[ad_1]
తగ్గని సమస్య..
ముఖ్యంగా, షుగర్ అనేది ఓ సారి వచ్చాక త్వరగా తగ్గదు. కాబట్టి, షుగర్‌తో బాధపడేవారు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.
ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో షుగర్‌తో బాధపడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వారి డెయిలీ రొటీన్ ఎలా ఉండాలో తెలుసుకోండి.
డయాబెటిస్ గురించి పూర్తి వివరాలు
డయాబెటిస్ పూర్తి వివరాలు
మార్నింగ్ రొటీన్..
ఉదయాన్నే లేవడం..
ఎవరైనా సరే ఉదయాన్నే లేవడం చాలా మంచిది. అందులో ముఖ్యంగా షుగర్ ఉన్నవారు మార్నింగ్ లేవడం, త్వరగా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.
మార్నింగ్ లేచి వర్కౌట్ చేయాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. యోగా చేయడం లాంటివి చేయాలి. ఇలా చేస్తే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.
Also Read : Sugar Substitute : ఎండాకాలంలో పటికబెల్లం తింటే శరీరంలోని వేడి తగ్గుతుందా..
షుగర్ లెవల్స్ చెక్..
షుగర్ ఉన్నవారు రెగ్యులర్‌గా రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకుంటుండాలి. దీని కారణంగా బాడీలో ఇన్సులిన్ పరిమాణం కూడా తగ్గుతుంది.
కాబట్టి, ఈ వ్యాధి ఉన్నవారు మార్నింగ్ నిద్రలేచిన వెంటనే పరగడపున రక్తంలో చక్కెర శాతాన్ని చెక్ చేసుకోవాలి. దీని బట్టి షుగర్ లెవల్స్ తెలుస్తాయి.
బ్రేక్‌ఫాస్ట్..
షుగర్ ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్‌ని అస్సలు చేయొద్దు. పీచు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు.
ట్యాబ్లెట్స్..
అదే విధంగా, మెడిసిన్ రెగ్యులర్‌గా తీసుకోవాలి. డాక్టర్ సూచించిన విధంగా వీటిని తీసుకోవాలి. అస్సలు స్కిప్ చేయొద్దు.
Also Read : పీరియడ్స్ టైమ్‌లో ప్యాడ్ రెగ్యులర్‌గా మార్చకపోతే జరిగేది ఇదే..
భోజనం..
అదే విధంగా భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు చెక్ చేసుకుంటుండాలి. ఎందుకంటే కొంతమందికి భోజనం తర్వాత షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
భోజనం చేశాక ఓ సారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. దీని వల్ల రక్తంలో చక్కెరస్థాయి ఎంత, భోజనం తర్వాత పెరిగిందా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
నీరు త్రాగడం..
అదే విధంగా, రోజంతా నీరు త్రాగడానికి ట్రై చేయండి. దీని వల్ల డీహైడ్రేషన్ దూరమవుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వీటితో పాటు సహజ పండ్ల రసాన్ని కూడా తీసుకోవచ్చు. ఇందులో చక్కెర కలపొద్దని గుర్తుపెట్టుకోండి.
స్నాక్స్‌గా..
వీటితో పాటు.. స్నాక్స్ టైమ్‌లో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. కార్బోహైడ్రేట్స్, స్వీట్స్‌కి ఎంత దూరం ఉంటే అంత మంచిది.
కొద్దికొద్దిగా తినండి..
మరో విషయం ఏంటంటే.. ఒకేసారి ఎక్కువగా తినొద్దు. కొద్దికొద్దిగా తినడానికి ప్రయత్నించండి. ఇది రక్తంలో చక్కెర స్థాయి ఆకస్మిక పెరుగుదల, తగ్గుదలని నిరోధించొచ్చు.
సాయంత్రం..
ఇక షుగర్ ఉన్నవారు రాత్రి భోజనంలో ప్రోటీన్లు ఎక్కువగా, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవాలి. అన్నం బదులు రెండు చపాతీలు తింటే మంచిది.
షుగర్ లెవల్ టెస్ట్ : రాత్రి భోజనం చేశాక మళ్ళీ ఓసారి టెస్ట్ చేసుకోండి. రాత్రి భోజనం తర్వాత చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది.
ట్యాబ్లెట్స్..రాత్రి డిన్నతర్ తర్వాత డాక్టర్ సూచించిన ట్యాబ్లెట్స్ మర్చిపోవద్దు.
నిద్ర : షుగర్ ఉన్నవారు బాగా నిద్రపోవాలి. కనీసం 7, 8 గంటలు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
-Dr.Sanjeet Jaiswal, Consultant Diabetologist & Endocrinology, Ramkrishna CARE Hospitals, Raipur
గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More :Health NewsandTelugu News
[ad_2]
Source link
Leave a Reply