వడ్డీ రేట్ల విషయంలో ఆశ-నిరాశ, బెనిఫిట్స్‌ ఈ పథకాలకు మాత్రమే

[ad_1]

Small Savings Schemes Interest Rates: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌తో సహా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఏ మేరకు పెరుగుతాయో అన్న నిరీక్షణ శుక్రవారంతో ముగిసింది. రెండో త్రైమాసికానికి (జులై-సెప్టెంబర్‌ కాలం) కొన్ని  పథకాల వడ్డీ రేటును 0.30 శాతం మేర కేంద్ర ప్రభుత్వం పెంచింది. మరికొన్ని పథకాల్లో రేట్లను పెంచకుండా పాత రేట్లనే కొనసాగించింది. 

ఏయే పథకాలపై డిపాజిట్‌ రేట్లు పెరిగాయి?
జులై-సెప్టెంబరు త్రైమాసికానికి, 5 సంవత్సరాల కాల పరిమితి ఉండే రికరింగ్‌ డిపాజిట్ల (RD) మీద 0.3 శాతం/30 బేసిస్‌ పాయింట్ల వడ్డీని కేంద్ర ఆర్థిక శాఖ పెంచింది. దీంతో, ఐదేళ్ల మెచ్యూరిటీ వ్యవధితో ఉండే RDలపై ఇంట్రెస్ట్‌ రేట్‌ ప్రస్తుతం ఉన్న 6.2 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. 

ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కాల వ్యవధి ఉండే టర్మ్‌ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్‌ రేటు 0.1 శాతం/10 బేసిస్‌ పాయింట్లు పెరిగింది. దీంతో, ఏడాది కాల పరిమితి టర్మ్‌ డిపాజిట్‌ మీద ఇంట్రెస్ట్‌ రేట్‌ ప్రస్తుతం ఉన్న 6.8 శాతం నుంచి 6.9 శాతానికి, రెండేళ్ల కాల పరిమితి ఉన్న టర్మ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేటు ప్రస్తుతం ఉన్న 6.9 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. వివిధ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ప్రజలు ఇప్పటికే చేసిన డిపాజిట్లు, కొత్త డిపాజిట్లకు వడ్డీ రేట్ల పెంపు ప్రయోజనం లభిస్తుంది. ఇవి తప్ప మరే పథకంలోనూ వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు.

ఇతర పథకాల్లో వడ్డీ రేట్లు:

సేవింగ్స్‌ డిపాజిట్‌ వడ్డీ రేటు 4.0 శాతం
మూడు సంవత్సరాల టర్మ్‌ డిపాజిట్‌ వడ్డీ రేటు 7.0 శాతం
5 సంవత్సరాల టర్మ్‌ డిపాజిట్‌ వడ్డీ రేటు 7.5 శాతం
సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ‍‌మీద వడ్డీ రేటు 8.2 శాతం
మంత్లీ ఇన్‌కమ్‌ అకౌంట్‌ స్కీమ్‌ వడ్డీ రేటు 7.4 శాతం 
నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (NSC) స్కీమ్‌ వడ్డీ రేటు 7.7 శాతం
పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) స్కీమ్‌ వడ్డీ రేటు 7.1 శాతం 
కిసాన్‌ వికాస్‌ పత్ర (KVP – 115 నెలల్లో మెచ్యూరిటీ) వడ్డీ రేటు 7.5 శాతం
సుకన్య సమృద్ధి అకౌంట్‌ (SSA) స్కీమ్‌ వడ్డీ రేటు 8.0 శాతం

తొలి త్రైమాసికంలో ఏం జరిగింది?
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ కాలం), చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటును 10 నుంచి 70 బేసిస్ పాయింట్ల మేర కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇందులో NSC ఇంట్రెస్ట్‌ రేట్‌ (national saving certificate interest rate) 7 శాతం నుంచి 7.70 శాతానికి పెరిగింది. సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6 శాతం నుంచి 8 శాతానికి చేరింది. పెంచారు. ప్రస్తుతం, కిసాన్ వికాస్ పత్రపై (Kisan Vikas Patra interest rate) ఏటా 7.5 శాతం వడ్డీ అందుతోంది. ఈ స్కీమ్‌ మెచ్యూరిటీ వ్యవధిని 120 నెలల నుంచి 115 నెలలకు తగ్గించారు. ఇప్పుడు, ఈ స్కీమ్స్‌లో మొదటి త్రైమాసికం వడ్డీ రేట్లనే రెండో త్రైమాసికంలోనూ ప్రభుత్వం కొనసాగిస్తోంది. 

2022-23లో, దాదాపు రూ. 4.39 లక్షల కోట్ల విలువైన గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌ను (G-Sec) సెంట్రల్‌ గవర్నమెంట్‌ జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24), ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు, చిన్న పొదుపు పథకాలపై రూ. 4.71 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయాలని భావిస్తోంది.

మరో ఆసక్తికర కథనం: ట్రెండింగ్‌లో ఉమెన్‌ స్కీమ్‌, 3 నెలల్లో 10 లక్షల కొత్త అకౌంట్స్‌

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *