[ad_1]
కొలెస్ట్రాల్‌ని ఎలా తగ్గించాలి..
కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగకుండా ఉండాలంలో ప్రతి ఒక్కరూ తమ డైట్లో మార్పులు చేసుకోవాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవడంతో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్ తక్కువగా ఉన్న ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఫుడ్స్‌ని తీసుకోవాలి. పోషకాహార నిపుణులు శిఖా అగర్వాల్ శర్మ కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు సాయపడే కొన్ని ఫుడ్స్ గురించి చెబుతున్నారు.
పసుపు, నల్ల మిరియాలు..
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సాయపడతాయి. నల్ల మిరియాలు కొలెస్ట్రాల్‌కి ట్రీట్మెంట్ చేసే సమ్మేళనం అయిన పైపెరిన్ కలిగి ఉంటుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి ఈ రెండింటిని కూరలు, పప్పులు, సూప్‌ల్లో వేసుకోవచ్చు.
Also Read : Artificial Sweeteners : ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్ వాడితే బరువు పెరుగుతారా..
పెరుగు, బాదం..
పెరుగు, బాదం రెండింటిలోనూ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తింటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గుతాయి. బాదంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. పెరుగులో ప్రో బయోటిక్స్ ఉంటాయి. వీటి కాంబినేషన్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
గ్రీన్ టీ..
గ్రీన్ టీ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో నిమ్మరసం కలిపితే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. నిమ్మరసంలోని ఫ్లేవనాయిడ్స్ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది.
బ్రౌన్ రైస్..
ఇండియాలో ఎక్కువగా రైస్ తింటారు. అయితే, ఈ బియ్యాన్ని హెల్దీగా తీసుకుంటే మరింత మంచిది. కొలెస్ట్రాల్‌ని కరిగించడంలో బ్రౌన్‌రైస్ హెల్ప్ చేస్తుంది. బ్రౌన్‌రైస్‌లో కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించే శక్తి ఉంది.
Also Read : Peanut Chikki : పల్లిపట్టి తింటే గుండెకి మంచిదా..
వెల్లుల్లి, ఉల్లిపాయ..
వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా వంట చేయలేం. అయితే, ఈ పదార్థాలు హై కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. కాబట్టి, వీటిని కూడా రెగ్యులర్‌గా తినడం అలవాటు చేసుకోండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Health News and Telugu News
[ad_2]
Source link
Leave a Reply