[ad_1]
TCS Share Buyback: టెక్నాలజీ జెయింట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), షేర్ల బైబ్యాక్ గురించి ఆలోచిస్తోంది. షేర్ల బైబ్యాక్ ప్రపోజల్ తమ టేబుల్‌పై ఉందని, వచ్చే బుధవారం (అక్టోబర్ 11, 2023) డైరెక్టర్ల బోర్డ్ మీటింగ్ జరుగుతుందని, షేర్స్ బైబ్యాక్ గురించి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని స్టాక్ ఎక్సేంజీలకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌లో ఈ కంపెనీ వెల్లడించింది.
2023 సెప్టెంబర్ క్వార్టర్ (Q2 FY24) ఆర్థిక ఫలితాలను కూడా టీసీఎస్ బుధవారం రోజే ప్రకటిస్తుంది. క్వార్టర్లీ రిజల్ట్స్‌న ఆమోదించడానికి ఆ రోజు డైరెక్టర్లు భేటీ అవుతున్నారు. అదే సమావేశంలో షేర్ల బైబ్యాక్ ప్రపోజల్‌పైనా నిర్ణయం తీసుకుంటారు. డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత, షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్‌ను ఈ టెక్ కంపెనీ మార్కెట్‌కు వెల్లడిస్తుంది. షేర్ల బైబ్యాక్ కోసం కంపెనీ ఎంత డబ్బు కేటాయిస్తుంది, ఎంత ధరకు మించకుండా ఒక్కో షేరును తిరిగి కొనుగోలు చేస్తుంది, తేదీలు ఏంటి అన్న డిటైల్స్ బుధవారం రోజు రిలీజ్ అవుతాయి.
చివరిసారిగా, గత ఏడాది, రూ.18,000 కోట్ల విలువైన షేర్లను టీసీఎస్ బైబ్యాక్ చేసింది. ఒక్కో షేరును రూ. 4,500 ప్రైస్ దగ్గర, మొత్తం 4 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. 2022 మార్చిలో ప్రాసెస్ ముగిసింది.
శుక్రవారం (06 అక్టోబర్ 2023), BSEలో, టీసీఎస్ షేర్లు 0.87% లేదా 31.10 రూపాయల లాభంతో 3,620.20 రూపాయల వద్ద క్లోజ్ అయ్యాయి. గత నెల రోజుల కాలంలో ఈ షేర్లు 4.76% పెరిగాయి. గత ఆరు నెలల టైమ్ పిరియడ్‌లో 10.94%, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 11.03%, గత ఏడాది కాలంలో 18.12% ర్యాలీ చేశాయి.
టీసీఎస్ స్క్రిప్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 3,634.25. శుక్రవారం ఈ రికార్డ్ స్థాయిని టీసీఎస్ షేర్లు క్రియేట్ చేశాయి. కాగా, ఈ కౌంటర్ 52 వారాల కనిష్ట స్థాయి రూ. 3,013.05.
TCS మొదటి త్రైమాసిక ఫలితాలు
2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1 FY24), లాభాల్లో 17 శాతం వృద్ధిని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కంపెనీ నికర లాభం రూ.11,074 కోట్లు కాగా, కంపెనీ ఆదాయం రూ.59,381 కోట్లుగా లెక్క తేలింది. ఆ ఫలితాలతో పాటే మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.9 చొప్పున డివిడెండ్‌ను టీసీఎస్ ప్రకటించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: జూలు విదిలించిన గోల్డ్ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply