వచ్చే నెల 1 నుంచి మారబోయే రూల్స్‌, డైరెక్ట్‌గా మీ పర్సుపైనే ప్రభావం

[ad_1]

New Rules From July 2023: జూన్ నెల ముగుస్తోంది, కొన్ని రోజుల్లో కొత్త నెల జులై ప్రారంభం అవుతుంది. నెల మారిన ప్రతిసారి మన దేశంలో కొన్ని విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఈసారి కూడా, జులై 2023 నుంచి కొన్ని కొత్త రూల్స్‌ అమల్లోకి వస్తున్నాయి. వంట గ్యాస్ రేటు (LPG Price), కమర్షియల్ గ్యాస్, సీఎన్‌జీ-పీఎన్‌జీ ధరలు సహా క్రెడిట్‌ కార్డ్‌ స్పెండింగ్స్‌, ఐటీఆర్‌ ఫైలింగ్‌ నిబంధనల్లో మార్పు రానుంది.

జులై నెలలో జరిగే ఈ మార్పులతో జనం జేబుపైనే నేరుగా ఎఫెక్ట్‌ పడుతుంది. ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకుని, పూర్తి అవగాహనతో ఉండడం మంచిది. దానివల్ల అనవసర ఖర్చు/నష్టం నుంచి తప్పించుకోవచ్చు, కొంత డబ్బు సేవ్‌ చేయవచ్చు.

LPG ధరల్లో మార్పు
LPG ధరను మన దేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (OMCలు) ప్రతి నెలా నిర్ణయిస్తాయి లేదా సవరిస్తాయి. ఈసారి కూడా, జులై 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ ధర మారే అవకాశం ఉంది. ఈ నెలలో (జూన్‌ 2023), వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19.2 కేజీల LPG సిలిండర్‌ (Commercial LPG Cylinder) ధరను OMCలు రూ. 83.50 తగ్గించాయి. అంతకుముందు, మే నెల 1వ తేదీ కూడా కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్ రేటు రూ. 172 తగ్గింది. దీంతో, ఈ రెండు నెలల్లోనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేటు 255.50 రూపాయలు తగ్గింది. అయితే, సామాన్యుడు నిత్యం ఉపయోగించే 16.2 కేజీల డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను (Domestic LPG Cylinder Price) మాత్రం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గించలేదు. చివరిసారిగా, మార్చి నెలలో ఒక్కో సిలిండర్‌కు రూ. 50 చొప్పున రేటు పెంచాయి, ఆ తర్వాత ఇక తగ్గించలేదు. ఈసారి డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

క్రెడిట్ కార్డ్ ఖర్చులపై 20% TCS
క్రెడిట్ కార్డ్‌ ద్వారా విదేశాల్లో చేసే ఖర్చులపై TCS (Tax collection at source) వర్తింపజేసే నిబంధన 1 జులై 2023 నుంచి వర్తిస్తుంది. ఈ రూల్‌ ప్రకారం, రూ. 7 లక్షల కంటే ఎక్కువ ఖర్చుపై 20% వరకు TCS వర్తిస్తుంది. అయితే, విదేశాల్లో విద్య & వైద్యం కోసం చేసే ఖర్చులపై TCS 5%గా ఉంటుంది. మీరు విదేశాల్లో ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకుంటే, ఈ ఛార్జీ ఇంకా తగ్గి 0.5 శాతంగా ఉంటుంది.

CNG & PNG రేట్లలో మార్పు
ప్రతి నెలలాగే, జులై నెలలో కూడా CNG, PNG ధరల్లో మార్పులు ఉండవచ్చు. దిల్లీ, ముంబైలలోని పెట్రోలియం కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన ఈ రేట్లను మారుస్తాయి.

ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ
ప్రతి టాక్స్‌ పేయర్‌ ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ (ITR) ఫైల్ చేయాలి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను పత్రాల దాఖలుకు చివరి తేదీ జులై నెలతో (జులై 31) ముగుస్తుంది. మీరు ఇంకా ITR ఫైల్ చేయకపోతే, జులై 31 లోపు ఫైల్ చేయండి. చివరి తేదీన వెబ్‌సైట్‌లో రద్దీ పెరిగే వరకు ఆగకుండా, వీలైనంత త్వరగా మీ ఆదాయాన్ని డిక్లేర్‌ చేయడం ఉత్తమం.

మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ BLS International, Sapphire Foods 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *