[ad_1]
Honda SP 125 Sports Edition Launched: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda) భారతదేశంలో ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ను ప్రారంభించింది, దీని ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీలో రూ. 90,567గా ఉంది. ఈ మోటార్‌సైకిల్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌లలో పరిమిత సమయం వరకు కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన బుకింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇది షార్ప్, స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ 123.94 సీసీ సింగిల్ సిలిండర్ బీఎస్ 6, ఓబీడీ2 కంప్లైంట్ PGM-FI ఇంజన్‌తో వస్తుంది. ఈ బైక్ టీవీఎస్ రైడర్ 125, బజాజ్ పల్సర్ 125లతో పోటీ పడనుంది.
డిజైన్ ఇలా?
బైక్ స్పోర్టీ లుక్ బోల్డ్ ట్యాంక్ డిజైన్, మాట్ మఫ్లర్ కవర్, అధునాతన గ్రాఫిక్స్ దీనికి పెద్ద ప్లస్ పాయింట్లు. ఇవి బాడీ ప్యానెల్స్, అల్లాయ్ వీల్స్‌పై తాజా వైబ్రెంట్ స్ట్రిప్స్‌తో అద్భుతంగా కనిపిస్తాయి. ఇది డీసెంట్ బ్లూ మెటాలిక్, హెవీ గ్రే మెటాలిక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. స్పోర్ట్స్ ఎడిషన్ మోడల్‌లో స్పష్టమైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. ఈ కన్సోల్ గేర్ స్టేటస్ ఇండికేటర్‌లను, అనేక ఇతర సమాచారాన్ని కూడా డిస్‌ప్లే చేస్తుంది.
ఇంజిన్ ఎలా ఉంది?
ఈ బైక్ 123.94 సీసీ సింగిల్ సిలిండర్ బీఎస్6, ఓబీడీ2 కంప్లైంట్ PGM-FI ఇంజన్‌తో వస్తుంది. ఇది 8 కేడబ్ల్యూ పవర్‌ని, 10.9 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ఈ బైక్ కోసం ప్రత్యేక 10 సంవత్సరాల వారంటీ ప్యాకేజీని అందిస్తోంది. ఇది మూడు సంవత్సరాల ప్రామాణిక వారంటీ, ఆప్షనల్‌గా ఏడు సంవత్సరాల వారంటీని కలిగి ఉంటుంది.
హోండా ఇటీవలే కొత్త 2023 సీబీ300ఎఫ్ స్ట్రీట్ ఫైటర్ బైక్‌ను మనదేశంలో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.70 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ ధర మునుపటి మోడల్ కంటే చాలా తక్కువ కావడం విశేషం. దీని డీలక్స్ వేరియంట్ ధర రూ. 2.26 లక్షలు కాగా డీలక్స్ ప్రో వేరియంట్ ధర రూ. 2.29 లక్షలుగా నిర్ణయించారు. ఇవి రెండూ ఎక్స్ షోరూం ధరలే అన్నది గుర్తుంచుకోవాలి. కొత్త 2023 హోండా సీబీ300ఎఫ్ మూడు అద్భుతమైన రంగులలో అందుబాటులో ఉంది. స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
2023 హోండా సీబీ300ఎఫ్‌లో బీఎస్6 స్టేజ్ II 293 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 24 బీహెచ్‌పీ శక్తిని, 25.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్ కూడా ఉంది. స్లిప్, అసిస్ట్ క్లచ్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది అడిషనల్ సెక్యూరిటీ, కంట్రోల్ కోసం హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. సస్పెన్షన్ కోసం ఇందులో ఆకర్షణీయమైన గోల్డెన్ ఫినిషింగ్, 5 స్టెప్ అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్ యూనిట్‌తో కూడా యూఎస్‌డీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లను అందించారు. ఈ బైక్ రెండు చక్రాలపై డ్యూయల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఒకే డిస్క్ బ్రేక్‌ను పొందుతుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply