PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

రామ్‌ చరణ్‌ కుమార్తెకు ముకేష్‌ అంబానీ బంగారు ఊయలను గిఫ్ట్‌గా ఇచ్చారా?

[ad_1]

Mukesh Ambani – Golden Cradle: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ ‍‌(Mukesh Ambani), సినీ యాక్టర్‌ రామ్ చరణ్ కుమార్తె కోసం బంగారు ఊయలను (golden cradle) బహుమతిగా ఇచ్చారన్న వార్తలు సోషల్‌ మీడియాను ఊపేస్తున్నాయి. 

రామ్‌ చరణ్, ఉపాసన (Ram Charan – Upasana) తొలి సంతానంగా, జూన్‌ 20న ఆడశిశువు జన్మించింది. శుక్రవారం (30 జూన్‌ 2023), హైదరాబాద్‌లోని ఉపాసన తల్లిదండ్రుల ఇంట్లో ఊయల వేడుక/బారసాల నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం, వస్త్రంతో చేసిన ఊయలలో ఆ బిడ్డను మొదట పడుకోబెట్టారు. ఉపాసన తల్లిదండ్రుల ఇంటి పెరటిలోని మామిడి చెట్టు కింద ఈ వేడుక జరిగినట్లు ఫొటోలను బట్టి అర్ధం అవుతోంది. రామ్‌ చరణ్‌ – ఉపాసన, రామ్‌ చరణ్‌ తల్లింద్రుడులు చిరంజీవి – సురేఖ, ఉపాసన తల్లిదండ్రులు అనిల్‌ – శోభన ఆ ఊయల వద్ద ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

రామ్‌ చరణ్ కుమార్తె పేరు క్లీంకార 
రామ్‌ చరణ్, ఉపాసన దంపతులు కుమార్తెకు క్లీంకార కొణిదెల (KlinKaara Konidela) అని పేరు పెట్టారు. లలిత సహస్రనామాల నుంచి ఈ పేరు తీసుకున్నారు. ఆధ్యాత్మికతు మేల్కొలుపుతుందని, శుద్ధమైన శక్తిని, పరివర్తనను పేరు సూచిస్తుంది. మా చిన్న యువరాణి ఈ సద్గుణాలన్నింటినీ అలవరుచుకుని పెరుగుతుందని నమ్ముతున్నాం అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. 

రామ్ చరణ్, ఉపాసనకు 2012లో వివాహం జరిగింది. పదేళ్ల తర్వాత సంతానం కలగడంతో కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. 

ముకేష్‌ అంబానీ బంగారు ఊయలను గిఫ్ట్‌గా ఇచ్చారా?
బిలియనీర్ ముఖేష్ అంబానీ, రామ్‌ చరణ్‌ కుమార్తెకు బంగారు ఊయలను బహుమతిగా ఇచ్చారని, దాని విలువ కోటి రూపాయల వరకు ఉంటుందన్న ఒక సమాచారం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

చరణ్‌-ఉపాసన దంపతుల పాప కోసం ముకేశ్‌ అంబానీ బంగారు ఊయలను కానుకగా పంపించారని, క్లీంకారకు ఆ ఊయలలోనే బారసాల వేడుక నిర్వహిస్తారన్న ప్రచారం గురువారం నుంచి జోరుగా సాగింది. ఆ వార్తలపై రామ్‌ చరణ్‌ బృందం  స్పందించింది. ముకేశ్‌ అంబానీ తమ పాప కోసం బంగారు ఊయల పంపారన్న ప్రచారం అవాస్తవమని ప్రకటన చేశారు, రెండు రోజులుగా ఈ విషయాన్ని ట్రెండ్‌ చేస్తున్న వాళ్ల గాలి తీసేశారు. 

ప్రజ్వల ఫౌండేషన్‌ (Prajwal Foundation‌) రూపొందించిన చెక్క ఊయలను బారసాల వేడుకలో ఉపయోగిస్తారని కూడా ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. డెలివెరీకి ముందు, ప్రజ్వల ఫౌండేషన్ తయారు చేసిన ఊయల పక్కన తాను దిగిన ఫోటోను ఉపాసన ఇటీవల ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘ప్రజ్వల ఫౌండేషన్‌ నుంచి ఇలాంటి గిఫ్ట్‌ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. చేతితో తయారు చేసిన ఈ ఉయ్యాలకు ప్రాముఖ్యత ఉంది. బలం, ఆశ, పరివర్తన, ఆత్మగౌరవాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఈ విలువలు కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నా’’ అని అప్పట్లో ఆమె పోస్ట్‌ పెట్టారు.

అయితే, శుక్రవారం జరిగిన బారసాల వేడుకలో చెక్క ఊయల ఫొటోలు కనిపించలేదు. దీంతో, బారసాలలో చెక్క ఊయలను ఉపయోగించారో, లేదో స్పష్టత లేదు. 

మరో ఆసక్తికర కథనం: ట్రెండింగ్‌లో ఉమెన్‌ స్కీమ్‌, 3 నెలల్లో 10 లక్షల కొత్త అకౌంట్స్‌

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *