[ad_1]
Mutual Funds Nomination: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లుకు 2023 మార్చి 31 తేదీ చాలా కీలకమైనది. ఈ గడువుకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, మీ అకౌంట్‌లో ఇంకా నామినేషన్ పని పూర్తి చేయకపోతే, ఈ రోజే ఆ పని పూర్తి చేయండి. ఇందుకు గడవు మార్చి 31వ తేదీ. ఈ లోగా పని పూర్తి కాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI), ఈ విషయంపై పెట్టుబడిదార్లకు ఇప్పటికే చాలాసార్లు సూచనలు జారీ చేసింది. అన్ని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలను (AMCలు) కూడా అలెర్ట్ చేసింది. మార్చి 31 లోపు తమ పెట్టుబడిదార్లందరితో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయించే బాధ్యత AMCలదేనని నిర్దేశించింది. ఈ నోటిఫికేషన్‌ను మార్కెట్ రెగ్యులేటర్ జూన్ 2022లోనే జారీ చేసింది.
నామినేషన్ పూర్తి చేయని పక్షంలో నష్టం తప్పదు
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదార్లంతా 2023 మార్చి 31 లోగా తమ అకౌంట్లలో నామినే పేరును యాడ్ చేయకపోతే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో స్తంభించిపోతుందని (mutual fund investor’s portfolio freezes) తన నోటిఫికేషన్‌లో సెబీ తెలిపింది. ఇదే జరిగితే మీ ఖాతా నుంచి మీరు ఏ విధమైన లావాదేవీలు చేయలేరు, కోరికోరి నష్టాలు తలకెత్తుకోవాల్సి వస్తుంది. నామినేషన్ వివరాలను సమర్పించిన తర్వాత మాత్రమే మళ్లీ ఆ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఈ తలనొప్పంతా ఎందుకనుకుంటే, గడువు లోపు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం చాలా ముఖ్యం.
మ్యూచువల్ ఫండ్స్‌లో నామినేషన్ ఎందుకు తప్పనిసరి?
వాస్తవానికి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల మంచి కోసమే సెబీ ఈ రూల్ తీసుకొచ్చింది. ఏ వ్యక్తి అయినా తన కుటుంబం కోసమే పెట్టుబడులు పెడతాడు. ఒకవేళ, మ్యూచువల్ ఫండ్ పథకం మెచ్యూరిటీకి ముందే దురదృష్టవశాత్తు ఆ పెట్టుబడిదారు మరణిస్తే, నామినేషన్ లేని పక్షంలో అతని డబ్బును కుటుంబ సభ్యులకు బదిలీ చేయడం కష్టం అవుతుంది. అదే, నామినేషన్ ప్రక్రియ పూర్తయి ఉంటే, ఎలాంటి సమస్య ఉండదు, పెట్టుబడిదారు కుటుంబానికి ఆర్థిక రక్షణ లభిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, పెట్టుబడిదార్ల ప్రయోజనం కోసం మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో నామినేషన్‌ను SEBI తప్పనిసరి చేసింది.
ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు
మ్యూచువల్ ఫండ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం… మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదార్లు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ నామినేషన్ పనిని పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నామినీ పేరును మీ ఖాతాకు జత చేయడానికి, మీరు మీ మ్యూచువల్ ఫండ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అకౌంట్‌లో లాగిన్ అయిన తర్వాత, అకౌంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో నామినీ డిటెయిల్స్ ఆప్షన్‌ను ఎంచుకుని, మిగిలిన పనిని పూర్తి చేయవచ్చు. లేదా, అధికారిక హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి సాయం తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఈ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం కూడా హెల్ప్‌లైన్ నంబర్ నుంచి సాయం కోరవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా నామినేషన్ పనిని పూర్తి చేయడానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పడుతుంది.
[ad_2]
Source link
Leave a Reply