[ad_1]
క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్(COPD) అంటే..
ఈ జబ్బులో శ్వాసనాళాలు, లంగ్ టిష్యూ యాల్వియోలై బాగా దెబ్బతింటాయి. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్ ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్లే వాయుమార్గాలను ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా కావాల్సినంత ఆక్సీజన్ ఊపిరితిత్తులకు అందదు. దీంతో రోగి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడతాడు. దీని కారణంగా శ్వాసనాళాలు తగ్గిపోవటం ప్రారంభిస్తాయి. రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాడు, దగ్గు, శ్లేష్మం, గురకకు వంటి సమస్యలు ఎదురవుతాయి. సీఓపీడీ కారణంగా గుండె సంబంధ వ్యాధులు, గుండెపోటు, ఊపిరితిత్తుల కేన్సర్లతో మరణం సంభవించే ప్రమాదం ఉంది.
సీపీఓడీ చికిత్స..
సీఓపీడీకి చికిత్స లేకపోయినా.. సీపీఓడీ లక్షణాలకు చికిత్స పొందితే, దాని తీవ్రతను తగ్గించవచ్చు. ఇన్‌హేలర్ల వాడకంతో ఉపశమనం లభిస్తుంది. వైద్యుని పర్యవేక్షణలో ఉంటూ.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే.. దీని లక్షణాల నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.
- పోషకాహారం తీసుకోవాలి.
- ఓత్తిడి తగ్గించుకోవాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి.
- స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.
- తేలికపాటి వ్యాయామం చేయాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply