోట్లకు పైమాటే. ఇంత పెద్ద ప్యాకేజీ ప్రపంచంలో మరే వ్యక్తికి లేదు. కార్పొరేట్ చరిత్రలో ఇదే రికార్డ్ రెమ్యునరేషన్. ప్రపంచ బిలియనీర్లలో కొందరి మొత్తం ఆస్తిపాస్తుల విలువ కూడా మస్క్ మామ ఏడాది సంపాదన కంటే తక్కువే.
డెలావేర్ కోర్టులో విచారణ
2028లో ఎలాన్ మస్క్ ఇచ్చిన ప్యాకేజీపై డెలావేర్ కోర్టులో (Delaware Court) పిటిషన్ దాఖలైంది. టెస్లా వాటాదార్లలో ఒక వ్యక్తి, మస్క్ వేతన ప్యాకేజీపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మస్క్ ప్యాకేజీని న్యాయబద్ధంగా నిర్ణయించలేదని, అందులో కంపెనీ డైరెక్టర్ల ఆశ్రిత పక్షపాతం దాగుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌కు వ్యతిరేకంగా కంపెనీ డైరెక్టర్లు కూడా గట్టిగానే వాదనలు వినిపించారు. ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త అని, అతని సమయాన్ని కంపెనీ కోసం కేటాయించేలా చూసేందుకే అంత పెద్ద ప్యాకేజీ ఇచ్చామని డైరెక్టర్ల తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఎలాన్ మస్క్‌కు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. కోర్టు అభిప్రాయం ప్రకారం, మస్క్ మామ వేతన ప్యాకేజీ ఒక లోపాల పుట్ట. ప్యాకేజీని నిర్ణయించే డైరెక్టర్లు మస్క్‌కు సన్నిహితులు. కాబట్టి, ప్యాకేజీ మొత్తాన్ని అతను ప్రభావితం చేశాడని కోర్ట్ అభిప్రాయపడింది. వేతన ప్యాకేజీ నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకుని, భారీ ప్యాకేజీకి బోర్డు ద్వారా ఆమోదముద్ర వేయించుకున్నారని వ్యాఖ్యానించింది. ఇది మస్క్‌కు వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది తప్ప, కంపెనీకి ప్రయోజనం కలిగించదని స్పష్టం చేసింది. పైగా, వేతన ప్యాకేజీ గురించి వాటాదార్ల ఆమోదం తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది. వేతనాన్ని వదులుకోవాలని మస్క్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
కోర్టు నిర్ణయంపై మస్క్ స్పందన
కోర్టు ఉత్తర్వు తర్వాత, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో మస్క్ స్పందించారు. “డెలావేర్ రాష్ట్రంలో మీ కంపెనీని ఏర్పాటు చేయొద్దు. మీ వాటాదార్లు కంపెనీ వ్యవహారాలను నిర్ణయించాలనుకుంటే, నెవాడా లేదా టెక్సాస్‌లో కంపెనీని ఏర్పాటు చేయాలని నేను సిఫార్సు చేస్తున్నా” అని ట్వీట్ చేశారు.
ఎలాన్ మస్క్ సంపద విలువ
ఎలాన్ మస్క్, ప్రపంచ సంపన్నుల జాబితాలో నంబర్ 1 పొజిషన్‌లో కొనసాగుతున్నారు. అతని సంపదలో ఎక్కువ వాటా టెస్లా నుంచే ఉంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం, మస్క్ నికర విలువ $210 బిలియన్లను దాటింది.
మరో ఆసక్తికర కథనం: బడ్జెట్ నుంచి జనం ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తోందీ వీటినే!
మరిన్ని చూడండి
[ad_2]
Source link
Leave a Reply