[ad_1]
Tesla Car Under 20 Lakh: రూ. 20 లక్షల కంటే తక్కువ ధరలో బడ్జెట్ టెస్లా కారు 2026లో భారతదేశంలో లాంచ్ కావచ్చు. అయితే రూ. 60 లక్షల ధరతో కలిగిన మోడల్ 3 త్వరలో విడుదల కావచ్చు. మీరు రూ. 20 లక్షలలోపు టెస్లా కారును కొనుగోలు చేయాలనుకుంటే మరికొన్ని సంవత్సరాలు వేచి ఉండవలసి ఉంటుంది. టెస్లా దాని సీబీయూ ఉత్పత్తుల్లో కొన్నింటిని భారతదేశంలో లాంచ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అంటే మోడల్ 3, మోడల్ వై మొదటగా రానున్నాయి. వాటి ధర రూ. 60 లక్షల వరకు ఉండవచ్చు. ఇంపోర్టెడ్ ఛార్జీలలో మినహాయింపు ఇస్తే ఈ ధర కొంచెం తక్కువగా ఉండవచ్చు.
త్వరలో విక్రయాలు ప్రారంభం
వీటిలో చవకైన మోడల్ 3 ప్రీమియం సెడాన్‌గా మార్కెట్లోకి వచ్చే విలాసవంతమైన కారు. ఇది ప్రీమియం కారు కాబట్టి దీని ధర రూ. 20 లక్షల కంటే తక్కువగా మాత్రం ఉండదు. అందువల్ల మోడల్ వై, మోడల్ 3 కార్లు… టెస్లా లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ కార్లుగా ఉంటాయని భావిస్తున్నారు. వీటి అమ్మకాలు వచ్చే ఏడాది భారతదేశంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
సరసమైన టెస్లా కారు 2026లో
భారతదేశంలో తయారు అయ్యే టెస్లా కార్లు 2026 నాటికి మార్కెట్లోకి రావచ్చు. దీని ధర దాదాపు రూ. 20 లక్షల రేంజ్‌లో ఉండవచ్చు. ఖర్చులను తగ్గించడానికి భారీ లోకలైజేషన్, పూర్తిగా ఎకో సిస్టంతో టెస్లా సిద్ధం కానుంది. అయితే దీనికి చాలా సమయం పడుతుంది. ఇది టెస్లా మోడల్ 2 కావచ్చు, ఇది తక్కువ ఎక్విప్‌మెంట్ లెవల్స్‌తో కంపెనీ లైనప్‌లో మోడల్ 3 కంటే దిగువన ఉండవచ్చు.
భారతదేశంలో టెస్లా కార్లను తయారు చేయడానికి, కనీస పెట్టుబడి రెండు బిలియన్ డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.16,500 కోట్లు) కావాలి. అయితే కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ఇప్పటికే మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, తమ కార్లను ఇక్కడ విడుదల చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈవీలకు డిమాండ్ పెంచడానికి, దిగుమతి చేసుకున్న పెట్రోల్ కార్లతో పోలిస్తే పన్నులను తగ్గించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
తద్వారా కార్ల తయారీదారులు మార్కెట్లో మరిన్ని ఈవీలను ప్రవేశపెట్టవచ్చు. ఇక్కడ తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ముందు పరీక్ష చేయించుకోవచ్చు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో టెస్లా ప్రణాళికల గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ మార్కెట్‌లలో ఒకటైన భారతదేశంలో తన మార్కెట్‌ను విస్తరించడానికి కంపెనీ చాలా ఎదురుచూస్తుంది.
మరోవైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాలో జరిగిన మోటోవర్స్ ఈవెంట్‌లో దేశీయ మార్కెట్‌లో సరికొత్త హిమాలయన్ 450/452ని లాంచ్ చేాసింది. దీని ప్రారంభ ధర రూ. 2.69 లక్షలు కాగా, దీని టాప్ మోడల్‌కు రూ. 2.84 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర అన్నది గుర్తుంచుకోవాలి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో – ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!
Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ – సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!
[ad_2]
Source link
Leave a Reply