వెల్లుల్లితో.. కొలెస్ట్రాల్‌ ఈజీగా కరిగించేయండి..!

[ad_1]

Garlic to reduce cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ (LDL) ఎక్కువైతే.. ప్రాణాలకే ముప్పు వాటిళ్లుతుంది. చెడు కొలెస్ట్రాల్‌‌‌‌‌‌‌‌ ఎక్కువైతే.. గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి. ఎల్‌డీఎల్‌ ఎక్కువగా రక్తంలో ప్రయాణించటం వల్ల.. గుండెకు, మెదడుకు వెళ్లి ధమనులలో అవరోధం ఏర్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. బ్లడ్‌ సర్క్యులేషన్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ఎల్‌డీఎల్‌ కారణంగా.. గుండెపోటు, హైపర్‌టెన్షన్‌‌, డయాబెటిస్‌, స్టోక్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకూండా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్‌ను నివారించడానికి సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకూండా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్‌ సమస్యను దూరం చేయడానికి మన వంటగదిలో ఈజీ దొరికే.. వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ పోషకాలు ఉంటాయ్‌..

ఈ పోషకాలు ఉంటాయ్‌..
  • 100 గ్రా (3.5 oz) వెల్లుల్లలో ..
  • కార్బోహైడ్రేట్లు – 33.06 గ్రా
  • చక్కెర – 1 గ్రా
  • డైటరీ ఫైబర్ – 2.1 గ్రా
  • కొవ్వు – 0.5 గ్రా
  • ప్రోటీన్ – 6.36 గ్రా
  • విటమిన్ B1 – థయామిన్ (B1 )) – 0.2 mg
  • విటమిన్ B2 (రిబోఫ్లావిన్ (B2)) -0.11 mg
  • విటమిన్ B3 (నియాసిన్ (B3)) – 0.7 mg
  • విటమిన్ B5 (పాంతోతేనిక్ యాసిడ్ (B5)) – 0.596 mg
  • విటమిన్ B6 ( విటమిన్ B6) – 1.2350 mg
  • విటమిన్ B9 (ఫోలేట్ (B9)) – 3 mg
  • కోలిన్ (కోలిన్) – 23.2 మి.గ్రా
  • విటమిన్ సి (విటమిన్ సి) – 31.2 మి.గ్రా
  • కాల్షియం (కాల్షియం) – 181 మి.గ్రా
  • ఐరన్ – 1.7 మి.గ్రా
  • మెగ్నీషియం – 25 మి.గ్రా
  • మాంగనీస్ – 1.672 మి.గ్రా
  • భాస్వరం – 153 మి.గ్రా
  • పొటాషియం – 401 మి.గ్రా
  • సోడియం – 17 మి.గ్రా
  • జింక్ – 1.16 మి.గ్రా
  • నీరు – 59 గ్రా
  • సెలీనియం – 14.2 μg ఉంటాయి..

ఈ లాభాలు ఉంటాయి..

ఈ లాభాలు ఉంటాయి..

వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.

  • ఇమ్యూనిటీ పెరుగుతుంది.
  • హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది.
  • కొలెస్ట్రాల్‌ కరుగుతుంది
  • క్యాన్సర్‌ నుంచి రక్ష
  • బరువు తగ్గుతారు
  • అల్జీమర్స్, డిమెన్షియా ముప్పు తగ్గుతుంది
  • డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది

కొలెస్ట్రాల్‌ కరిగిస్తుంది..

కొలెస్ట్రాల్‌ కరిగిస్తుంది..

వెల్లుల్లిని మీ డైట్‌లో తరచుగా తీసుకుంటే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రచురించిన ది మెకానిజమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ గార్లిక్‌ అనే పరిశోధన ప్రకారం వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను దాదాపు 7 శాతం తగ్గిస్తుంది.
వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే పదార్ధంలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్, అవి శరీరంలో కలిగించే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యకు అధిక ఆక్సీకరణ ఒత్తిడి కూడా ప్రధాన కారణం. వెల్లుల్లిలోని యాంటీ ప్లేట్‌లెట్ లక్షణాలు రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. ఇది అద్భుతమైన బ్లడ్‌ థిన్నర్‌గా పనిచేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ ఉత్పత్తని నిరోధిస్తుంది. వెల్లుల్లిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే కొలెస్ట్రాల్‌ త్వరగా కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎంత తీసుకోవాలి..

ఎంత తీసుకోవాలి..

మీరు ఎంత వెల్లుల్లి తీసుకోవాలి అనేది.. మీ ఆహార అలవాట్లు, జీవనశైలి, శారీరక ఆరోగ్య పరిస్థితులు, కొలెస్ట్రాల్‌ స్థాయిల మీద ఆధారపడి ఉంటుంది. రోజుకు ఒక వెల్లుల్లి రెబ్బ నుంచి సగం వెల్లుల్లి పాయ తీసుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లి సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ డాక్టర్‌ సలహాతో రోజుకు 400mg తీసుకుంటే.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా ఉంటుంది.

ఎన్ని రోజుల్లో కొలెస్ట్రాల్‌ కరుగుతుంది..

ఎన్ని రోజుల్లో కొలెస్ట్రాల్‌ కరుగుతుంది..

కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి వెల్లుల్లిని ఎంతకాలం తీసుకోవాలి అనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వెల్లుల్లిని ఆరు వారాల పాటు కంటిన్యూగా తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు కరుగుతాయి. అధిక కొలెస్ట్రాల్‌ సమస్య ఎక్కువగా ఉన్నవారు.. కనీసం నాలుగు నెలల పాటు తీసుకోవాలి. అలాగే రోజూ వారీ ఆహారంలో.. వెల్లుల్లి చేర్చుకున్నా.. కొలెస్ట్రాల్‌ కంట్రోల్‌లో ఉంటుంది. దీన్ని ఔషధంగా కాకుండా.. ఆహారంగా చూడటం మంచిది.

ఎలా తీసుకోవాలి..?

ఎలా తీసుకోవాలి..?

వెల్లుల్లిని మీ వంటల్లో యాడ్‌ చేసుకోండి. సాస్‌లు, సూప్‌లలో వెల్లుల్లిని మెత్తగా తురిమి వేసుకుంటే బాగుంటుంది. మీ సలాడ్లను డ్రెస్సింగ్ చేసేటప్పుడు, 4 వెల్లుల్లి రెబ్బల తురుము, కొద్దిగా ఉప్పు, మిరియాలు, ఆలివ్ నూనె, నిమ్మరసం వేయండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *