PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

షేర్‌హోల్డర్ల సెలబ్రేషన్స్‌తో రాకెట్‌లా దూసుకెళ్లిన జేబీఎం ఆటో, పాత రికార్డ్‌ బద్ధలు

[ad_1]

JBM Auto Share Price: జేబీఎం ఆటో, దీని సబ్సిడియరీ కంపెనీలు సుమారు 5,000 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్స్‌ గెలుచుకోవడంతో షేర్‌హోల్డర్లు సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీంతో, ఇవాళ్టి (శుక్రవారం, 14 జులై 2023) ట్రేడింగ్‌లో, BSEలో, జేబీఎం ఆటో దూసుకెళ్లింది. మెరుపువేగంతో 18% ర్యాలీ చేసి రూ. 1,548 వద్ద కొత్త 52 వారాల రికార్డ్‌ స్థాయికి చేరుకుంది.

“JBM ఆటో లిమిటెడ్, దీని అనుబంధ సంస్థలు గుజరాత్, హరియాణా, దిల్లీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని వివిధ STUలకు, దేశంలోని లీడింగ్‌ ఎంటిటీలకు, ఫార్చ్యూన్ 500 లిస్ట్‌లో ఉన్న కొన్ని కంపెనీలకు దాదాపు 5000 ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేసే ఆర్డర్లు గెలుచుకున్నాయి” అని ఈ ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ప్రకటించింది.

మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి, బీఎస్‌ఇలో, ఈ స్క్రిప్ 11.31% పెరిగి రూ. 1,463.75 వద్ద ట్రేడవుతోంది. 

మల్టీ బ్యాగర్‌ స్టాక్‌ – టార్గెట్‌ ప్రైస్‌
JBM ఆటో, తన ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్‌ సంపాదించి పెట్టింది. ఈ స్టాక్ గత మూడేళ్ల కాలంలో 1600% పైగా దూసుకెళ్లింది. గత 12 నెలల కాలంలో 237% ర్యాలీ చేసింది. గత ఆరు నెలల కాలంలో చూసినా ఈ కౌంటర్‌ 166% లాభాలు ఆర్జించింది. గత నెల రోజుల వ్యవధిలోనే 53% పెరిగింది.

ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, జేబీఎం ఆటో స్టాక్ యావరేజ్‌ టార్గెట్ ప్రైస్‌ రూ. 685. ప్రస్తుత మార్కెట్ ప్రైస్‌ నుంచి 53% తగ్గుదలను ఇది చూపుతోంది. ఈ స్టాక్‌ను ఒకే ఒక్క ఎనలిస్ట్‌ ట్రాక్‌ చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన రేటింగ్‌ “స్ట్రాంగ్‌ సెల్‌”.

కంపెనీ బిజినెస్‌ ఫండమెంటల్స్‌
JBM ఒక స్మాల్‌ క్యాప్‌ కంపెనీ. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్‌ సుమారు రూ. 17,322 కోట్లు. ఆటోమోటివ్ ప్రొడక్ట్స్‌, సబ్‌ సిస్టమ్స్‌ను ఇది తయారు చేస్తుంది. వెహికల్‌ ఎయిర్ ట్యాంక్స్‌, ఛాసిస్ & సస్పెన్షన్ పార్ట్స్‌, క్రాస్-కార్ బీమ్స్‌, ఎగ్జాస్ట్ సిస్టమ్స్‌, ఫ్యూయల్‌ ట్యాంక్స్‌, హీట్ షీల్డ్స్‌ సహా వివిధ ప్రొడక్ట్స్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది.

ట్రెయిలింగ్‌ టెల్వ్‌ మంత్‌ (TTM) బేసిస్‌లో, ఈ స్టాక్‌ EPS 10.28. ప్రస్తుతం 128 PE వద్ద ట్రేడవుతోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ కంపెనీలో ప్రమోటర్లకు 67.52% వాటా ఉంది. మిగిలిన 32.47% పబ్లిక్ షేర్‌హోల్డర్ల చేతుల్లో ఉంది.

JBM ఆటో అమ్మకాలు FY13లో కేవలం రూ.1364 కోట్లు. అక్కడి నుంచి FY23లో రూ.3857 కోట్లకు పెరిగాయి. అదే సమయంలో, నికర లాభం కూడా 57 కోట్ల రూపాయల నుంచి దాదాపు 124 కోట్ల రూపాయలకు పెరిగింది.

2023 మార్చి త్రైమాసికంలో, కంపెనీ ఆదాయం Q4FY22లోని రూ.1,055 కోట్లతో పోలిస్తే, సంవత్సరానికి (YoY) 8% తగ్గి రూ.964 కోట్లకు పడిపోయింది. అదే కాలంలో లాభం రూ.26.81 కోట్లుగా ఉంది.

మరో ఆసక్తికర కథనం: నిన్న లోయర్‌ సర్క్యూట్‌, ఇవాళ అప్పర్‌ సర్క్యూట్‌ – ఒక్క రాత్రిలో ఏం మారింది?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *